చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

తెలుగు జాతి గర్వించేలా నిమ్మకూరును తీర్చిదిద్దుతా చంద్రబాబు వెల్లడి

by చైతన్యరధం
Apr 14, 2023 at 10:07am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
chandra babu naidu

chandrababu will make Nimmakuru to make the telugu nation proud

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఆర్ధిక అసమానతలు తొలగించే పైలట్ ప్రాజెక్ట్ మే 28న ప్రారంభం
మే 28న కనీవినీ ఎరుగని రీతిలో ఎన్టీఆర్ కు నివాళి
సామాజిక బాధ్యతతోనే టిడిపి స్థాపించిన ఎన్టీఆర్
స్ఫూర్తిదాయకమైన ప్రాంతం నిమ్మకూరు
నిమ్మకూరు గ్రామస్తులతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం
……
రాష్ట్రవ్యాప్తంగా ఆర్ధిక అసమానతలు తగ్గించేందుకు అవసరమైన పైలట్ ప్రాజెక్ట్ ని నిమ్మకూరులో ప్రారంభించనున్నట్టు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అన్నివిధాల నిమ్మకూరును ముందుకుతీసుకెళ్లేలా మే 28నాటికి పనులు ప్రారం భిస్తాం. తెలుగు జాతి గర్వించేలా నిమ్మకూరు ప్రాంతాన్ని స్ఫూర్తిదాయకమైన ప్రాంతంగా తయారుచేస్తా అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు స్వగ్రామమైన నిమ్మకూరులో చంద్రబాబు బుధవారం రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా నిమ్మకూరు
గ్రామస్తులు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. వివిధ వివిధ ప్రాంతాలలో నివశిస్తున్న నిమ్మకూరు గ్రామానికి చెందిన ఆడపడుచులు కుటుంబాలతో సహా తరలివచ్చి తమ ఊరి అల్లుడైన చంద్రబాబుకు అపూర్వ స్వాగతం చెప్పారు. ఎన్టీఆర్ కుమారుడైన నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసినిలు చంద్రబాబును సాదరంగా ఆహ్వానించారు.

నిమ్మకూరు గ్రామస్తులు చంద్రబాబుకు నూతన వస్త్రాలు బహూకరించి అల్లుని మర్యాదలు చేశారు. అనంతరం గ్రామస్తులతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు ప్రసంగిస్తూ మే28 చరిత్ర కనీవినీ ఎరుగని విధంగా స్వర్గీయ ఎన్టీఆర్ కు నివాళులు అర్పిద్దాం. నిమ్మకూరులో రాత్రి బసచేయడం, నేడు గ్రామస్తులతో మనసువిప్పి మాట్లాడటం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తానని చెప్పారు. “యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాలు, ఆ మహానుభావుడి 100వ పుట్టిన రోజు జరుపుకోవడం నిజంగా మనందరి పూర్వజన్మ సుకృతం. ఆయన కారణజన్ముడు. రామరాజ్యం అంటే నందమూరి తారకరామారావు గారే గుర్తొస్తారు. అలాంటి మహనీయుడికి జన్మనిచ్చిన గడ్డ నిమ్మ కూరు. చరిత్ర ఉన్నంతకాలం నిమ్మకూరు పేరు నిలిచి ఉంటుంది.” అని చంద్రబాబు వెల్లడించారు. నిమ్మకూరు లో వెంకట్రావమ్మ, లక్షయ్య చౌదరి దంపతులకు 1923 మే28 న జన్మించిన వ్యక్తిని నేడు నిత్యం మనం స్మరించుకుంటున్నాం. ప్రతి ఒక్క పుట్టుక కు ఒక గొప్ప కారణం ఉంటుంది.

సంబంధితవార్తలు

యువత భవిష్యత్తు కోసం టీడీపీకే ఓటు వేద్దాం | సుపరిపాలన టీడీపీతోనే సాధ్యం | Chandrababu Naidu | TDP

ఏపీపీఎస్సీలో అక్రమాలఫై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మీడియా సమావేశం. #APPSCscamExposed

‘కలలకు రెక్కలు’ పథకంలో భాగంగా విద్యార్థినుల రిజిస్ట్రేషన్ నమోదు కార్యక్రమంలో చంద్రబాబు గారు.

ఎన్టీఆర్ తెలుగు సినీచరిత్రలో మకుటంలేని మహరాజుగా వెలిగారు. చిత్రసీమలో ఆయన పోషించని పాత్రలేదు. శ్రీకృష్ణుడు, శ్రీ రాముడు, కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని మనం రామారావులోనే చూశాము. చూసుకుంటున్నాం. అందుకే ఆయన కారణజన్ముడై మనందరి హృద యాల్లో నేటికీ కొలువై ఉన్నాడు అని చంద్రబాబు పేర్కొన్నారు. నిమ్మకూరు పక్కనే ఉన్న కొమరవోలులో మేనమామ కుమార్తె, కాట్రగడ్డ చెంచయ్య కుమార్తె అయిన బసవతారకమ్మని పెళ్లి చేసుకున్నారు. మహాతల్లిని నేను కళ్లారాచూశాను. విజయవాడలో ఒక గుడిసెలో ఉండి ఎన్టీఆర్ మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. పాలు అమ్ముతూ గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. సాధారణ వ్యక్తి, అసాధారణ ప్రతిభతో ఉన్నత శిఖరాలకు ఎదిగారని చంద్రబాబు గత స్మృతులను నెమరువేసుకున్నారు.

చిరస్మరణీయుడు ఎన్టీఆర్

ఎన్టీఆర్ చనిపోయి 30ఏళ్లు అవుతున్నా ఆయన మనలోనే ఉన్నాడు. ఏదైనా పని ప్రారంభించే ముందు ఎన్టీఆర్ విగ్రహాన్ని చూసి ప్రారంభిస్తే, మనకు విజయం తధ్యం అని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ వచ్చాకే రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. విప్లవాత్మక నిర్ణయాలతో దేశరాజకీయాలనే తిరగరాసిన గొప్పవ్యక్తి ఎన్టీఆర్. పేదరికాన్ని తొలుత గుర్తించి, దానినిర్మూలనకు కంకణబద్ధుడైన వ్యక్తి ఎన్టీఆర్. అసాధ్యం అనుకున్న రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని అమలుచేసి, పేదల ఆకలి తీర్చిన దేవుడు ఎన్టీఆర్. ఆయన తీసుకొచ్చిన పథకాన్నే తరువాత కేంద్ర ప్రభుత్వం ఆహారభ ద్రత పథకంగా మార్చింది. పేదలకు ఒంటి నిండా బట్టలుండాలన్న గొప్పఆలోచనతో జనతావస్త్రాల పంపిణీ ప్రారంభించి, చేనేతకార్మికులకు ఉపాధికల్పించారని వివరించారు. ఎన్టీఆర్ ఏపనిచేసినా, ఆలోచించినా దానివెనుక గొప్ప పరమార్థం ఉంటుంది.

సినీరంగంలో 33ఏళ్లు రారాజుగా వెలిగిన ఎన్టీఆర్ కు వాస్తవంగా రాజకీయాలు అవసరంలేదు. కానీ తనను ఆదరించి, తనకు పేరుప్రఖ్యాతులు అందించిన ప్రజలకోసం ఏదో చేయాలన్న తలంపుతో, సామాజిక బాధ్యతను గుర్తించి రాజకీయాల్లోకి వచ్చారని ఆయన చెప్పారు. 60ఏళ్లు వచ్చాక ఎవరైనా పిల్లలతో గడుపుతూ ఆనందంగా ఉండాలనుకుంటారు. కానీ ఎన్టీఆర్ ప్రజలకోసం తెలుగుదేశాన్ని స్థాపించి, కేవలం 9నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చారు. నేషనల్ ఫ్రంట్ తో దేశరాజకీయాల్లో చక్రంతిప్పారు. ప్రధానుల్ని నియ మించే స్థాయికి వెళ్లారు. పార్లమెంట్ లో ప్రధానప్రతిపక్షంగా ఒకప్రాంతీయపార్టీ పనిచేసింది అని చెప్పారు. దివిసీమ తుఫాన్ వచ్చిన సమయంలో బాధితుల్ని ఆదుకోవడానికి జోలెపట్టిన నాయకుడు ఎన్టీఆర్. అదీ ఆయనకున్న సామాజికబాధ్యత. రాయలసీమలో కరువు వచ్చినా, చైనా తో యుద్ధంవచ్చినా ప్రజల్ని ఆదుకోవడానికి నడుం బిగించారు. రాజకీయాల్లో ఆయన 13ఏళ్లే ఉన్నారు. కానీ ఎవరూ చేయనివిధంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు.

తెలుగుజాతి కోసమే టిడిపి

తెలుగుజాతి కోసం ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని స్థాపించారు. తెలుగుభాష పై మక్కువతో, తెలుగుజాతి పై అభిమానం తో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన చూపిన బాట లోనే టీడీపీ ని నడిపిస్తున్నాం. ముందుచూపుతో సాంకేతిక పరిజ్ఞానానికి బాటలు వేశాం. హైదరాబాద్ నగరాన్ని తెలుగుజాతికోసం నిర్మించాం. నాలెడ్జ్ ఎకానమీ కోసం కొత్త ఆలోచనలు చేశాం. అన్నినగరాలకంటే హైదరాబాద్ దేశంలోనే నంబర్ 1 ఉందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ మాత్రమే అని చంద్రబాబు వివరించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చాకే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు బ్రహ్మండంగా రాణిస్తు న్నారు. అదే తెలుగు జాతికి తెలుగుదేశంపార్టీ ఇచ్చినవరం. ఇండియాలోని అన్ని భాషల కంటే అమెరికాలో ఎక్కువగా తెలుగు భాషే అభివృద్ధి చెందింది. అమెరికాలో ఉండేవారికంటే, అక్కడున్న తెలుగువారే ఎక్కువగా సంపాదిస్తున్నారు. తెలుగువారు ఎక్కడున్న నంబర్ వన్ గా ఉండాలి. ఆయాదేశాల్లో ప్రజల్లో గుర్తింపు వచ్చేలాతెలుగు వారు ఉండాలన్నదే నా సంకల్పం. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా నేను చేసే సంకల్పం ఉక్కు సంకల్పంగా నిలుస్తుందని చంద్రబాబు వెల్లడించారు.

ఎన్టీఆర్ గారి పేరుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ను ఆయన కుమార్తె భువనేశ్వరి నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ బసవతారకం ఆసుపత్రి నిర్వహణ చూస్తున్నారు. ఆయనపుట్టిన నిమ్మకూరుకి అవసరమైన అన్నిపనులుచేశాం. ఈ గ్రామాన్ని లోకేశ్ దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు. అవికాకుండా మహిళా సాధికారత కోసం ప్రత్యేక ప్రాంగణం ఏర్పాటుచేశారు. ఈ నేల పైనే త్రిపురనేని రామస్వామి చౌదరి, భోగ రాజు పట్టాభిసీతారామయ్య, పింగళి వెంకయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు వంటి మహానుభావులు జన్మించారు. తిరుపతి వేంకట కవులు నడయాడిన నేల ఇది. కళామతల్లి ముద్దుబిడ్డలు ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇక్కడి వారే. ఘంటసాల పుట్టిన ప్రాంతం ఇదే. గోరా, డాక్టర్ కే.ఎల్.రావు, కాకాని వెంకటరత్నం, కైకాల సత్యనారా యణ, మండలి వెంకట కృష్ణారావు, కోనేరు రంగారావులు ఇక్కడి వారే. ఈనాడు రామోజీరావు ఇక్కడేపుట్టారు. ఈ గడ్డ మీద ఏదో మహత్యం ఉంది. ఒక వారసత్వానికి స్ఫూర్తిదాయకమైన ప్రాంతం ఇది అని చంద్రబాబు వివరించారు.

భెల్ కంపెనీ వచ్చాక నిమ్మకూరు కు లైఫ్ వచ్చింది. అదిపూర్తి అయితే వేల ఉద్యోగా లు వస్తాయి. ఎన్టీఆర్ పుట్టిన గడ్డ మీద అందరూ బాగుండాలి. సంతోషంగా ఉండాలి. అదే నాఆలోచన. ఎన్టీఆర్ గారు, తానుచేసిన పనులు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతా యి. హైదరాబాద్ లో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం, బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ , నాలెడ్జ్ ఎకానమీ కేంద్రం, ఎయిర్ పోర్ట్ వంటివి ఎన్నో తెలుగుదేశం ముందుచూపుతో చేసిన గొప్పపనులు అని చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి చేయాల్సిందంతా చేస్తాం. తెలుగు ప్రజలకు పూర్వ  వైభవం తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎన్టీఆర్ పుట్టిన గడ్డమీద నుంచి ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను పేదవాడి కోసమే పనిచేస్తాను. అట్టడుగున ఉన్న పేదవారిని ఉన్నత స్థానాల్లో నిలిపేందుకు, ఆర్థికంగా గొప్పవాళ్లను చేసేందుకే నా శేష జీవితం మొత్తం అంకితం చేస్తాను. ఇదేమాట పదేళ్లముందు చెబితే రాజకీయాలు అ న్నారు. నా ఆలోచనలు ఎప్పుడూ సమాజహితాన్ని దృష్టిలో పెట్టుకొనే ఉంటాయి. అభివృద్ధి జరిగితే సంపద వస్తుంది. రోడ్లు, నీళ్లు, పరిశ్రమలు వస్తే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. రైతులతోపాటు, పేదల సంపద పెరగాలి. అప్పుడే సమాజంలో ఆర్థిక అసమానతలు లేకుండా పోతాయి. దాన్ని ఈ గ్రామం నుంచే ప్రారంభిస్తాను అని చంద్రబాబు వెల్లడించారు.

Tags: ap cm chandrababu naiduChandraBabu Naiduchandrababu naidu latest newschandrababu naidu livechandrababu nimmakuru livechandrababu nimmakuru meetingchandrababu's meeting in nimmakurucm chandrababu naidunara chandrababu naidunara chandrababu naidu public meeting at nimmakurunara chandrababu naidu public meeting live at nimmakurunimmakuruTDPtdp leader nara chandrababu naidutdp meetingtdp nara chandrababu naidutdp nimmakuru
Previous Post

LIVE : 70వ రోజు డోన్ నియోజ‌క‌వ‌ర్గంలో నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర

Next Post

టిడిపితోనే దళితులకు సామాజిక న్యాయం

మరిన్ని వార్తలు

నిన్న మనిషిని తొక్కించారు..నేడు మామిడికాయలు తొక్కించారు..
ఆంధ్రప్రదేశ్

నిన్న మనిషిని తొక్కించారు..నేడు మామిడికాయలు తొక్కించారు..

చైతన్యరధం
@ July 11, 2025
ఆంధ్రప్రదేశ్

జగన్‌రెడ్డి ట్రాక్టర్ల బూమరాంగ్‌

చైతన్యరధం
@ July 11, 2025
పాఠశాలల అభివృద్ధిలో..పూర్వవిద్యార్థులు భాగస్వాములు కావాలి
ఆంధ్రప్రదేశ్

పాఠశాలల అభివృద్ధిలో..పూర్వవిద్యార్థులు భాగస్వాములు కావాలి

చైతన్యరధం
@ July 11, 2025
కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మంత్రి లోకేష్‌ ముఖాముఖి
ఆంధ్రప్రదేశ్

కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మంత్రి లోకేష్‌ ముఖాముఖి

చైతన్యరధం
@ July 11, 2025
ఇబ్బందులు తీర్చి ఆదుకుంటాం
ఆంధ్రప్రదేశ్

ఇబ్బందులు తీర్చి ఆదుకుంటాం

చైతన్యరధం
@ July 11, 2025
ప్రశాంతి నిలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్‌
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతి నిలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్‌

చైతన్యరధం
@ July 11, 2025
మహిళలను కించపరిచే పదాలు మానేయాలి
ఆంధ్రప్రదేశ్

మహిళలను కించపరిచే పదాలు మానేయాలి

చైతన్యరధం
@ July 11, 2025
ఆద్యంతం పండుగ వాతావరణం!
ఆంధ్రప్రదేశ్

ఆద్యంతం పండుగ వాతావరణం!

చైతన్యరధం
@ July 11, 2025
Load More

ముఖ్య వార్తలు

బాలల భవిత.. గురువులదే బాధ్యత

బాలల భవిత.. గురువులదే బాధ్యత

చైతన్యరధం
@ July 11, 2025
కుట్రల నిగ్గు తేలుద్దాం!

కుట్రల నిగ్గు తేలుద్దాం!

చైతన్యరధం
@ July 10, 2025
అమరావతికి క్వాంటమ్‌

అమరావతికి క్వాంటమ్‌

చైతన్యరధం
@ July 10, 2025
విశాఖలో జీసీసీ ఇన్నోవేషన్‌ క్యాంపస్‌

విశాఖలో జీసీసీ ఇన్నోవేషన్‌ క్యాంపస్‌

చైతన్యరధం
@ July 9, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

గొంతులు కోసే.. చెట్లు నరికే..గొడ్డలి వేట్లు వేసే లక్షణాలు జగన్‌ ముఠావే

చైతన్యరధం
@ July 8, 2025 6:15 AM

మామిడిపై మొసలి కన్నీరు!?

చైతన్యరధం
@ July 8, 2025 6:05 AM

వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం!

చైతన్యరధం
@ July 1, 2025 6:30 AM
బనకచర్ల.. ఏపీ గేమ్‌ఛేంజర్‌

బనకచర్ల.. ఏపీ గేమ్‌ఛేంజర్‌

చైతన్యరధం
@ July 1, 2025 6:25 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నిన్న మనిషిని తొక్కించారు..నేడు మామిడికాయలు తొక్కించారు..

నిన్న మనిషిని తొక్కించారు..నేడు మామిడికాయలు తొక్కించారు..

చైతన్యరధం
@ July 11, 2025

జగన్‌రెడ్డి ట్రాక్టర్ల బూమరాంగ్‌

చైతన్యరధం
@ July 11, 2025
పాఠశాలల అభివృద్ధిలో..పూర్వవిద్యార్థులు భాగస్వాములు కావాలి

పాఠశాలల అభివృద్ధిలో..పూర్వవిద్యార్థులు భాగస్వాములు కావాలి

చైతన్యరధం
@ July 11, 2025
కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మంత్రి లోకేష్‌ ముఖాముఖి

కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మంత్రి లోకేష్‌ ముఖాముఖి

చైతన్యరధం
@ July 11, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist