- దాల్మియా సిమెంట్ రెండో దశ ప్లాంట్ విస్తరణ
- రూ.3,100 కోట్ల పెట్టుబడులతో శ్రీకారం
- నేడు కడప జిల్లాలో పనులకు శంకుస్థాపన
- ప్రభుత్వానికి పెరగనున్న రాయల్టీ ఆదాయం
- పాల్గొననున్న మంత్రి నారా లోకేష్
అమరావతి(చైతన్యరథం): ప్రజా ప్రభుత్వ పాలన లో రాయల సీమకు పెద్దఎత్తున పరిశ్రమలు తరలి వస్తున్నాయి. పరిశ్రమల రాకతో ముఖ్యంగా రాయల సీమలోని కడప జిల్లా రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్లు క్యూ కట్టాయి. ఈ ఏడాది మే 22న జమ్మలమడుగు నియోజకవర్గం కొండా పురం మండలంలో సేల్ సౌర విద్యుత్ ప్రాజెక్టును మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. రెండు నెలల వ్యవధిలోనే కడప జిల్లా జమ్మలమడుగు నియోజక వర్గం మైలవరం మండలం చిన్నకొమెర్ల సమీపంలో దాల్మియా భారత్ సిమెంట్ పరిశ్రమ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు బుధవారం లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు.
రూ.3.100 కోట్ల పెట్టుబడి.. 700 మందికి ఉద్యోగాలు దాల్మియా సిమెంట్ పరిశ్రమ రూ.3,100 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ విస్తరణ పనులు చేపట్టనుంది. మైలవరం మండలంలోని చిన్నకొమెర్లలో ప్లాంటులో దాల్మియా సిమెంట్ ఏడాదికి 2.5 మిలియన్ టన్నుల క్లింకర్, 3.6 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేస్తోంది. కొత్త ప్లాంట్ విస్తరణతో క్లింకర్ సామర్థ్యం 6.1 మిలియన్ టన్నులు, సిమెంట్ ఉత్పత్తి 9.6 మిలి యన్ టన్నులకు చేరనుంది. ఇప్పటివరకు ఉన్న ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 950 మంది ఉపాధి పొందుతున్నారు. ఈ ప్లాంట్ విస్తరణతో కొత్తగా మరో 700 మందికి ఉపాధి లభిస్తుంది. మొత్తంగా 1,650మందికి ఉపాధి, ఉద్యోగాల కల్పన జరగ నుంది. ఈ పెట్టుబడుల వల్ల అనుబంధ పరిశ్రమల్లో కూడా అదనపు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి.
ప్రభుత్వానికి ఏటా రూ.325 కోట్ల ఆదాయం
ప్రస్తుతం సంస్థ పన్నులు, మైనింగ్ రాయల్టీల రూపంలో రాష్ట్ర ఖజానాకు ఏడాదికి రూ.102 కోట్లు చెల్లిస్తోంది. ప్రతిపాదిత విస్తరణ పూర్తయిన తర్వాత ఈ వార్షిక ఆదాయం రూ.325కోట్లకు పెరుగుతుంది. దాల్మియా సంస్థ రెండో దశ విస్తరణ పనులను అత్యు త్తమ ప్రమాణాలతో గ్రీన్ ఇండస్ట్రీగా మార్చేందుకు కృషి చేయనుంది. సిమెంట్ పరిశ్రమకు అవసర మైన 80శాతం విద్యుత్ను పునరుత్పాదక విధానంలో తీసు కోనుంది. మొత్తం ప్రాజెక్ట్ విస్తీర్ణంలో 33శాతం గ్రీన్ బెల్ట్ అభివృద్ధి ద్వారా జీవ వైవిధ్య పరిరక్షణ, పరిశ్రమ లో ఉపయోగించిన నీటిని పూర్తిగా పునర్వినియోగం చేసే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. సుమారు రూ.100 కోట్ల పెట్టుబడితో 130 అధిక సామర్థ్య బ్యాగ్ ఫిల్టర్లు ఏర్పాటు చేయనున్నారు.
దేశంలో నాలుగో అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ
దాల్మియా భారత్ గ్రూప్ ఎనిమిది దశాబ్దాలకు పైగా సిమెంట్, చక్కెర, విద్యుత్ రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ 54.7 మిలియన్ టన్నుల వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం, రూ.14,800 కోట్ల వార్షిక టర్నోవర్తో దేశంలో నాలుగో అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థగా నిలిచింది. సంస్థకు 12 రాష్ట్రాల్లో 19 సిమెంట్ కర్మాగారాలు, గ్రైండింగ్ యూనిట్లు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని 23 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వ హిస్తూ 33,000 మందికి పైగా డీలర్లు, సబ్-డీలర్ల నెట్వర్క్ ద్వారా వినియోగదారులకు సేవలందిస్తోంది.















