- కేంద్రంతో ఫలించిన చర్చలు..
- జీఎస్టీ తగ్గింపు, అదనపు సాయంపై సానుకూలం
- వాస్తవాలు తెలిసి కూడా జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారు
- వైసీపీ కార్యకర్తలకు కండువాలు కప్పి రైతులంటారా?
- క్రిమినల్ రాజకీయాలకు ఆ పార్టీ ప్రతీకగా మారింది
- అధికార దుర్వినియోగం చేసిన వారిని ఉపేక్షించేది లేదు
- వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలోని పొగాకు, ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బుధవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రెండురోజులు ఢిల్లీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్,
లలన్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహన్లతో విస్తృతంగా చర్చలు జరిపా మని తెలిపారు. రైతులకు ఊరటనిచ్చే నిర్ణయాలు త్వరలో వెలు వడనున్నాయని వెల్లడించారు. ముడి పొగాకుపై జీఎస్టీ తగ్గింపు, అదనపు ఆర్థిక సాయం, ఆక్వా ఫీడ్ ధరల నియంత్రణ వంటి కీలక
అంశాలపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించా రని వివరించారు. గత ఏడాది పొగాకు ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఈసారి టొబాకో బోర్డు అనుమతించిన 1.44 మిలియన్ కిలోల ఉత్పత్తికి దాదాపు రెట్టింపు స్థాయిలో సాగు చేశారని తెలిపారు.
జీఎస్టీ తగ్గింపు..సెస్ నుంచి ఆర్థికసాయం
అదే సమయంలో అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు, ముడి పొగాకుపై జీఎస్టీ 27 శాతం నుంచి 40 శాతానికి పెరగడం వంటి పరిణామాలు రంగంపై తీవ్ర ప్రభావం చూపాయని వివ రించారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్ర బాబు పలుమార్లు సమీక్షలు నిర్వహించి కంపెనీలు రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేయాలని ఆదేశించారని చెప్పారు. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ తో సమావేశమై పొగాకు రైతుల సమస్యలను వివరించామని, ముడి పొగాకుపై జీఎస్టీని తగ్గించాలని కోరామని తెలిపారు. ఆ అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ సమావేశ ఎజెండాలో చేర్చి సానుకూల నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. అదేవిధంగా టొబాకో బోర్డు వద్ద రైతుల నుంచి వసూలు చేసిన సుమారు రూ.750 కోట్ల సెస్ నిధుల నుంచి కిలోకు రూ.15 చొప్పున రైతులకు ఆర్థిక సాయం అందిం చాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. ఈ అంశంపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో ఇప్పటికే చర్చలు జరిగాయని, రెండురోజుల్లో సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పొగాకు కొనుగోళ్లపై సానుకూల స్పందన
పొగాకు కొనుగోళ్లపై ఐటీసీ సహా ప్రధాన పరిశ్రమల ప్రతినిధులతో మాట్లాడి రైతుల వద్ద ఉన్న మొత్తం పంటను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేయగా అందరూ సానుకూలంగా స్పందించి కొనుగోళ్లకు హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. ఆక్వా రంగానికి సంబంధించి ఫీడ్ ధరలు తగ్గించే దిశగా కూడా కేంద్రంతో చర్చలు జరిపామని, ఫిష్ మీల్, ఫిష్ ఆయిల్ లో దేశీయ అవసరాలకు కనీసం 50 శాతం
నిల్వ ఉంచి మిగిలిన పరిమాణాన్ని మాత్రమే ఎగుమతి చేయాలని కోరినట్లు చెప్పారు. అలాగే ఆక్వా ఫీడ్ తయారీకి అవసరమైన ముడి పదార్థాల దిగుమతులపై కూడా కేంద్రం సానుకూలంగా స్పందించింద న్నారు. తోతాపురి మామిడి ధరలు తగ్గిన సమయంలో
ప్రభుత్వం వెంటనే స్పందించి కిలోకు రూ.4 ప్రోత్సాహక సాయం అందించి రైతులను ఆదుకుందని, ఇదే ప్రభుత్వ స్పందనకు నిదర్శనమని పేర్కొన్నారు. గొడ్డలి పార్టీ అధినేత జగన్రెడ్డి వ్యవసాయ, ఆక్వా, పొగాకు సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయో గించుకోవాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసిన సమయంలో వ్యవసాయ, నీటిపారుదల రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తి ఇప్పుడు రైతుల పేరుతో రాజకీయాలు చేయడం విడ్డూరమని వ్యాఖ్యానించారు.
















