చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం

by చైతన్యరధం
November 13, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం
  • పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు
  • ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు
  • రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం

విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో భాగంగా రష్యా`ఇండియా ఆర్థిక భాగస్వామ్యంపై (రష్యా ఇండియా ఎకనమిక్ పార్టనర్‌షిప్: వైజాగ్ టు కజాన్: రీజినల్ పార్టనర్‌షిప్స్ టు గ్లోబల్ ఆపర్చునిటీస్) నిర్వహించిన ప్రత్యేక సదస్సులో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. భారత్‌లో రష్యా రాయబారి డెనిస్, ఆయనతో పాటు విశాఖపట్నం వచ్చిన ప్రతినిధి బృందానికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. రష్యాతో నా పరిచయం, అనుబంధం, ప్రయాణం ఇటీవలే ప్రారంభమ య్యాయి. ఒక దేశాన్ని సందర్శించేటప్పుడు ఆ దేశం గురించి కొన్ని అభిప్రాయాలు, అంచనాలు ఉంటాయి. అయితే సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో పాల్గొనాల్సిందిగా మీరు నన్ను ఆహ్వానించడం నా అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.

ఆ పర్యటన నాకు రష్యాను సందర్శించే అవకాశాన్ని మాత్రమే కాకుం డా ఆ దేశంతో లోతైన, అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచుకునే గొప్ప అవకాశాన్ని కల్పించిందని తెలిపారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ గత కొన్నేళ్లుగా నిర్మించిన బలమైన ద్వైపాక్షిక సంబంధాలకు కొనసాగింపుగా ఈ అనుబంధం మరింత బలోపేతమవుతోంది. రష్యాలోని వివిధ రంగాలకు చెందిన అనేక కంపెనీల ప్రతినిధులను కలుసుకునే అవకాశం కూడా లభించింది. అంతేకాకుండా కుటుంబంతో కలిసి రష్యా పర్యటించే అదృష్టం కూడా కలిగింది. ఆ పర్యటన ద్వారా తరతరాలుగా రష్యా నిర్మించుకున్న విలువలు, సంస్కృతి, సంప్రదా యాల గొప్పతనాన్ని మరింతగా అర్థం చేసుకోగలిగామని పేర్కొన్నారు.

పరస్పర సహకారంతో ప్రగతి
భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో రష్యా ఎప్పుడూ గొప్ప భాగ స్వామిగా నిలిచింది. ప్రపంచం మనకు దూరమైన సందర్భాల్లో కూడా రష్యా మనకు అండగా నిలిచింది. ఒక యువ భారతీయుడి గా, భారత్-రష్యా సంబంధాలు కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాకూడదని విశ్వసిస్తున్నా. మన సహకారాన్ని మరింత అర్థవంతంగా విస్తరించుకోవాలి. పరిశోధన రంగంలో పరస్పర జ్ఞానాన్ని, అనుభవాలను పంచుకోవడం, శతాబ్దాలుగా రష్యా సంపాదించుకున్న నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానాన్ని మన దేశానికి తీసుకువచ్చి ఇక్కడి వనరులు, అవకాశాలతో అనుసంధానం చేసి పరస్పరం విలువను ఎలా సృష్టించుకోవాలి అనే అంశాలపై మనం దృష్టి పెట్టాలని ఆకాంక్షించారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. సీఎం చంద్రబాబు దార్శనికతతో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ఆయన వయసు 76 సంవత్సరాలు కావచ్చు. కానీ ఆయనలో ముగ్గురు 25 ఏళ్ల యువకులు ఉన్నారు. వివిధ తరాల కు చెందిన ప్రజలతో, ప్రపంచంలోని వివిధ దేశాలతో లోతైన, అర్థవంతమైన భాగస్వామ్యాలను నిర్మించాలనే అపారమైన శక్తి, ఉత్సాహం ఆయనలో ఉన్నాయి. ద్వైపాక్షిక సమావేశం సందర్భం గా మనం చర్చించుకున్నట్లుగా ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తర తరాలుగా ప్రపంచంలోని వివిధ దేశాలతో బలమైన సంబంధా లను నిర్మించుకుంటూ వస్తోంది. భారత్-రష్యా దేశాలు కలిసి తమ భాగస్వామ్యంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇరు దేశాల నాయకులు మన భవిష్యత్ ప్రయాణానికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారని వ్యాఖ్యానించారు.

భారత్-రష్యా బంధం మరింత బలోపేతం కావాలి
ఈ రోజు మన గౌరవ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఒక అద్భుతమైన పోలికను ప్రస్తావించారు. దీపావళి సందర్భంగా వెలి గించే దీపం వెలుగును, శక్తిని అందిస్తుంది. అదేవిధంగా భారత్, రష్యా దేశాలు కూడా పరస్పరం శక్తిని అందించుకుంటూ ఒకరి కొకరు తోడ్పడే భాగస్వామ్యాన్ని నిర్మించుకోవాలి. ఇప్పటికే నిర్మిం చిన బలమైన పునాదులపై ఆధారపడి భారత్-రష్యా సంబంధా లను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. రష్యాలో నా పర్యటన సందర్భంగా గుర్తించిన సహకార రంగాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.

రేర్ ఎర్త్ మినరల్స్ కోసం లోతైన పరిశోధనలు
ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ప్రత్యేక కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో లోతైన పరిశోధన, పరస్పర సహకార అవకా శాలను పరిశీలిస్తున్నాం. ఈ రంగానికి సంబంధించి ఎకో సిస్టమ్ అభివృద్ధి, అందుబాటులో ఉన్న అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశాలపై కలిసి పనిచేయాలని భావిస్తున్నాం. ఏపీ మెరుగైన ఫలితాలు సాధించడానికి మరింత వేగంగా ముందుకు సాగడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ఏపీ ప్రత్యేకతలు. పెట్టుబడులు, ప్రాజెక్టుల అమలులో వేగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. రెండోది స్టెబిలిటీ. మనం చేపట్టే ప్రతి కార్యక్రమం కాలపరీక్షకు, రాజకీయ మార్పులకు తట్టుకుని నిలబ డాలి. పెట్టుబడిదారులకు దీర్ఘకాలిక విధాన స్థిరత్వంపై నమ్మకం కల్పించాలి. రష్యా నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపుతున్న పారిశ్రామికవేత్తల కోసం మేం రెండు ప్రత్యేక వ్యవస్థలను రూపొందిస్తున్నాం. ఎస్క్రో మెకానిజం ద్వారా ప్రభు త్వం పెట్టుబడిదారులకు ప్రకటించిన ప్రోత్సాహకాలు, రాయితీలు తప్పనిసరిగా అందేలా హామీ కల్పించే వ్యవస్థను ఏర్పాటు చేస్తు న్నాం.

ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా పెట్టుబడిదారుల ప్రయో జనాలను పరిరక్షించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తున్నామని వివరించారు. మూడోది పెట్టుబడిదారులతో ఒకసారి చేతులు కలి పిన తర్వాత అది ఇకపై మీ ప్రాజెక్టు మాత్రమే కాదు. అది మనం దరి ఉమ్మడి ప్రాజెక్టుగా మారుతుంది. ఆ ప్రాజెక్ట్ విజయానికి ప్రభుత్వం కూడా సమాన బాధ్యత తీసుకుంటుంది. ఈ మూడు అంశాల ఆధారంగా రష్యాతో కలిసి పనిచేయడానికి ఎంతో ఆస క్తిగా ఎదురుచూస్తున్నాం. భారత్-రష్యా భాగస్వామ్య ప్రయాణం లో ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ అద్భుతమైన ప్రయా ణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రినాక్ ఇండియా లిమిటెడ్ సీఈవో, సీఐఐ కోల్డ్ చైన్ టాస్క్‌ఫోర్స్ కో చైర్మన్ డాక్టర్ సోజీ అబ్రహాం, భారత్‌లో రష్యా రాయబారి డెనిస్ అలి పోవ్, భారతదేశంలోని రష్యన్ ఫెడరేషన్ వాణిజ్య కమిషనర్ ఆండ్రీ సోబోలెవ్, ట్రేడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ రష్యా ఇన్ ఇండియా జ్లాటా ఆంటుషేవా, రిపబ్లిక్ ఆఫ్ తతారిస్తాన్ పెట్టుబడుల అభి వృద్ధి సంస్థ డిప్యూటీ హెడ్ లెనార్ జమాలియేవ్, స్బేర్ బ్యాంక్ ఇండియా కార్పోరేట్ అండ్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ డిపార్ట్ మెంట్ హెడ్ ఆర్టెమ్ బటాలోవ్, రోసాటమ్ సౌత్ ఏషియా బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ ఎకటెరినా అస్తాషినా, జీSC గిరెడ్‌మెట్ సంస్థ అధిపతి ఆండ్రీ గోలినీ, మోహన్ ముత్తా ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ప్రఫుల్ ముత్తా పాల్గొన్నారు.

Previous Post

ఏపీలో జపాన్ ఇండస్రియల్ క్లస్టర్

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 13-11-2026

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-11-2026

November 13, 2026
ఏపీలో జపాన్ ఇండస్రియల్ క్లస్టర్
ఆంధ్రప్రదేశ్

ఏపీలో జపాన్ ఇండస్రియల్ క్లస్టర్

November 13, 2026
మహిళా సాధికారతకు ప్రత్యేక టెక్ పార్క్
ఆంధ్రప్రదేశ్

మహిళా సాధికారతకు ప్రత్యేక టెక్ పార్క్

November 13, 2026
మోండెలేజ్ భాగస్వామ్యంతో కోకో మిషన్
ఆంధ్రప్రదేశ్

మోండెలేజ్ భాగస్వామ్యంతో కోకో మిషన్

November 13, 2026
సీఐఐ సదస్సులో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

సీఐఐ సదస్సులో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు

November 13, 2026
పెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్

పెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్

November 13, 2026
Next Post
చైతన్యరధం ఈ పేపర్ 13-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 13-11-2026

ముఖ్య వార్తలు

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

by చైతన్యరధం
November 13, 2026

ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

by చైతన్యరధం
November 13, 2026

25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...

పెట్టుబడులకు భద్రత… జాతీయస్థాయిలో రక్షణ చట్టం

పెట్టుబడులకు భద్రత… జాతీయస్థాయిలో రక్షణ చట్టం

by చైతన్యరధం
November 13, 2026

పెట్టుబడిదారులకు నమ్మకం కల్పించడమే లక్ష్యం ప్రభుత్వాల మధ్య వైరుధ్యాలకు వారు బలికాకూడదు రాయితీల కోసం ఎస్క్రో ఖాతాలు తెరుస్తున్నాం వికేంద్రీకరణ ప్రణాళికలతో అభివృద్ధి సంకల్పం పెట్టుబడుల సాధనలోనే...

సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ఫ్రంట్ రన్నర్

సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ఫ్రంట్ రన్నర్

by చైతన్యరధం
November 10, 2026

యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం తలసరి ఆదాయంలో 13వ స్థానం... అయినా అవకాశాల కల్పనలో రెండో స్థానం ఆదాయానికి మించి ప్రజలకు సేవలు, సౌకర్యాలు...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 13-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 13-11-2026

by కార్యకర్త
November 13, 2026

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

by చైతన్యరధం
November 13, 2026

ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...

ఏపీలో జపాన్ ఇండస్రియల్ క్లస్టర్

ఏపీలో జపాన్ ఇండస్రియల్ క్లస్టర్

by చైతన్యరధం
November 13, 2026

ఏర్పాటుకు కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి సీఎం చంద్రబాబుతో భేటీలో జేఆరఐ చైర్మన్ త్వరలోనే అమరావతిలో ఏపీ-జపాన్ బిజినెస్ సమ్మిట్ ఏర్పాటుకు ఆలోచిస్తున్నట్లు వెల్లడి విశాఖపట్నం(చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో జపాన్...

మహిళా సాధికారతకు ప్రత్యేక టెక్ పార్క్

మహిళా సాధికారతకు ప్రత్యేక టెక్ పార్క్

by చైతన్యరధం
November 13, 2026

ఉచిత భూమి, ప్రోత్సాహకాలు ఇచ్చేలా సహకరిస్తాం రాజకీయంగా, ఆర్థికంగా వారి భాగస్వామ్యం పెరగాలి అన్ని రంగాల్లో ఎదిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యం స్థానిక సంస్థల్లో 50 శాతం...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.