- వారి కోసం విశ్రాంతి గదులు, సౌకర్యాలు
- 15 నగరాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభం
- తర్వాత నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేస్తాం
- ఉపాధి సమాచారం కూడా అందజేస్తాం
- స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు వేగవంతం
- ఈఎసఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీల విస్తరణకు చర్యలు
- కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
మంగళగిరి(చైతన్యరథం): అంతర్జాతీయ కార్మికుల దినోత్స వం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించి నట్లు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. శనివారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గత 22 నెలల కాలంలో కార్మికుల జీవితాల్లో గణనీయమైన మార్పు లు తీసుకువచ్చామని పేర్కొన్నారు. కార్మికుల కోసం రాష్ట్రవ్యాప్తం గా అనేక సంక్షేమ, మౌలిక సదుపాయాల కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మేడే సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించిన “లేబర్ అడ్డా” పథకం రాష్ట్రంలోని 15 నగరాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానుందని చెప్పారు. రోజువారీ కూలీలు, జట్టు కార్మికులు రోడ్లపై నిలబడి పనుల కోసం ఎదు రుచూడాల్సిన పరిస్థితిని తొలగించేందుకు ఈ కేంద్రాలు ఉప యోగపడనున్నాయని వివరించారు.
కార్మికులు విశ్రాంతి గదులు, సౌకర్యాలు
లేబర్ అడ్డా పథకంలో భాగంగా మండుటెండల్లో కార్మికులు ఇబ్బందులు పడకుండా విశ్రాంతి గదులు, తాగునీరు, మరుగు దొడ్లు వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఆధునిక పరికరాల వినియోగంపై శిక్షణ, ఉపాధి అవ కాశాలపై సమాచారం కూడా అందించనున్నట్లు వెల్లడించారు. యాజమాన్యాల నుంచి కార్మిక అవసరాల డేటా సేకరించి అవసరమైన వారికి పని కల్పించే విధంగా ఈ కేంద్రాలను అభి వృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. పైలెట్ ప్రాజెక్టు విజయవం తమైతే ప్రతి నియోజకవర్గంలో లేబర్ అడ్డాలు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. పోలవ రం, అమరావతి నిర్మాణ పనులు, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్ రంగాల్లో విస్తృతస్థాయిలో అభివృద్ధి పనులు జరుగు తున్నందున కార్మికులకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని వివరించారు.
భవన నిర్మాణ కార్మికులకు మేలు చేసే కార్యక్రమాలు
భవన నిర్మాణ కార్మికులకు వివాహ కానుకగా రూ.40 వేల వరకు, ప్రసూతి సాయంగా రూ.20 వేల వరకు, సహజ మరణానికి రూ.60 వేల వరకు, అంత్యక్రియల ఖర్చులకు రూ.20 వేల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వెల్లడిం చారు. “మన మిత్ర” యాప్ ద్వారా కేవలం రూ.55తో కార్మికు లు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. అదే యాప్ ద్వారా ఎస్టాబ్లిష్‌మెంట్ రిజిస్ట్రేషన్లు, ట్రేడ్ యూని యన్ రిజిస్ట్రేషన్లు, స్టాట్యుటరీ రిటర్న్స్, సెస్ చెల్లింపులు వంటి సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఈఎసఐ ఆసుపత్రులు, డిస్పెన్స రీల విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. తిరుప తి ఈఎసఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు అప్‌గ్రేడ్ చేసినట్లు, అచ్యుతాపురంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తిదశకు చేరుకుందని వివరించారు. గుంటూరులో 100 పడకల ఆసుపత్రికి 6.35 ఎకరాలు, కర్నూలులో 30 పడకల ఆసుపత్రికి 5.23 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపారు. శ్రీ సిటీ, నెల్లూరు ప్రాంతాల్లో కొత్త ఈఎసఐ ఆసుపత్రుల కోసం భూములను గుర్తించినట్లు పేర్కొ న్నారు. విశాఖపట్నంలో 50 ఎంబీబీఎస్ సీట్లతో ఈఎసఐసీ మెడికల్ కాలేజీకి కేంద్ర అనుమతులు లభించినట్లు వెల్లడించా రు. అమరావతిలో 500 పడకల ఆసుపత్రి, 150 సూపర్ స్పెషాలిటీ పడకలతో కూడిన ఈఎసఐసీ మెడికల్ కాలేజీ ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు.
కొత్త ఈఎసఐ డిస్పెన్సరీల కోసం భూములు
చిత్తూరు, బంగారు పాళ్యం, నగరి, గుంతకల్, అనంతపు రం, గంగూరు, మచిలీ పట్నం, బావులపాడు ప్రాంతాల్లో కొత్త ఈఎసఐ డిస్పెన్సరీల కోసం భూములను కేటాయించినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 30 కొత్త డిస్పెన్సరీలు, 57 ప్రస్తుత డిస్పెన్సరీల బలోపేతానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. “జీరో యాక్సిడెంట్స” లక్ష్యం గా యూనివర్సిటీలు, ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్‌తో ఒప్పందాలు కుదుర్చుకుని సేఫ్టీ ఆఫీసర్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడల్లో “సేఫ్టీ వాక” కార్యక్ర మాలు నిర్వహించి కార్మికుల్లో అవగాహన పెంచుతున్నట్లు చెప్పారు. 57 రకాల వృత్తుల వారు కార్మికుల కింద వస్తారని స్పష్టం చేశారు.
“ఈ-శ్రమ” పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి
“ఈ-శ్రమ” పోర్టల్‌లో నమోదు చేసుకుంటే ప్రమాద మరణానికి రూ.2 లక్షలు, సహజ మరణానికి రూ.లక్ష బీమా సౌకర్యం లభిస్తుందని వివరించారు. రాష్ట్రంలో పెరుగుతున్న పెట్టుబడు లు, అమరావతి, పోలవరం వంటి భారీ ప్రాజెక్టుల కారణంగా నైపుణ్యం కలిగిన కార్మికులకు భారీ డిమాండ్ ఏర్పడిందని తెలిపారు. ఈ ఏడాది 25 వేల మందికి నేరుగా స్కిల్ ట్రైనింగ్, వారి కుటుంబసభ్యులతో కలిపి సుమారు లక్ష మందికి స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శిక్షణ అనంతరం సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, కార్మిక సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని “సువ ర్ణాంధ్ర”గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
















