- ఆగస్టు 1న మోదీ చేతులమీదుగా ప్రారంభం
- జీఎమ్మార్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్,
- ఏవియేషన్ హబ్ వర్శిటీ. ఎడ్యుసిటీలకు శ్రీకారం
- సంప్రదాయ నృత్యరూపాలతో ఘనస్వాగతం పలకాలి.
- 10 రోజుల పాటు విస్తృత ప్రచారం నిర్వహించాలి.
- వేదికపై అరకు కాఫీ బ్రాండింగ్ కనిపించాలి.
- ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం) భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానిం చారు. ఆగస్టు 1 తేదీన ప్రధాని మోదీ చేతులమీదుగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం ఉన్నతాధి కారులతో సమీక్షించారు. ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా, చారిత్రాత్మక ఘట్టంగా నిర్వహిం చాలని ఆదేశించారు. ప్రధాని మోదీకి ఉత్తరాంధ్ర ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను తెలుపుతూ థింసా, సవర, కొమ్ము కోయ తదితర సంప్రదాయ నృత్య రూపాలతో ఘనస్వాగతం పలకాలని తెలిపారు. ఆగస్టు 1న విమానాశ్రయ ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించడంతో పాటు.. జీఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్-యూనివర్సిటీతో పాటు జీఎంఆర్-మాన్సాస్ ఎడ్యుసిటీలను ప్రధాని మోదీ లాంఛనంగా ఆవిష్కరి స్తారని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర మణిహారంగా నిలవ నున్న ఈ విమానాశ్రయం లాజిస్టిక్స్ కేంద్రంగా గ్లోబల్ కనెక్టివిటీని అందిస్తూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఒక గేమ్ చేంజర్ మారుతుందని సీఎం స్పష్టం చేశారు.
ఉత్తరాంధ్ర అంతటా వేడుకగా ప్రారంభోత్సవం
ఈ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులు, యజమానులను గౌరవించేలా వారికి ఒకసారి ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎయిర్పోర్టు ప్రారంభో త్సవం సందర్భంగా బహిరంగ సభను నిర్వహించాలని సూచించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు. ప్రత్యేక పార్కింగ్ స్లాట్లతో పాటు పటిష్ట బందో బస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సభకు వచ్చే వారి కోసం అల్పాహారం, భోజనం, తాగునీటి లాంటి సదుపాయాలు కల్పించా లన్నారు. మంగళవారం నుంచి జూలై 31 వరకూ అల్లూరి సీతా రామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. రానున్న 10 రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్రతి ఇంటా ఈ ప్రారంభోత్సవ వేడుక స్ఫూర్తి చేరేలా కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై ప్రధాని మోదీ ప్రమోట్ చేస్తున్న అరకు కాఫీ బ్రాండింగ్ కూడా వేదికగా దీనిని మలచాలని సూచించారు. మంగళవారం నుంచి చేపట్టే కార్యక్రమాల్లో ఉత్తరాంధ్రకు చెందిన ప్రజాప్రతినిధులు అంతా హాజరుకావాలని నిర్దేశించారు. ఈ సమీక్షకు హోం మంత్రి అనిత, సీఎస్ సాయిప్రసాద్, ఐఅండ్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీని వాసరావు, సివిల్ ఏవియేషన్ అధికారులు, జీఎంఆర్ ప్రతినిధులు హాజరయ్యారు.















