- సింగపూర్‌కు ఏపీ ఉపాధ్యాయుల బృందం
- ఉత్తమ అవార్డు గ్రహీతలు 37 మంది ఎంపిక
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి(చైతన్యరథం): ఏపీలోని ఉత్తమ ఉపాధ్యాయులను అంతర్జాతీయ స్థాయి విద్యా వ్యవస్థలను అధ్యయనం చేయించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగం గా ఏపీ ఉపాధ్యాయుల బృందం సింగపూర్‌కు వెళ్లనుంది. ఈ నెల 4 నుంచి 9 వరకు సింగపూర్‌లో ఈ బృందం పర్యటించనుంది. సింగపూర్ పర్యటనకు ఏపీలో 37 మంది ఉత్తమ ఉపాధ్యాయు లతో బృందాన్ని ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. సింగపూ ర్‌లో అత్యాధునిక విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, పాఠశా లల్లో అమలవుతున్న వినూత్న ప్రయోగాలు, విద్యార్థుల అభివృద్ధి వ్యవస్థలను ఉపాధ్యాయులు సమగ్రంగా అధ్యయనం చేయనున్నా రు. ఇప్పటికే ఈ బృందం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. అక్కడి నుంచి సింగపూర్‌కు విమానం ద్వారా ప్రయాణించనున్నారు. మిగిలిన ఉత్తమ ఉపాధ్యాయులను అధ్యయ నం కోసం త్వరలో ఫిన్లాండ్‌కు పంపించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ప్రాథమిక విద్యలో ప్రపంచానికే ఫిన్లాండ్ ఆదర్శంగా నిలిచింది. ఈ రెండు దేశాల అనుభవాలను వినియోగించి ఏపీలో విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యావ్యవస్థలో ఇప్పటికే లోకేష్ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. సింగపూర్ పర్యటనకు ఉపాధ్యాయు లను పంపడం వల్ల అత్యుత్తమ విద్యావిధానాల అధ్యయనానికి అవకాశం ఏర్పడుతుంది.
















