చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సమర్ధ నిర్వహణతోనే నీటి భద్రత

జలవనరుల శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు

by చైతన్యరధం
Sep 12, 2025 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
సమర్ధ నిర్వహణతోనే నీటి భద్రత
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఈ ఏడాది వర్షాలు తగ్గినా నీటి సమస్య రానివ్వలేదు
  • రెండేళ్లలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తికావాలి
  • ప్రాధాన్యంతో శ్రీశైలం డ్యామ్‌ రక్షణ పనులు
  • భూగర్భ జలాల నమోదుకు 3 నెలల్లో కొత్త సెన్సార్లు
  • జలవనరుల శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు

అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ నీటి ఎద్దడి తలెత్తకూడదని… అన్ని కాలాల్లోనూ జల వనరులు సమృద్ధిగా లభించేలా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ఒక ఏడాది వర్షాలు సరిగ్గా లేకపోయినా, ఎగువ రాష్ట్రాలనుంచి వరద జలాలు రాకున్నా ఎలాంటి ఇబ్బంది రాకుండా నీటి నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. గతేడాది ఇదే సమయంతో పోల్చుకుంటే ఈ ఏడాది వర్షపాతం తక్కువుగా నమోదైందని, అయినప్పటికీ ఎక్కడా నీటి సమ్యస్య ఉత్పన్నం కానివ్వలేదని సీఎం అన్నారు. ఇది కేవలం సమర్ధ నీటి నిర్వహణతోనే సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత జలాశయాల నిల్వలు, నీటి నిర్వహణ, ప్రాజెక్టుల పురోగతి, భూగర్భజలాలు… తదితర అంశాలపై గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రస్తుతం 1,031 టీఎంసీ నీటి నిల్వలు
రాష్ట్రంలో మేజర్‌, మీడియం, మైనర్‌ ప్రాజెక్టుల్లో మొత్తం 1,313 టీఎంసీ నీటిని నిల్వ చేసేందుకు వీలుండగా.. ఇప్పటివరకు 1,031 టీఎంసీ నీటిని నిల్వ చేయగలిగామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలోని భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టుల్లో 79 శాతం నీరు నిల్వ ఉందన్నారు. సెప్టెంబర్‌ మొదటివారానికే ఈ స్థాయికి నిండాయని వివరిస్తూ.. ఇందులో శ్రీశైలం సహా మేజర్‌ ప్రాజెక్టుల్లో 89 శాతంమేర, మీడియం జలాశయాలు 57 శాతం, మైనర్‌ ప్రాజెక్టుల్లో 39 శాతంమేర నీటి నిల్వలు ఉన్నాయన్నారు. సోమశిల, కండలేరు, బ్రహ్మంసాగర్‌ నింపే విషయంలో సమస్యలను పరిష్కరించాలని సీఎం అన్నారు.

38,457 చెరువులు నింపేలా చర్యలు
రాష్ట్రంలో 38,457 చెరువులకు గాను… 32,642 చెరువులను ఇంకా పూర్తిగా నింపాల్సి ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పరిధిలోని 497 చెరువులకుగాను 51 చెరువులు పూర్తిగా నిండాయని అధికారులు తెలిపారు. అన్ని చెరువులు వీలైనంత త్వరగా నింపగలిగితే హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పరిధిలోని 89,117 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే రూ.6,518 కోట్ల వ్యయమయ్యే ప్రాధాన్య ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. దీనిద్వారా 2,81,139 ఎకరాలకు కొత్తగా సాగునీరు ఇవ్వడంతో పాటు, 3,38,326 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యపడుతుందన్నారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశంధార ప్రాజెక్ట్‌, సర్దార్‌ గౌతు లచ్ఛన్న తోటపల్లి బ్యారేజ్‌ ప్రాజెక్ట్‌, తారకరామ తీర్థ సాగరం రిజర్వాయర్‌ ప్రాజెక్ట్‌, గాలేరు నగరి సుజల స్రవంతి పనుల పురోగతిపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. గాలేరు నగరి సుజల స్రవంతి 108 కి.మీ.మేర పూర్తి చేసి కడప వరకు జలాలు తీసుకువెళ్లేలా, పనులు నిలిచినచోట్ల మళ్లీ టెండర్లు పిలిచి యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. రూ.1,686 కోట్లతో చేపట్టిన శ్రీశైలం డ్యామ్‌ రక్షణ పనులు, ఎస్కేప్‌ చానల్‌ పనులు శరవేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశిస్తూ.. పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

సంబంధితవార్తలు

నాయకత్వ కేంద్రాలుగా ట్రైబల్ వర్శిటీలు

చైతన్యరధం ఈ పేపర్ 01-07-2026

లక్ష్యం.. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ!

ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ.2 వేల కోట్లు
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయండి. ఇందుకోసం ఈ ఏడాది వెయ్యి కోట్లు, వచ్చే ఏడాది మరో వెయ్యి కోట్లు ఇస్తాం. అటు పోలవరం లెఫ్ట్‌ మెయిన్‌ కెనాల్‌… ఇటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి.. ఇలా రెండువైపులా పంపులతో విశాఖ నగరానికి ప్రాజెక్టులు విస్తరించాలి. వంశధార, నాగావళి, చంపావతి అనుసంధానం చేస్తూ ఈ ప్రాంతంలోని అన్ని రిజర్వాయర్లు నింపడం ద్వారా ఉత్తరాంధ్రలో వాటర్‌ నెట్వర్క్‌ ఏర్పాటు చేయాలి. ఇది ఉత్తరాంధ్ర నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తుంది. ఏలేరు పూర్తిగా నింపాలి. పోలవరం లెఫ్ట్‌ మెయిన్‌ కెనాల్‌ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీటిని తరలించడానికి ఏలేరు ఎంతో కీలక’మని చంద్రబాబు పేర్కొన్నారు.

ముందుగా వరికపూడిసెల ఫేజ్‌ 1 పనులు
హెడ్‌ వర్క్స్‌ వినా.. వరికపూడిసెల ఫేజ్‌`1లో మిగిలిన అన్ని పనులు పూర్తి చేసి 24,900 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చేందుకు సిద్ధం చేయాలని సీఎం అధికారులకు చెప్పారు. అలాగే ఫేజ్‌`2 పనులకు సంబంధించి అటవీ, పర్యావరణ అనుమతులు వచ్చే ఏడాది జనవరి నాటికల్లా సాధించాలని ఆదేశించారు. రెండు దశలు పూర్తి చేయడానికి రూ.1,925 కోట్లు వ్యయం కానుండగా, 84,281 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. గతేడాదికన్నా ఈ ఏడాది రాష్ట్రంలో 1.25 మీటర్లమేర భూగర్భజలాలు పెరిగాయి. సెప్టెంబర్‌ 1నాటికి సగటు భూగర్భజలాలు 8.43 మీటర్లుగా ఉన్నాయి. భూగర్భజలాలు 8 మీటర్ల కంటే దిగవకు ఉన్న 7,762 గ్రామాల్లో వాటి పెంపునకు ఫామ్‌ పాండ్స్‌, చెక్‌ డ్యామ్‌ల నిర్మాణంవంటి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అలాగే భూగర్భ జలాల సమాచారం రియల్‌ టైమ్‌లో స్పష్టంగా తెలుసుకునేందుకు వచ్చే 3 నెలల్లో కొత్త సెన్సర్ల ఏర్పాటు పూర్తిచేయాలని నిర్దేశించారు. సమీక్షా సమావేశంలో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడుతోపాటు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 11-09-2025

Next Post

మీరే.. నా కొత్త టీం!

మరిన్ని వార్తలు

ఆంధ్రప్రదేశ్

నాయకత్వ కేంద్రాలుగా ట్రైబల్ వర్శిటీలు

చైతన్యరధం
@ July 1, 2026
చైతన్యరధం ఈ పేపర్ 01-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-07-2026

కార్యకర్త
@ July 1, 2026
లక్ష్యం.. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ!
ఆంధ్రప్రదేశ్

లక్ష్యం.. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ!

చైతన్యరధం
@ July 1, 2026
ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్
ఆంధ్రప్రదేశ్

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

చైతన్యరధం
@ July 1, 2026
భోగాపురం మోడల్ స్కూల్లో ప్రధాన్, లోకే ష్
ఆంధ్రప్రదేశ్

భోగాపురం మోడల్ స్కూల్లో ప్రధాన్, లోకే ష్

చైతన్యరధం
@ July 1, 2026
ప్రజా జీవితాల్లో మార్పుతెచ్చేదే అసలైన విద్య
ఆంధ్రప్రదేశ్

ప్రజా జీవితాల్లో మార్పుతెచ్చేదే అసలైన విద్య

చైతన్యరధం
@ July 1, 2026
మంగళగిరిలో క్రికెట్ పండుగ
ఆంధ్రప్రదేశ్

మంగళగిరిలో క్రికెట్ పండుగ

చైతన్యరధం
@ July 1, 2026
ప్రైవేటు స్కూళ్లను మించి ప్రభుత్వ స్కూళ్లు!
ఆంధ్రప్రదేశ్

ప్రైవేటు స్కూళ్లను మించి ప్రభుత్వ స్కూళ్లు!

చైతన్యరధం
@ June 30, 2026
Load More

ముఖ్య వార్తలు

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

చైతన్యరధం
@ July 1, 2026
అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

చైతన్యరధం
@ June 30, 2026
మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!

మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!

చైతన్యరధం
@ June 30, 2026
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి

చైతన్యరధం
@ June 29, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నాయకత్వ కేంద్రాలుగా ట్రైబల్ వర్శిటీలు

చైతన్యరధం
@ July 1, 2026
లక్ష్యం.. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ!

లక్ష్యం.. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ!

చైతన్యరధం
@ July 1, 2026
ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

చైతన్యరధం
@ July 1, 2026
భోగాపురం మోడల్ స్కూల్లో ప్రధాన్, లోకే ష్

భోగాపురం మోడల్ స్కూల్లో ప్రధాన్, లోకే ష్

చైతన్యరధం
@ July 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist