- కీలక సమయంలో చంద్రబాబు రాజనీతి
- భిన్నమైన రాజకీయ పరిస్థితుల్లో మోదీకి అండగా నిలుస్తూ ప్రసంగం
- మిత్రధర్మాన్ని పాటిస్తూ బాసటగా చాతుర్యం
- రైట్ టైమ్..రైట్ లీడర్ అంటూ కితాబు
- స్టాండింగ్ ఓవెషన్ తో సంఘీభావం
- రాష్ట్ర, దేశ ప్రయోజనాలు, సుస్థిర ప్రభుత్వాలు ముఖ్యమనే సందేశం దూరదృష్టికి నిదర్శనం
అమరావతి (చైతన్యరథం): ఉత్తరాంధ్ర దశ దిశ మార్చే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఆ ప్రాంత వాసుల్లో జోష్ నింపింది. లక్షలాదిగా తరలివచ్చిన జనంతో పండుగ వాతావరణంలా కార్యక్రమం జరగడం కూటమి ప్రభుత్వం చేసిన మేలుపై ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న ఆదరణకు నిదర్శనం. అదే సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే కాకుండా.. రాష్ట్రంలో ఈ అంశంపై జరిగిన ఎన్నడూ లేని విధంగా చర్చ జరగడం విశేషం. ప్రధాని పర్యటన, విమానాశ్రయ ప్రారంభోత్స వాన్ని గ్రాండ్ సక్సెస్ చేయడమే కాకుండా కీలకమైన సమయంలో సీఎం చంద్రబాబు రాజనీతి చాటుకున్నారు. దేశంలో భిన్నమైన పరిస్థితులు ఉన్న సమయంలో తన ప్రసంగం ద్వారా సమాజానికి ఒక మేసేజ్ ఇచ్చారు. ఎన్డీయేలో నమ్మకమైన, కీలకమైన రాజకీ య నేతగా కీలక సమయంలో మోదీకి అండగా నిలుస్తూ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.
భోగాపురం వేదికగా చాతుర్యం
భోగాపురం ఎయిర్ పోర్టుకు కొబ్బరి కాయ కొట్టి శంకుస్థాపన చేసింది నేను…ఇప్పుడు పూర్తి చేసి గుమ్మడి కాయ కట్టింది నేనే.. ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర ఉత్తమాంధ్రగా దశ, దిశ తిరగనుంద ని చంద్రబాబు తన ప్రసంగంలో చెప్పారు. ఆయన చెప్పినట్లు శంషాబాద్ హైదరాబాద్ దశ దిశను ఎలా మార్చిందో.. ఇక్కడ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో రానున్న రోజుల్లో ఈ ఎయిర్పోర్టు కీలకం కానుంది. దీంతో ప్రారంభ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రధాని మోదీని ఆహ్వానించి లక్షల మంది సమక్షంలో ఎయిర్పోర్ట్ను ప్రారంభించారు. దీని వల్ల పెద్ద ప్రాజెక్టు పూర్తి చేసిన పేరు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. అయితే ఇదే సభను ప్రధాని మోదీ ఇమేజ్
పెంచేలా చంద్రబాబు వ్యూహరచన చేసి అమలు చేశారు. 12 ఏళ్లుగా తిరుగులేని నేత గా ఉన్న మోదీపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సమయంలో మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. దీంతో సీఎం చంద్రబాబు అత్యంత ముఖ్యమైన పర్యటనగా దీన్ని త భావించారు. వేల మంది తో థింసా నృత్యంతో స్వాగతం నుంచి సభలో ఆయన ప్రసంగం లో ప్రస్తావించిన అంశాల వరకు మోదీ గౌరవం మరింత పెంచే లా వ్యవహరించారు. ప్రధాని మోదీకి ఘన స్వాగతం ద్వారా జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. మోదీ క్రేజ్ తగ్గలేదు అని పరోక్షంగా ఈ కార్యక్రమం ద్వారా దేశానికి వివరించారు.
సరైన సమయంలో సరైన నేత
ఇకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగంలో 12 ఏళ్లుగా ప్రధాని మోదీ సాధించిన విజయాలను ప్రత్యేకంగా ప్రస్తావిం చారు. మోదీ ఎందుకు గొప్ప అనే విషయాన్ని వివరించారు. కేంద్రం అందిస్తున్న సహకారం, రాష్ట్రంలో పోలవరం, అమరావ తి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ వంటి అంశాలను గుర్తు చేస్తూ మోదీకి థ్యాంక్స్ చెప్పారు. ఏకంగా స్టాండింగ్ ఓవియేషన్తో ప్రధాని మోదీకి ప్రజలు థ్యాంక్స్ చెప్పారు. వాస్తవంగా రెండేళ్లలో రాష్ట్రం ఈ స్థాయికి రావడానికి ప్రధాని మోదీ చేసిన సాయం ఎంతో ఉపయోగపడింది. దీంతో ఆ విషయాల ద్వారా మోదీని చంద్రబాబు కీర్తించారు. అంతేకాకుండా 25 ఏళ్లుగా ముఖ్యమం త్రిగా, ప్రధానిగా మోదీ చేసిన విజయాలను, అంతర్జాతీయ స్థాయి లో భారత్కు పేరు తెచ్చిన వైనాన్ని వివరించి ‘మోదీ ది గ్రేట్’ అని బలంగా చెప్పారు. ప్రధానిపై ప్రతిపక్షాలు విరుచు కుపడుతున్న సమయంలో భాగస్వామ్య పార్టీ ముఖ్యమంత్రిగా ఆయనకు అండగా నిలిచారు. మోదీ దేశానికి సరైన సమయంలో సరైన నేత అని చెప్పుకొచ్చారు. ఎటువంటి బేషజాలకు పోకుండా ఓపెన్ మైండ్తో చెప్పాలనుకుంది చెప్పారు.
ఏన్డీయేలో విలువైన భాగస్వామి
మోదీని బలపరచడం అంటే దేశాన్ని బలపరచడం అని నేరుగా వ్యాఖ్యానించారు. విమర్శలు చేసే వాళ్లు ఆలోచించుకోవాలని కూడా చంద్రబాబు ప్రసంగంలో చెప్పారు. తద్వారా కీలకమైన సమయంలో, క్లిష్ట పరిస్థితిలో అండగా నిలిచి నమ్మకమైన భాగ స్వామి అని నిరూపించుకున్నారు. ట్రస్ట్ పాలిటిక్స్క నిదర్శనంగా నిలిచారు. ఈ రోజు సభలో ప్రసంగం ద్వారా చంద్రబాబు ఇచ్చిన మెసేజ్ అయన రాజనీతి చాటిచెపుతుంది. ఎక్కువగా పొగిడేశారు అని ప్రతిపక్ష నేతల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నా దేశ సంక్షేమం కోసం మోదీకి అండగా నిలిచి నిజమైన రాజనీతిజ్ఞుడి లా వ్యవహరించారు. తద్వారా రాష్ట్రానికి రానున్న రోజుల్లో కూడా కేంద్రం నుంచి మరింత సహకరించే వాతావరణం కల్పించారు. వాస్తవంగా ఈ అంశాలు బీజేపీ ముఖ్యమంత్రులు, ఇతర నేతలు చేస్తే అంత చర్చ అయ్యే అవకాశం లేదు. దేశంలో 48 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండి, కీలక పాలసీల్లో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు లాంటి నేత చేసిన వ్యాఖ్యలు కాబట్టి ఎన్డీయేకు బలా న్ని ఇస్తాయి.ఏదిఏమైనా కీలకమైన సమయంలో జరిగిన ఎయిర్ పోర్ట్ ప్రారంభ సభలో చంద్రబాబ తన విధేయతను, అభిమానాన్ని చాటుకున్నారు. దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో దేశంలో క్రెడి బిలిటీ ఉన్న నేతగా గుర్తింపు పొందిన ఆయన ఈ అంశంలో మరో మెట్టు ఎక్కారనడంలో ఎటువంటి సందేహమూ లేదు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం ప్రజలకు ఒక గొప్ప సందేశాన్ని పంపే ప్రయత్నం చేశారు.















