- లోకోమోటివ్, బోగీ తయారీ కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని వినతి
సెయింట్ పీటర్స్ బర్గ్ (రష్యా): రష్యా లోని అతి పెద్ద రోలింగ్ స్టాక్ తయారీ దారు & అగ్రశ్రేణి ప్రపంచ సరఫరాదారు అయిన ట్రాన్స్ మాస్ హోల్డింగ్ జేఎస్సీ (Transmasholding JSC) ఫైనాన్స్ Vakhromo Ilya, నిర్వాహకుల తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్ బర్గ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… శ్రీసిటీ (తిరుపతి జిల్లా)లోని ఆల్సోమ్ భారీ మెట్రో రోలింగ్ స్టాక్ సదుపాయానికి ఆనుకొని ఒక ప్రధాన రైలు విడి భాగాల అసెంబ్లీ ప్లాంటు స్థాపించాలని ఆహ్వానించారు. దక్షిణాసియా అంతటా భారీ పారిశ్రామిక రైలు ప్రాజెక్టులకు సరఫరా చేయడానికి, ప్రత్యక్ష రహదారి అనుసంధానాన్ని ఉప యోగించుకుంటూ అధిక సామర్థ్యం గల సరుకు రవాణా లోకోమోటివ్ & బోగీ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే మెట్రో నెట్వర్క్ కోసం కీలకమైన సాంకేతిక ఏకీకరణను అందించే స్మార్ట్స్ సిగ్నలింగ్, ట్రాఫిక్ నియంత్రణ ఆర్జేడీ కేంద్రాల స్థాపనలో భాగస్వాములు అవ్వాలని కోరారు. పోర్టుల్లో ప్రాథమిక రోలింగ్ స్టాక్ ఓవర్ హాల్ & సముద్ర ఎగుమతి యార్డును అభివృద్ధి చేయడం, భారీ రైలు వాహనాలను ప్రపంచ మార్కెట్లకు సజావుగా రవాణా చేయడానికి ప్రత్యేకమైన రైల్-సైడింగ్ బెర్త్ ను అందించేందుకు ఏపీని ఎగుమతి కేంద్రంగా చేసుకోవాలని సూచించారు. ప్రముఖ మెకానికల్ & రైల్ ఇంజనీరింగ్ సంస్థలతో అనుసంధానించడం ద్వారా అత్యంత నైపుణ్యం కలిగిన తయారీరంగ ప్రతిభావంతులను నిరంతర సరఫరా చేయవచ్చని, దీని కోసం ఆంధ్రప్రదేశ్లో టెక్నికల్ స్కిల్ అప్డేడేషన్ & ఇంజనీరింగ్ నెట్ వర్క్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
ట్రాన్స్ మాస్ హోల్డింగ్స్ జేఎస్ సీ ప్రతినిధులు మాట్లాడుతూ… భారత్లో 120 వందే భారత్ స్లీపర్ రైళ్లను సరఫరా చేసేందుకుకుదిరిన భారీ $6.5 బిలియన్ల కాంట్రాక్టు అమలు చేయడానికి, TMH భారతీయ జాయింట్ వెంచర్ కైనెట్ రైల్వే సొల్యూషన్స్ పని చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని టీఎంహెచ్ ప్రతినిధులు చెప్పారు.














