- గత నెల 1 నుంచి ఉచిత విద్యుత్ అమలు
- మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు
- మర మగ్గాలకు 500 యూనిట్లు
- జీరో పేమెంట్‌తో మే నెల బిల్లుల రాక
- చేనేతల కుటుంబాల్లో హర్షాతిరేకాలు
- చంద్రబాబు,లోకేష్‌కు ధన్యవాదాలు
- ఏడాది ఉపాధే లక్ష్యం : మంత్రి సవిత
అమరావతి(చైతన్యరథం): ఇచ్చిన మాటకు కట్టుబడుతూ నేతన్నలకు ఇచ్చిన హామీ నెరవేర్చి కూటమి ప్రభుత్వం నేతన్నల కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. ఉచిత విద్యుత్ పథకం అమలు కావడంతో తొలి నెలలో జీరో పేమెంట్ విద్యుత్ బిల్లు రావడంతో చేనేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక భారం తగ్గడంతో మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. ఒకవైపు చేనేత పరిశ్ర మకు పూర్వవైభవం తీసుకొచ్చేలా చర్యలు చేపడుతూనే, నేతన్నల కు వ్యక్తిగత లబ్ధి కలిగేలా పథకాలు అమలు చేస్తోంది. దీనిలో భాగంగా గత ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి చేనేతలకు మేలు కలిగేలా కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా 1.04 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందజేసేలా చర్యలు చేపట్టింది. మగ్గంపై నేసే నేతన్న లకు నెలకు 200 యూనిట్లు, మర మగ్గంపై నేసే నేతన్నలకు 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయిం చారు. ఉచిత విద్యుత్ పథకం అమలుతో చేనేత కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలిగింది.
జీరో విద్యుత్ బిల్లుల రాక
గత నెల ఒకటో తేదీ నుంచి ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి రావడంతో రెండు రోజుల నుంచి గ్రామాల్లో చేనేతలకు విద్యుత్ బిల్లులను ట్రాన్స్‌కో అధికారులు అందజేస్తూ వస్తున్నారు. జీరో పేమెంట్ విద్యుత్ బిల్లులు రావడంతో చేనేతల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. బిల్లులు చెల్లించాల్సిన అవసరంలేదని ట్రాన్స్‌కో అధికారులు చెబుతుండడంతో వారంతా మురిసిపోతు న్నారు. చేనేత, విద్యుత్ శాఖాధికారులు సమన్వయంతో పనిచేస్తూ నేతన్నల ఉచిత విద్యుత్ పథకం విజయవంతానికి తమ వంతు పాత్ర పోషించారు. రాష్ట్రంలో 50,252 మగ్గం నేతన్నల కుటుం బాలను, 6,995 మరమగ్గం మీద నేసే కుటుంబాలను ఉచిత విద్యుత్ పథకం కింద అర్హులుగా గుర్తించారు. వారికి ఉచిత విద్యుత్ సరాఫరా చేశారు. మిగిలిన అర్హులకూ ఉచిత విద్యుత్ పథకం వర్తించేలా కృషి చేస్తున్నారు.
ఉచిత విద్యుత్‌తో ఆర్థిక భరోసా
ఉచిత విద్యుత్‌తో మగ్గం నేతన్నలకు నెలకు రూ.720లు, సంవత్సరానికి రూ.8,640లు లబ్ధి కలగనుంది. మరమగ్గం మీద నేసే కుటుంబానికి నెలకు రూ.1,800, ఏడాదికి రూ.21,600 లబ్ధి కలుగనుంది. ఉచిత విద్యుత్ రూపంలో నెలనెలా ఆర్థిక భారం తప్పిందని, తమకు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తోందని నేతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబ డుతూ ఉచిత విద్యుత్ హామీ నెరవేర్చిన సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్‌కు, కూటమి ప్రభుత్వానికి చేనేతలు ధన్యవా దాలు తెలియజేస్తున్నారు.
నేతన్నలకు 365 రోజులూ ఉపాధే లక్ష్యం
చేనేత కార్మికులకు గౌరవ జీవనం కల్పించడమే కూటమి ప్రభు త్వ లక్ష్యం. సగం ధరకే చీర, దోవతి నినాదంతో ఆనాడు అన్న ఎన్టీఆర్ చేనేత రంగానికి ఊపిరిపోస్తే.. నేడు సీఎం చంద్రబాబు నేతన్నలకు ఆర్థిక మేలు కలుగజేసేలా పథకాలు రూపొందిస్తు న్నారు. పెన్షన్లు, నూలుపై సబ్సిడీ, త్రిఫ్ట్ ఫండ్ నిధులు, ముద్ర రుణాలు, 90 శాతం సబ్సిడీ ఆధునిక పరికరాలు అందజేత వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించేలా కూటమి ప్రభుత్వం పలు ఒప్పందాలు చేసుకుంది. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు రూ.4 వేల చొప్పున పెన్షన్ అందజేస్తోంది. ఏటా రూ.5 కోట్ల మేర త్రిఫ్ట్ ఫండ్ నిధులు కేటాయిస్తోంది. నూలుపై 15 శాతం సబ్సిడీ అందజేస్తోంది. ఆప్కో ద్వారా చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తోంది. ఆన్ లైన్ ద్వారా నేరుగా వినియోగదారుల ఇళ్లకే చేనేత ఉత్పత్తులను డోర్ డెలివరీ చేస్తోంది. 2,640 మంది చేనేత కార్మికులకు ముద్ర పథకం కింద రూ.24.43 కోట్లు అందచేసిం ది. రాష్ట్ర వ్యాప్తంగా మెగా టెక్స్ టైల్స్ పార్కులు, క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. గత నెల ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకంతో నేతన్న కుటుంబాలకు మరింత లబ్ధి కలుగు తోంది. మగ్గం నేతన్నలకు ఏడాదికి రూ.8,640లు, మర మగ్గం నేతన్నలకు రూ.21,600 లబ్ధి కలుగుతోంది. చేనేతలకు 365 రోజుల పాటు పని కల్పించడమే సీఎం చంద్రబాబు నేతృ త్వంలోని కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. ఉచిత విద్యుత్‌తో నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించిన సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్‌కు చేనేతల తరఫున ధన్యవాదాలు.
















