అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడం, పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సంసిద్ధం చేయడమే లక్ష్యంగా టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన శంఖారావం మలివిడత యాత్ర ఈసారి రాయలసీమలో చేపట్టనున్నారు. ఈనెల 7వ తేదీన (గురువారం) హిందూపురం నుంచి యువనేత నారా లోకేష్ మలిదఫా యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. రాబోయే ఎన్నికలను ఏవిధంగా ఎదుర్కోవా లన్న అంశంపై కేడర్‌కు యువనేత దిశా నిర్దేశం చేస్తారు. ఈ సందర్భంగా మన టీడీపీ, బాబు ష్యూరిటీ -భవిష్యత్తుకు గ్యారం టీ కార్యక్రమాల అమలులో మెరుగైన పని తీరు కనబర్చిన కార్యకర్తలతో భేటీ అయి వారికి ప్రశంసాపత్రాలను అందజేస్తారు. తొలివిడతలో ఉత్తరాంధ్రలోని 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ కార్య క్రమం కేడర్‌లో నూతనోత్సాహాన్ని నింపింది. టీడీపీ-జనసేన కార్యకర్తలతోపాటు పెద్ద ఎత్తున ప్రజలు శంఖారావం సభల వద్దకు చేరుకొని సైకోపాలనలో తాము పడుతున్న ఇబ్బందులను యువనేతకు చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో శంఖారావం మలివిడత యాత్రను తన మామ, ఆంధ్రుల అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రాతి నిధ్యం వహిస్తున్న హిందూపురం నుంచి ప్రారంభించనున్నారు. తొలిరోజు 7వతేదీ ఉదయం హిందూపురం, మధ్యాహ్నం మడక శిర,సాయంత్రం పెనుకొండ నియోజకవర్గా ల్లో నిర్వహించే శంఖారావం సభల్లో యువ నేత లోకేష్ పాల్గొంటారు. 8వ తేదీన ఉద యం పుట్టపర్తి, మధ్యాహ్నం కదిరి సభలకు లోకేష్ హాజరవుతారు. శివరాత్రి నేపథ్యంలో 9వతేదీన యాత్రకు తాత్కాలిక విరామం ఉం టుంది.తిరిగి ఈనెల 10వ తేదీనుంచి శంఖా రావం యాత్ర యథావిధిగా కొనసాగనుంది.
యువగళం స్ఫూర్తితోనే శంఖారావం…
జగన్మోహన్‌రెడ్డి విధ్వంసక పాలనలో బాధితులుగా మారిన ప్రజలకు సాంత్వన చేకూర్చి ప్రజల్లో చైతన్యం నింపడమే లక్ష్యం గా యువనేత లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అధికారపార్టీకి కంటిమీద కును కులేకుండా చేసింది. 226రోజులపాటు 97 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 3132 కి.మీ.లు సాగిన పాదయాత్రలో లక్షలాది మంది ప్రజలు నేరుగా పాల్గొని తమ కష్టాలు చెప్పుకున్నారు. యువగళానికి ప్రజలనుంచి లభించిన అనూహ్య స్పందనను తట్టుకోలేక ఏవిధంగానైనా అడ్డుకోవాలనే దుర్భుద్ధితో జగన్ ప్రభుత్వం కుట్రపన్నింది. పార్టీ అధి నేత చంద్రబాబునాయుడును తప్పుడుకేసుల్లో ఇరికించి జైలులో పెట్టడంతో యువగళానికి 79రోజులపాటు సుదీర్ఘ విరామం ప్రకటిం చాల్సి వచ్చింది. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ విశాఖ జిల్లా అగనంపూడి వద్ద యువ గళాన్ని గత ఏడాది డిసెంబర్ 18వతేదీన అర్థంతరంగా ముగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలను రాబోయే ఎన్నికలకు సిద్ధంచేయడంతోపాటు బాబు సూపర్`6 కార్యక్రమాలను ప్రజల్లోకి తీసు కెళ్లేందుకు యువనేత లోకేష్ శంఖారావం యాత్రకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేయడంలో సూపర్ సక్సెస్ సాధించిన యువగళం స్పూర్తితోనే లోకేష్ శంఖారావాన్ని పూరించారు.