- ఆసియా క్రీడలకు ఎంపికపై శుభాకాంక్షలు
- ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
ఉండవల్లి(చైతన్యరథం): అంతర్జాతీయ విలువిద్య పోటీల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తోన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్టార్ క్రీడా కారిణి వెన్నం జ్యోతి సురేఖ ఈ ఉదయం ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. ప్రతి ష్టాత్మక 2026 ఆసియా క్రీడలకు భారత జట్టులో ఆమె చోటు దక్కించుకున్నారు. వరుసగా నాలుగోసారి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులతో కలిసి వెన్నం జ్యోతి సురేఖ మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. ఆసియా క్రీడ ల్లో పోటీపడే అవకాశం దక్కించుకున్న జ్యోతి సురేఖను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించి శుభాకాంక్షలు తెలిపా రు. తన ప్రతిభతో విలువిద్య పోటీల్లో రాణిస్తూ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. ఆసియా క్రీడల్లో సత్తా చాటి దేశ కీర్తిప్రతిష్టలు పెంచాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు.













