చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఔషధ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రత్యేక కమిటీ

వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి ఆదేశం

by చైతన్యరధం
Jul 4, 2026 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
ఔషధ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రత్యేక కమిటీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రోగుల అవసరాలకు తగ్గట్టు తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు
  • పరికరాలు, మిషన్ల కొనుగోలు, సరఫరాకు నిర్ధిష్ట క్యాలెండర్
  • ఆసుపత్రుల భవన నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచాలి
  • వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి ఆదేశం
  • సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సుదీర్ఘ సమీక్ష

అమరావతి (చైతన్య రథం): ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోలు, పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని వైద్య, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేసి, రోగులకు మందులు అందుబాటులో ఉంచడంలో ఎటువంటి ఇబ్బందిలేని విధంగా కొత్త వ్యవస్థను రూపొందించాలని మంత్రి తెలిపారు. ఇందుకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ నేతృత్వంలో ప్రజారోగ్య శాఖ సంచాలకులతోపాటు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సీనియర్ అధికారి, రాష్ట్ర వైద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎపిఎంఎసఐడిసి) అధికారి (డ్రగ్స్ విభాగం), ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఫార్మసిస్టులతో కమిటీని ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం సాయంత్రం మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే మందులు, సర్జికల్స్, పరికరాల కొనుగోలు విధానం, పంపిణీ తీరు, ఆసుపత్రుల నిర్మాణాల పురోగతి, ఇతర అంశాలపై వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ, ఇతర అధికారులతో సుదీర్ఘంగా సుమారు 4 గంటలపాటు చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు ఏపీఎంఎసఐడీసీ ద్వారా ప్రభుత్వాసుపత్రులకు జరిగే మందుల కొనుగోలు, సదరు ఆసుపత్రుల ద్వారా స్థానికంగా జరిగే మందుల కొనుగోలు (లోకల్ పర్చేజ్), పంపిణీ, ఇతర అంశాలగురించి మంత్రికి వివరించారు. ఆసుపత్రుల నుంచి వచ్చే డిమాండ్ల అనుసరించి త్రైమాసిక (క్వార్టర్లీ) విధానంలో మందులను పంపుతున్నామని అధికారులు తెలిపారు. అనంతరం మంత్రి సత్యకుమార్ స్పందిస్తూ ప్రస్తుత విధానంలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు.

అన్ని కోణాలనుంచి అధ్యయనం జరగాలి
ఆసుపత్రులకు రోగులు ఎంత మంది వస్తున్నారు? ఓపీ, ఐపీ ఎలా ఉంటుంది?, మందుల అవసరం ఎలా ఉంది,? డిమాండ్లను ఎలా ప్రస్తుతం పంపుతున్నారు? అన్ని ఆసుపత్రులనుంచి వచ్చే డిమాండ్లను ఏవిధంగా క్రోడీకరిస్తున్నారు? మందుల కంపెనీలకు ఎలా ఆర్డర్లు ఇస్తున్నారు? ఎంత సమయంలో ఆసుపత్రులకు చేరుతున్నాయి? జాప్యం జరిగితే ఆసుపత్రుల మెడికల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? డిమాండుకు తగ్గట్టు మందుల సరఫరా జరుగుతోందా? లేదా? మందుల అవసరాల డేటాలో ఎంతవరకు కచ్చితత్వం ఉంటుంది? ఎక్కడెక్కడ లోపాలున్నాయి? వాటిని ఎలా మెరుగుపరచాలి? తమిళనాడులో ఎలాంటి ప్రమాణాలు అనుసరిస్తున్నారు? అక్కడి ఉత్తమ విధానాలపై కమిటీ అధ్యయనం చేయాలి. ఇతర అంశాలపై లోతుగా, క్షుణ్ణంగా అధ్యయనం చేసి, రెండు వారాల్లో ప్రభుత్వానికి కమిటీ రిపోర్టు ఇవ్వాలి” అని మంత్రి స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-07-2026

మూసేసే దుకాణంలో గుమస్తాలా సజ్జల తీరు

రైతు పొట్టగొట్టే కుట్రలా?

పరికరాల కొనుగోలుకు క్యాలండర్ రూపొందించాలి
ఆసుపత్రులనుంచి పరికరాలు, మిషన్‌ల కోసం ఏపీఎంఎసఐడీసీకి వచ్చే ఇండెంట్ల విధానంలోనూ మార్పులు రావాలన్నారు. ఆసుపత్రుల సూపరింటెండెంట్ల నుంచి వచ్చే పరికరాల కొనుగోలు ఇండెంట్లు, సరఫరా నిర్ధిష్ట సమయంలో జరిగేలా ప్రత్యేకంగా క్యాలండర్ విధానాన్ని రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు. దీనివల్ల టెండర్లను పలుమార్లు పిలిచే అవకాశం తలెత్తదని, సుహృద్భావ వాతావరణంలో పోటీ ఏర్పడి ధరలు తగ్గే అవకాశం ఉందని మంత్రి సత్యకుమార్ సూచించారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా త్వరలో ప్రారంభించనున్న ‘క్రిటికల్ కేర’ బ్లాక్‌ల నిర్మాణాల పురోగతి, సన్నాహక ఏర్పాట్లను మంత్రి అధికారులతో చర్చించారు. పూర్తయిన 9 క్రిటికల్ బ్లాక్‌ల నిర్మాణాలను, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబరేటరీలను కూడా కేంద్ర మంత్రి ఏకకాలంలో ప్రారంభిస్తారని, దీనికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టంచేశారు. సమీక్షా సమావేశంలో ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ రూ.44 కోట్లతో చేపట్టిన 150 ఆయుష్ డిస్పెన్సరీల పునర్నిర్మాణాలు, నూతన భవన నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయని మంత్రికి వివరించారు. అలాగే 6 ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణాల (రూ.90 కోట్ల వ్యయం)కు అవసరమైన స్థల సేకరణ, రూ.210 కోట్లతో మూడు జూ.ఆయుష్ కళాశాల ఏర్పాటు చర్యలను మంత్రికి వివరించారు. విశాఖలోని ఆయుష్ శాఖకు చెందిన ల్యాబరేటరీ నిర్మాణం పూర్తయిందన్నారు. ‘ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద’ ఏర్పాటుకు అవసరమైన ఆమోదంపై కేంద్ర ప్రభుత్వంతో జరుగుతున్న సంప్రదింపులపైనా మంత్రి అధికారులతో చర్చించారు.

పిహెచ్‌సీ, సిహెచ్‌సి, ఇతర నిర్మాణాల పురోగతిపై ఆరా
గడిచిన రెండేళ్లలో జాతీయ ఆరోగ్య మిషన్, పీఎం అభిమ్, 15వ ఆర్ధిక సంఘంకింద రూ.1,450 కోట్లతో చేపట్టిన 100 పీహెచ్సీలు, తొమ్మిది సీహెచ్సీలు, సుమారు 4,500 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల భవన నిర్మాణాల పురోగతి, 20 పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణాల పురోగతిని మంత్రి సమీక్షిస్తూ పనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర జాతీయ ఆరోగ్య మిషన్ అధికారులను ఆదేశించారు. అలాగే, పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాల పురోగతిని మంత్రి సమీక్షిస్తూ త్వరగా పనులు పూర్తిచేసి, వినియోగంలోకి తేవాలన్నారు. అదేవిధంగా 11 పూర్వ వైద్య కళాశాలల్లో జరుగుతోన్న రకరకాల నిర్మాణాలను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయాలన్నారు. విద్యార్థుల సౌకర్యాలు పరిగణనలోనికి తీసుకుని పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.

ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్‌కు అక్రిడిటేషన్ తెప్పించాలి
తిరుపతి, విశాఖలో రూ.45 కోట్లతో అత్యాధునిక పరికరాలు/ మెషిన్లతో సిద్ధమైన స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీలు రాబోయే మూడునెలల్లో ఎనఎబీఎల్ అక్రిడిటేషన్ తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలిచ్చారు. ఈ రెండు లేబరేటరీల్లో నియామకాలు పూర్తయ్యాయన్నారు. తిరుమలలో స్టేట్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్, విశాఖలో ల్యాబ్‌లో నమూనాల పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపిన 78 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, 72 ఇతర పోస్టుల (కొత్తవి) భర్తీకి ఆర్థిక శాఖ నుంచి ఆమోదం పొందాలని తెలిపారు. ఇవికాకుండా రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి వచ్చిన 278 శాంక్షన్డ్ పోస్టుల్లో సుమారు 150 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని కూడా త్వరితగతిన భర్తీచేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. విశాఖ, గుంటూరు తిరుమల, తిరుపతి, కర్నూలు స్టేట్ ఫుడ్ ల్యాబుల్లో ఈ నియామకాలు జరిగేందుకు ప్రత్యేకంగా చొరవ చూపాలని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబును ఆదేశించారు.

Previous Post

మూసేసే దుకాణంలో గుమస్తాలా సజ్జల తీరు

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 04-07-2026

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-07-2026

కార్యకర్త
@ July 4, 2026
మూసేసే దుకాణంలో గుమస్తాలా సజ్జల తీరు
ఆంధ్రప్రదేశ్

మూసేసే దుకాణంలో గుమస్తాలా సజ్జల తీరు

చైతన్యరధం
@ July 4, 2026
రైతు పొట్టగొట్టే కుట్రలా?
ఆంధ్రప్రదేశ్

రైతు పొట్టగొట్టే కుట్రలా?

చైతన్యరధం
@ July 4, 2026
లిఫ్ట్ ఇరిగేషన్‌కు పూర్వ వైభవం
ఆంధ్రప్రదేశ్

లిఫ్ట్ ఇరిగేషన్‌కు పూర్వ వైభవం

చైతన్యరధం
@ July 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 03-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-07-2026

కార్యకర్త
@ July 3, 2026
నైపుణ్యాలను పెంచేందుకే ఇంటర్నేషనల్ వర్సిటీ
ఆంధ్రప్రదేశ్

నైపుణ్యాలను పెంచేందుకే ఇంటర్నేషనల్ వర్సిటీ

చైతన్యరధం
@ July 3, 2026
అమరావతి విధ్వంసమే గొడ్డలి పార్టీ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

అమరావతి విధ్వంసమే గొడ్డలి పార్టీ లక్ష్యం

చైతన్యరధం
@ July 3, 2026
ఆంధ్రప్రదేశ్

గ్రామీణాభివృద్ధిలో ఏపీని అగ్రగామిగా నిలుపుతాం

చైతన్యరధం
@ July 3, 2026
Load More

ముఖ్య వార్తలు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ July 2, 2026
ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

చైతన్యరధం
@ July 1, 2026
అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

చైతన్యరధం
@ June 30, 2026
మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!

మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!

చైతన్యరధం
@ June 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఔషధ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రత్యేక కమిటీ

ఔషధ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రత్యేక కమిటీ

చైతన్యరధం
@ July 4, 2026
మూసేసే దుకాణంలో గుమస్తాలా సజ్జల తీరు

మూసేసే దుకాణంలో గుమస్తాలా సజ్జల తీరు

చైతన్యరధం
@ July 4, 2026
రైతు పొట్టగొట్టే కుట్రలా?

రైతు పొట్టగొట్టే కుట్రలా?

చైతన్యరధం
@ July 4, 2026
లిఫ్ట్ ఇరిగేషన్‌కు పూర్వ వైభవం

లిఫ్ట్ ఇరిగేషన్‌కు పూర్వ వైభవం

చైతన్యరధం
@ July 4, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist