చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

నేడు వెలిగొండ పండుగ

‘వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు' పేరుతో వేడుకగా కార్యక్రమం

by చైతన్యరధం
Aug 31, 2026 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
  • 30 ఏళ్ల కల సాకారం… ప్రజల్లో హర్షాతిరేకం
  • ‘వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు’ పేరుతో వేడుకగా కార్యక్రమం

అమరావతి, ఆగస్టు 30: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. దశాబ్దాలుగా తీవ్ర కరవును ఎదుర్కొంటున్న మార్కాపురం జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి ప్రారంభించి, నీటిని విడుదల చేయనున్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో మార్కాపురం ప్రాంతంతోపాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు ప్రభావిత ప్రాంతాలకు కొత్త జీవం లభించనుంది. ముఖ్యంగా 30 ఏళ్ల క్రితం, 1996 మార్చి 5న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు, మూడు దశాబ్దాల తర్వాత అదే ప్రాజెక్టు తొలి దశను స్వయంగా ప్రారంభించడం చారిత్రక ఘట్టంగా నిలవనుంది. ‘వెలిగొండ జలసిరులు – అభివృద్ధికి రెక్కలు’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది.

కరవు నేలకు కృష్ణమ్మ జలాలు
తీవ్ర వర్షాభావం, అడుగంటిన భూగర్భ జలాలు, ఫ్లోరైడ్ సమస్యలు, సాగునీటి కొరతతో దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ప్రాంతానికి వెలిగొండ కేవలం ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు మాత్రమే కాదు… ఆ ప్రాంత భవిష్యత్తును మార్చే జీవనాధార ప్రాజెక్టు. శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణా జలాలను తరలించి నల్లమలసాగర్ నిల్వ చేసి, ప్రధాన కాలువల ద్వారా సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన 30 మండలాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలతో సహా సుమారు 23 లక్షల మందికి తాగునీటి ప్రయోజనం చేకూరనుంది.

సంబంధితవార్తలు

సిరిపురం సర్కిల్‌లో దివంగత సీఎం కొణిజేటి రోశయ్య గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్.

విశాఖలో ఏఐజీ హాస్పిటల్స్‌కు భూమిపూజ, శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్.

యర్రగొండపాలెం నియోజకవర్గం గంటవానిపల్లి సమీపంలో వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కృష్ణాజలాలకు జలహారతి ఇచ్చారు.

తొలిదశతో కొత్త అధ్యాయం
తొలి దశ ప్రారంభం ద్వారా 10.70 టీఎంసీ కృష్ణా జలాలను నల్లమలసాగర్కు విడుదల చేయనున్నారు. తొలి విడతలో సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వెలిగొండ జలాలు అందుబాటులోకి రావడం ద్వారా వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. సాగునీటి భద్రత పెరగడంతో పంటలపై అనిశ్చితి తగ్గి, పంటల వైవిధ్యీకరణకు అవకాశం ఏర్పడుతుంది. భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గడంతోపాటు ఉద్యానవనం, అగ్రో ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలు అభివృద్ధి చెందేందుకు అవకాశాలు పెరుగుతాయి. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడి, వలసలకు అడ్డుకట్ట పడనుంది.

30 ఏళ్ల ప్రయాణం… సంకల్పం నుంచి సాకారం వరకు
1996లో శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టు ప్రయాణంలో ఎన్నో సాంకేతిక, ఆర్థిక, నిర్మాణపరమైన సవాళ్లు ఎదురయ్యాయి. సొరంగాల నిర్మాణం, ఫీడర్ కాలువలు, హెడ్ రెగ్యులేటర్లు, భూసేకరణ, పునరావాసం వంటి క్లిష్టమైన అంశాలను అధిగమిస్తూ ప్రాజెక్టు పనులు ముందుకు సాగాయి. 2024లో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన అనంతరం వెలిగొండను అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టుగా తీసుకుని పనులను వేగవంతం చేసింది. టన్నెల్ పనులు, ఫీడర్ కాలువలు, హెడ్ రెగ్యులేటర్లు, ఇతర అనుబంధ నిర్మాణాలతో పాటు నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం, పరిహారం చెల్లింపుల పై ప్రత్యేక దృష్టి సారించింది. కేవలం 48 రోజుల వ్యవధిలో నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్ల మేర పరిహారం చెల్లింపులు జరపడం ద్వారా పనులకు వేగం తీసుకువచ్చింది. అంతేకాకుండా గెజిట్, జాబితాలో పేర్లు లేని వారికోసం మరో రూ.169 కోట్లు, 2019 తర్వాత 18 ఏళ్ల నిండినవారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ‘శంకుస్థాపన చేసింది చంద్రబాబు… ప్రారంభిస్తున్నదీ చంద్రబాబే’ అన్న అరుదైన చారిత్రక ఘట్టానికి ఆగస్టు 31 వేదిక కానుంది. 30 ఏళ్ల క్రితం చేసిన సంకల్పం ఇప్పుడు సాకారమవుతుండటం మార్కాపురం ప్రాంత ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం 9.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి, ఉదయం 10.15 గంటలకు మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లి హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర ప్రముఖులు ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతారు. ఉదయం 10.25 గంటలకు రోడ్డుమార్గంలో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేదికకు చేరుకుంటారు. ఉదయం 10.35 గంటల నుంచి 11.20 గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి… వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ పైలాన్ ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రాజెక్టు గేట్లను ప్రారంభించి వెలిగొండకు కృష్ణా జలాల విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉదయం 11.30 గంటలకు గంటవానిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. సభఅనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుగు ప్రయాణమై మధ్యాహ్నం 2.15 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 30-08-2026

Next Post

కరువు నేలకు కృష్ణమ్మ జలాలు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 31-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-08-2026

కార్యకర్త
@ August 31, 2026
కరువు నేలకు కృష్ణమ్మ జలాలు
ఆంధ్రప్రదేశ్

కరువు నేలకు కృష్ణమ్మ జలాలు

చైతన్యరధం
@ August 31, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-08-2026

కార్యకర్త
@ August 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-08-2026

కార్యకర్త
@ August 29, 2026
పనితీరుకు ప్రామాణికం.. విజన్ ప్లాన్
ఆంధ్రప్రదేశ్

పనితీరుకు ప్రామాణికం.. విజన్ ప్లాన్

చైతన్యరధం
@ August 29, 2026
డేట్ టైమ్ ప్లేస్ ఫిక్స్ చెయ్ జగన్.. చర్చకు మళ్లీ సవాల్ చేస్తున్నా!
ఆంధ్రప్రదేశ్

డేట్ టైమ్ ప్లేస్ ఫిక్స్ చెయ్ జగన్.. చర్చకు మళ్లీ సవాల్ చేస్తున్నా!

చైతన్యరధం
@ August 29, 2026
ఒంగోలు నగరానికి నిరంతర తాగునీటి సరఫరా దిశగా కీలక అడుగు
ఆంధ్రప్రదేశ్

ఒంగోలు నగరానికి నిరంతర తాగునీటి సరఫరా దిశగా కీలక అడుగు

చైతన్యరధం
@ August 29, 2026
మహనీయుల సేవలు భావితరాలకు తెలియాలి
ఆంధ్రప్రదేశ్

మహనీయుల సేవలు భావితరాలకు తెలియాలి

చైతన్యరధం
@ August 29, 2026
Load More

ముఖ్య వార్తలు

నేడు వెలిగొండ పండుగ

చైతన్యరధం
@ August 31, 2026
డేట్ టైమ్ ప్లేస్ ఫిక్స్ చెయ్ జగన్.. చర్చకు మళ్లీ సవాల్ చేస్తున్నా!

డేట్ టైమ్ ప్లేస్ ఫిక్స్ చెయ్ జగన్.. చర్చకు మళ్లీ సవాల్ చేస్తున్నా!

చైతన్యరధం
@ August 29, 2026
కరవు నేలపై కృష్ణమ్మ పరవళ్లు

కరవు నేలపై కృష్ణమ్మ పరవళ్లు

చైతన్యరధం
@ August 29, 2026

రాజధాని గ్రామాల్లో మౌలికవసతులు

చైతన్యరధం
@ August 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కరువు నేలకు కృష్ణమ్మ జలాలు

కరువు నేలకు కృష్ణమ్మ జలాలు

చైతన్యరధం
@ August 31, 2026

నేడు వెలిగొండ పండుగ

చైతన్యరధం
@ August 31, 2026
పనితీరుకు ప్రామాణికం.. విజన్ ప్లాన్

పనితీరుకు ప్రామాణికం.. విజన్ ప్లాన్

చైతన్యరధం
@ August 29, 2026
డేట్ టైమ్ ప్లేస్ ఫిక్స్ చెయ్ జగన్.. చర్చకు మళ్లీ సవాల్ చేస్తున్నా!

డేట్ టైమ్ ప్లేస్ ఫిక్స్ చెయ్ జగన్.. చర్చకు మళ్లీ సవాల్ చేస్తున్నా!

చైతన్యరధం
@ August 29, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist