- ఆర్ఎంఎం ఫార్మా యూనిట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి
- ఆర్ఎంఎం ఫార్మా డైరెక్టర్ ముఖేశ్ కుమార్ తో ఏపీ మంత్రి లోకేష్ భేటీ
మాస్కో (రష్యా): ‘విశాఖపట్నాన్ని Commonwealth of Independent States రష్యా మార్కెట్లకు ఎక్స్పోర్ట్ హబ్ తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం… ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ డీప్ వాటర్ పోర్టుల ద్వారా ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తున్నాం’ అని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జXూ రీజియన్, రష్యా మార్కెట్లలో బలమైన ఎక్స్పోర్ట్ నెట్వర్క్ ఉన్న ఆర్ఎంఎం ఫార్మా డైరెక్టర్ ముఖేష్ కుమార్ తో మాస్కోలో భేటీ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… విశాఖపట్నాన్ని వ్యూహాత్మక లాజిస్టిక్స్ గేట్వేగా అభివృద్ధి చేయాలని తాము భావిస్తున్నామన్నారు.
ఇందులో భాగంగా పెద్ద ఎత్తున పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నామ న్నారు.. విశాఖలో నిర్మాణంలో ఉన్న ఆర్ఎంఎం ఫార్మా యూనిట్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని కోరారు. ఆర్ఎంఎం ఫార్మా డైరెక్టర్ ముఖేష్కుమార్ మాట్లాడుతూ… విశాఖలో రూ.200 కోట్ల వ్యయంతో తమ సంస్థ చేపట్టిన యూనిట్ నిర్మాణం పురోగతిలో ఉందని, దీనిద్వారా 300మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. విశాఖ యూనిట్లో ఇంజెక్టబుల్స్, టాబ్లెట్లు, క్యాప్సూల్స్ తయారు చేస్తామని తెలిపారు. 2027 మార్చి నాటికి పూర్తి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుందని లోకేష్కు వివరించారు.















