చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్

డీఈవోలు, ఏపీసీలతో మంత్రి లోకేష్ సమావేశం

by చైతన్యరధం
May 21, 2026 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నూరుశాతం ఎన్‌రోల్‌మెంట్‌పై దృష్టి సారించాలి
  • ప్రభుత్వ విద్యార్థులను సొంత బిడ్డల్లా భావించాలి
  • కనీస మౌలిక సదుపాయాలకు స్టార్ రేటింగ్
  • డీఈవోలు, ఏపీసీలతో మంత్రి లోకేష్ సమావేశం

అమరావతి(చైతన్యరథం): దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ ఉండాలన్నది నా ధ్యేయం. అందుకు అనుగుణంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దేందుకు కృతనిశ్చయంతో ఉన్నా. అంతర్జా తీయస్థాయి అత్యుత్తమ బోధనా పద్ధతులపై అధ్యయనానికి ఉపా ధ్యాయులను విదేశాలకు పంపుతున్నాం. అక్కడ వారు తెలుసుకు న్న మంచి బోధనాపద్ధతులను రాష్ట్రంలో అమలు చేస్తామని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతి సచివాల యంలో రాష్ట్రవ్యాప్తంగా డీఈవోలు, ఏపీసీలతో(అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్) మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. క్వాలిటీ మెరుగుపర్చకపోతే నష్టపోయేది పిల్లలు. ప్రభుత్వ విద్యావ్యవస్థ ఓపెన్ మార్కెట్‌తో పోటీపడాలి. ఇందుకోసం అందరం కలిసిక ట్టుగా పనిచేయాలి. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. వరల్డ్ క్లాస్ బెస్ట్ మోడల్ ఆఫ్ పబ్లిక్ స్కూల్ ఎడ్యుకేషన్ నా లక్ష్యం, ఇందుకోసం అధికారులం తా చిత్తశుద్ధితో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

బిడ్డల భవిష్యత్తు కేంద్రంగా నిర్ణయాలు
ఈ సమావేశం కేవలం సమీక్ష కోసం కాదు, యాక్షన్ ప్లాన్ కోసం ఏర్పాటు చేశాం. నేను విద్యామంత్రిగా బాధ్యతలు స్వీక రించే నాటికి రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఏ పాఠశా లలో ఎంతమంది చదువుతున్నారో రాష్ట్రస్థాయి కనీస డేటా అందుబాటులో లేదు. పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసిన ప్పుడే కేవలం మూడునెలల్లో పూర్తిస్థాయి సమాచారంతో డ్యాష్ బోర్డు తయారుచేశాం. విద్యాశాఖలో కనీస డేటా బేస్ అందుబా టులో లేని పరిస్థితి నుంచి విద్యాశాఖలో నా ప్రయాణం ప్రారం భించాను. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు మన సొంత బిడ్డల్లా భావించి నిర్ణయాలు తీసుకోవాలి. మనం తీసుకునే నిర్ణయాలపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. బిడ్డల భవిష్యత్ కేంద్రంగా నిర్ణయాలు ఉండాలి. డ్యాష్ బోర్డు ప్రకారం యాక్షన్ ప్లాన్ దిశగా డీఈవోలు, ఏపీసీలు పనిచేయాలి. రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది పిల్లలు డ్రాపవుట్స్‌గా ఉన్నారు. నెవర్ ఎన్ రోల్డ్‌పై కూడా ఫోకస్ చేయాలి. నూరుశాతం ఎన్‌రోల్ మెంట్‌పై అధికారులంతా దృష్టిపెట్టాలి. యువగళం పాదయాత్ర సమయంలో నేను కర్నూలు జిల్లాలో పర్యటించేటప్పుడు వలస కార్మికుల కష్టాలను కళ్లారా చూశాను. ఎట్టిపరిస్థితుల్లో పిల్లలు పొలం పనులకు వెళ్లే పరిస్థితి ఉండకూడదు. ఈ విషయంలో ప్రాపర్ ట్రాకింగ్ మెకానిజం ఉండాలని పేర్కొన్నారు.

సంబంధితవార్తలు

మాడుగుల నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యారు.

భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్‌ దేశాలను క్రీడలు, యువత ఒక్కటిగా కలుపుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు.

విజయనగరం నియోజకవర్గం టీడీపీ కార్యకర్తల సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పాల్గొన్నారు.

ఉద్యమంలా జీఎఫఎలఎన్ చేపట్టాలి
లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా గ్యారంటీడ్ ఎఫఎలఎన్ ప్రోగ్రామ్‌ను ఒక ఉద్యమంగా అమలుచేయాలి. వాస్తవాలు తెలుసుకున్నపుడే సరైన నిర్ణయాలు తీసుకోగలం. నిజం చేదుగా, అబద్ధం తీయగా ఉంటుంది. వాస్తవాన్ని అంగీక రిస్తేనే మన ప్రయాణం సరైన దిశగా సాగుతుంది. మేం సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే మీరు సరైన సమాచారం ఇవ్వాలి. ప్రస్తుతం 9వ తరగతికి క్లిక్కర్ టెక్నాలజీ అమలు చేస్తున్నాం, క్రోమ్ బుక్స్ అందించబోతున్నాం. నూరుశాతం జీఎఫఎలఎన్ సాధనే లక్ష్యంగా పనిచేయాలి. 5 శాతం వెనుకబడటం అంటే సాధారణమైంది కాదు. వాస్తవంలో అది లక్షల సంఖ్యలో ఉంటుంది. వన్ క్లాస్`వన్ టీచర్ విధానాన్ని అమలు చేస్తు న్నాం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 10 శాతం ఎన్‌రోల్‌మెంట్ ఇంప్రూవ్ చేయాలి. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇందుకోసం సమష్టిగా పనిచేయాలని సూచించారు.

ఆత్మవిశ్వాసం నింపిన విద్యాశాఖ ప్రకటన
ప్రభుత్వ స్కూళ్లలో క్వాలిఫైడ్, ప్రతిభావంతమైన టీచర్లు ఉన్నారు. పదోతరగతి ఫలితాలపై ఇటీవల తొలిసారి ప్రభుత్వమే యాడ్ ఇచ్చింది. అది పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపింది. అత్యుత్త మ ఫలితాలు సాధించిన ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఏడాది మెరుగైన ఫలితాల సాధనకు వందరోజుల ప్రణాళిక బాగా ఉపకరించింది. అది అవసరం లేకుండానే ట్రాన్సిషన్ జరిగాలి, ఫౌండేషన్ పకడ్బందీగా ఉండా లి. దానిపై అధికారులంతా శ్రద్ధ వహించాలని సూచించారు.

రెండేళ్లలో రాష్ట్రమంతటా స్మార్ట్ కిచెన్లు
రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ స్కూళ్ల మౌలిక సదుపాయాల కోసం స్టార్ రేటింగ్ ప్రవేశపెట్టాం. దీనిపై అధికారులు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. క్రిటికల్ ఇన్ ఫ్రా కోసం ప్రభుత్వం నుంచి నిధులిస్తున్నాం. ఇందుకోసం అవసరమైతే దాతల సహ కారం తీసుకోండి. ప్రతి పాఠశాలకు లీక్ ప్రూఫ్ బిల్డింగ్, పెయింటింగ్స్, డ్రింకింగ్ వాటర్, టాయ్ లెట్, బెంచిలు కచ్చితంగా ఉండాలి. బేసిక్ ఇన్ ఫ్రా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉండాలన్నదే మా ధ్యేయం. దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కడపలో స్మార్ట్ కిచెన్ అద్భుతంగా చేశారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్రం మొత్తం స్మార్ట్ కిచెన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఇంటర్నేషనల్ స్కూలుగా నిడమర్రు పాఠశాల
మంగళగిరి నియోజకవర్గం నిడమర్రు స్కూలును ఇంటర్నే షనల్ స్కూలుగా తీర్చిదిద్దుతున్నాం. అక్కడ తొలిసారి నో అడ్మిష న్ బోర్డు పెట్టారు. నెల్లూరులో కూడా రెండు స్కూల్స్‌ను మంత్రి నారాయణ అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి జిల్లాలో ఒక పాఠశాలను మోడల్ స్కూలుగా తీర్చిదిద్దాలని అధికారులను కోరుతున్నా. అమెరికాలో స్కూల్ డిస్ట్రిక్ట్ అనే కాన్సెప్ట్ అమలులో ఉంది. నిడమర్రులో మేం కల్పించిన అత్యుత్తమ సౌకర్యాల వల్ల పక్క నియోజకవర్గాల వారు మా నియోజకవర్గానికి తమ బిడ్డల అడ్మిషన్ కోసం నివాసం మార్చుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇదే పరిస్థితి కల్పించే లక్ష్యంతో పని చేయాలి. దీనిపై అధికారులు దృష్టి సారించాలని విజ్జప్తి చేశారు.

బోధనపైనే ఉపాధ్యాయులు దృష్టిపెట్టాలి
నేను విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టాక అనేక సంస్కర ణలు తెచ్చా. ఉపాధ్యాయులు బోధనపైనే దృష్టిపెట్టాలి. అధికారు లు అడ్మినిస్ట్రేషన్‌పై శ్రద్ద వహించాలి. లీప్ యాప్ ద్వారా పనివిధానాన్ని మెరుగుపర్చుకోవాలి ఇప్పుడు మొత్తం విధానానికి లీప్ యాప్ కేంద్రంగా ఉంటుంది. రాష్ట్ర, జిల్లా, మండల, స్కూలు స్థాయిలో ఒకేవిధమైన డేటా ఉండాలి. లక్ష్య సారూప్యత ఉండాలి. డ్యాష్ బోర్డుపై శ్రద్ధపెట్టాలి. ఇదంతా పూర్తయ్యాక పబ్లిక్ డ్యాష్ బోర్డుకు యాక్సెస్ ఇస్తాం. పాల్, ఏఐ బేస్ లెర్నింగ్, ఏఐ ట్యూటర్ త్వరలోనే అమలు చేయబోతున్నామని వివరిం చారు.

నైతిక విలువలు ముఖ్యం
టెక్నాలజీతో పాటు నైతిక విలువలు చాలా అవసరం. అందుకే చాగంటి కోటేశ్వరరావును క్యాబినెట్ హోదాతో అడ్వ యిజర్‌గా పెట్టాం. ప్రతి శనివారం వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్‌పై దృష్టిపెట్టాలి. ఒక సోషల్ మీడియా పోస్టులో కొడుకు తల్లిని చంపే పరిస్థితి చూశాను. నైతిక విలువల బోధనతో ఇటువంటి ఘటనలను నివారించే అవకాశముంది. విద్యాశాఖపై పవిత్రమైన బాధ్యత ఉంది. జెండర్ సెన్సిటివిటీ కూడా చాలా ముఖ్యం. ఉపా ధ్యాయులకు ఎక్స్‌పోజర్ విజిట్స్ ఏర్పాటు చేస్తున్నాం. యోగా, స్పోర్ట్స్‌పై శ్రద్ధ పెడుతున్నాం. స్పోర్ట్స్ కిట్స్ ఇస్తున్నాం. శాప్ ద్వారా స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెడుతున్నాం. విద్యాశాఖ వద్దని చాలామంది నన్ను వారించినా సమాజంలో నేను ఆశించిన మార్పు విద్యతోనే సాధ్యమని నమ్మి ఈ శాఖను తీసుకున్నాను. నూరుశాతం ఫలితా లు సాధించినపుడే నేను విద్యాశాఖ మంత్రిగా సంతృప్తి చెందుతా. అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మెరుగైన ఫలితాలు సాధించాల్సిన పవిత్ర బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు.

రెండేళ్లలో విద్యావ్యవస్థలో అనూహ్య మార్పులు
హెచఆర్‌డీ కార్యదర్శి కోన శశిధర్ మాట్లాడుతూ పాఠశాల విద్య భవిష్యత్ కార్యాచరణ గురించి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. గత రెండేళ్లలో పాఠశాల విద్యావ్యవస్థలో మునుపెన్నడూ చూడని సంస్కరణలు చూశాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నా యి. అనేకసార్లు మంత్రి లోకేష్ రాష్ట్రస్థాయి అధికారులతో సమీ క్షించి దశ, దిశ నిర్దేశించారు. ఒక్కోసారి ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సమావేశాలు నిర్వహించారు. వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు నిరంతరం చర్చలు జరిపారు. రెండేళ్లలో విద్యాశాఖలో గుణాత్మకమైన మార్పులు తెచ్చిన మంత్రి లోకేష్‌కు ధన్యవాదాలు. కఠినమైనప్పటికీ వాస్తవాన్నే చెబుదాం. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ఇప్పటివరకు ముందుకుసాగాం. కొంతవరకు సఫలీకృతమయ్యాం. ఇప్పుడు మనం సంస్కరణల దశ నుంచి కన్సాలిడేషన్ వైపు వెళుతున్నాం. ఈ స్థితిలో ఎదుగుతున్న మొక్కను మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నిర్దేశిత లక్ష్యాలను చేరుకునే వరకు నిర్విరామంగా కృషిచేయాలి. లక్ష్యాలపై క్లియర్ డెడ్ లైన్ పెట్టుకుని జవాబుదారీతనంతో ముందుకుసాగాలని సూచించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా, ఇతర రాష్ట్రస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Previous Post

కృష్ణమ్మ ఒడినుంచి..పడవల ‘వంద’నం!

Next Post

విలువిద్య క్రీడాకారిణికి లోకేష్ అభినందన

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026

కార్యకర్త
@ August 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

కార్యకర్త
@ August 21, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంతభవనాలు

చైతన్యరధం
@ August 20, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist