చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

దళిత ద్రోహి జగన్ రెడ్డి దళిత బాంధవుడు – పేదల పెన్నిధి చంద్రన్న పుస్తకావిష్కరణ

by చైతన్యరధం
April 25, 2023
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
TDP released new book

TDP released new book On ys jagan Anarchies

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ప్రతి దళితుడు ఈ పుస్తకం చదవాలి
జగన్ ను, ప్రభుత్వాన్ని నిలదీయాలి
దళిత గృహాలన్నింటికి పుస్తకం పంపిణీ
జగన్ పతనానికి నాంది పలుకుతాం
టిడిపి దళిత నాయకుల శపధం

‘దళిత ద్రోహి జగన్ రెడ్డి, దళిత బాంధవుడు – పేదల పెన్నిధి చంద్రన్న’ పుస్తకాన్ని ప్రతిదళితుడు చదివి, జగన్ ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు దళిత నాయకులు పిలుపునిచ్చారు. టిడిపి కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ప్రతి దళిత గృహానికి పంపించనున్నట్టు వెల్లడించారు. జగన్ బాగోతాన్ని, దుర్మార్గాలను దళితవాడల్లో ఎండగట్టి, అబద్ధాలు, అసత్యాలతో దళితుల ఓట్లు దండుకున్న జగన్మోహనరెడ్డి పతనానికి నాందిపలుకుతామని వారు శపధం చేశారు. పుస్తకావిష్కరణ సందర్భంగా నాయకుల వ్యాఖ్యలు వారి మాటల్లోనే …

జగన్మోహన్ రెడ్డి పతనానికి నాంది పలుకుతాం : వర్ల రామయ్య (టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు)

‘దళిత బాంధవుడు-పేదల పాలిటి పెన్నిధి చంద్రన్న’ అని మేమంటాం. కాదనే ధైర్యం ప్రభుత్వంలోని దళిత మంత్రులకు, వైసీపీ దళితనేతలకు, మరీ ముఖ్యంగా సజ్జల రామకృష్ణా రెడ్డికి ఉందా? ఎందుకంటే దళితుల్ని ఆడిస్తున్న రింగ్ మాస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డే. దళిత ద్రోహి జగన్ అని మేం అంటున్నాం. కాదనే ధైర్యముంటే మాతో బహిరంగచర్చకు వస్తారా? దళిత నేతలతో, దళితమంత్రులతో సమావేశాలు పెట్టే హక్కు ఈ ప్రభుత్వానికి, సజ్జలకు ఎక్క డుంది? డాక్టర్ సుధాకర్ ఎందుకు చనిపోయాడో, పోలీస్ స్టేషన్లో వరప్రసాద్ కు శిరోముండనం ఎందుకు జరిగిందో, ఓంప్రతాప్ అనే దళితయువకుడు ఎందుకు చనిపోయాడో, ఎవరు చంపారో, దళితఆడబిడ్డల మానప్రాణాలను ఎందుకు బలితీసుకున్నారో, ఎవరు బలి తీసుకున్నారో సమాధానం చెప్పాకే సజ్జల దళిత సమావేశాలు నిర్వహించాలి. పులివెందులలో నాగమ్మ పై ఎవరు అత్యాచారం చేశారో, ఎందుకు చంపారో సమాధానం చెప్పాకే ముఖ్యమంత్రి దళిత మం త్రులతో మీటింగ్ లు పెట్టాలి. ఏం నైతిక అర్హత ఉందని ముఖ్యమంత్రి దళితమంత్రులు, దళిత నేతలతో సమావేశాలు పెడుతున్నాడు? ఏం ఇరగబొడిచాడని ముఖ్యమంత్రి సమావేశాలు పెడుతున్నాడు. మీ బాగోతాన్ని ప్రతిదళితఇల్లు, వాడవాడా తెలియచేస్తాం.

చంద్రబాబు ముమ్మాటికీ దళిత బాంధవుడు.. పేదలపెన్నిధే. దళితుల్ని తన ఇనుప పాదాల కింద వేసి తొక్కుతున్న జగన్మోహన్ రెడ్డి దళితబాంధవుడా? ఎస్సీఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది చంద్రబాబు. ఎస్పీని, కలెక్టర్ ను కూడా ప్రశ్నించే హక్కు దళితులకు ఇచ్చిన చంద్రబాబు వారికి బాంధవుడా.. దళితుల్ని ఇనుపపాదాలకింద వేసి తొక్కుతున్న జగన్మోహన్ రెడ్డా? కాదని చెప్పే దమ్ము, ధైర్యం సజ్జలకు ఉందా? ఆధారాలతో సహా తాము నిరూపిస్తాం. ప్రపంచఖ్యాతిగాంచిన డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ పేరుతో బీ.ఆర్.అం బేద్కర్ విదేశీవిద్య పథకాన్ని చంద్రబాబు తీసుకొస్తే, జగన్ దానిపేరు మార్చి, తనపేరు పెట్టు కుంటాడా? జగనన్న విదేశీ విద్యా దీవెనా..అంబేద్కర్ పేరు తీసి, తనపేరు పెట్టుకుంటే, చొక్కా విప్పిన మంత్రిగానీ, ఇతర దళిత మంత్రులు గానీ ఏమిటిదని ముఖ్యమంత్రిని ప్రశ్నించారా? డాక్టర్ అంబేద్కర్ కంటే జగన్ గొప్పవాడా? దీనిపై సజ్జల సమాధానం చెప్పాలి.

జగన్ అంబే ద్కర్ పేరుతీసేసి, తనపేరు పెట్టిననాడు బుద్ధి, జ్ఞానం లేని మంత్రులు ఎందుకు నోరెత్తలేదు? ఈరోజు మీటింగ్ లు పెట్టి ఏం మాట్లాడతారు? ఆహా సజ్జల.. జై జగన్ అంటారా? దళితుల కోసం చంద్రబాబు అమలు చేసిన 28 ప్రత్యేక పథకాల్ని జగన్ రద్దు చేసినప్పుడు దళిత మంత్రులు నోరెత్తారా? ఎమ్మెల్సీ అనంతబాబు మనిషికాదు.. పశువు అని నేనంటాను . కాదని చెప్పే ధైర్యం సజ్జలకు, దళిత మంత్రులకు ఉందా? తన వద్ద పనిచేసే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్నిచంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తాడా? అంతకండ కావరమా అతనికి? అ నంతబాబు పై ఇప్పటి వరకు చర్యలు తీసుకోని ఈ ప్రభుత్వంలో ఇంకా దళిత మంత్రులు కొనసా గడం సిగ్గుచేటు.

జూపూడి ప్రభాకర్ కు బుద్ధిలేదా? షేక్స్ పియర్ డ్రామాలో యూ టూ బ్రూట స్ లాంటి వాడు జూపూడి. చివరి రోజుల్లో చంద్రబాబు కన్నెర్రచేసి ఉంటే జూపూడి, మరో అధికారి జైలు పాలయ్యేవారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తొలి రోజునే జూపూడినోట నిజాలు పలికిస్తాం. ‘దళిత ద్రోహి జగన్ రెడ్డి : దళిత బాంధవుడు, పేదల పెన్నిధి చంద్రబాబు’ పుస్తకాల్ని ప్రతి దళితుడి ఇంటికి పంపిస్తాం. జగన్ బాగోతాన్ని, దుర్మార్గాలను దళితవాడల్లో ఎండగడతాం. అబద్ధాలు, అసత్యాలతో దళితులఓట్లు దండుకున్న జగన్మోహన్ రెడ్డి పతనం దళితులచేతు ల్లోనే ఉంది. టీడీపీ విడుదల చేసిన పుస్తకంలోని ప్రతి అంశాన్ని ఆధారాలతో సహా నిరూపించడానికి తాము సిద్ధం. దళిత మంత్రులు ఎవరైనా, ఎప్పుడైనా చిత్తశుద్ధితో నిజాయితీతో చర్చకు రావచ్చు. ఊరికే నోళ్లున్నాయని ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం కాదు.

చంద్రబాబు దళితులకు చేసిన సంక్షేమం, మేలుని ఆధారాలు, లెక్కలతో సహా నిరూపిస్తాం : శ్రీ నక్కా ఆనంద్ బాబు (టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి)

‘దళిత ద్రోహి జగన్ రెడ్డి : దళిత బాంధవుడు, పేదల పెన్నిధి చంద్రబాబు’ అన్నది యదార్థం. మేం రాజకీయాల కోసం మాట్లాడటం లేదు. ఉన్ననిజాన్ని, జరిగిన వాస్తవాలనే చెబుతున్నాం . మంది ఉన్నారని, నోళ్లున్నాయని అడ్డగోలుగా మాట్లాడటం కాదు. ఏమాత్రం చిత్తశుద్ధి, దమ్ము, ధైర్యమున్నా మేం విడుదల చేసిన పుస్తకంపై నిజాయితీగా చర్చకు రావాలి. నిన్న బట్టలు ఊడదీసుకొని తిరిగిన మంత్రి అయినా, మేరుగ నాగార్జున అయినా ఎవరొచ్చినా సరే, నేను, రామయ్యగారు ఆధారాలతో సహా పుస్తకంలోని అంశాలను నిరూపిస్తాం.

గూగుల్ లో, సోషల్ మీడియాలో చంద్రబాబుపై కావాలనే విషప్రచారం చేస్తున్నారు. నిజాయి తీగా దళితుల కోసం, వారిసంక్షేమం, అభివృద్ధికోసం పనిచేసింది తెలుగుదేశం పార్టీనే. వారి అభివృద్ధికి, సంక్షేమానికి బీజంవేసింది స్వర్గీయ ఎన్టీఆర్ అయితే, దాన్ని కొనసాగించింది చంద్రబాబుగారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ దగ్గరనుంచి చూస్తే చంద్రబాబు దళితులకు ఏం చేశారో అర్థమవతుంది. దేశంలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉండేది. కానీ రాష్ట్రంలో ప్రత్యేకం గా చంద్రబాబుగారే ఎస్సీఎస్టీ కమిషన్ ఏర్పాటుచేశారు. ఆ ఘనతదేశంలో చంద్రబాబుకి తప్ప ఎవరికీ లేదని ఘంటాపథంగా చెప్పగలం. జస్టిస్ పున్నయ్య కమిషన్ ఇచ్చిన ప్రతి రికమండే షన్ ను చంద్రబాబుగారు ఆమోదించి, అమలు కోసం 18జీవోలు విడుదల చేశారు. జగన్ ఈ 4 ఏళ్లలో ఇలాంటిది ఒక్కటైనా దళితుల కోసం చేశాడా?

ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ను జగన్ మూడు ముక్కలుచేశాడు? మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లు అన్నాడు. మూడు కార్పొరేషన్లకు కనీసం మూడు రూపాయలైనా ఇచ్చాడా? అసలు సిగ్గు, లజ్జ ఉండే మాట్లాడుతున్నారా? తమ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 4 లక్షలమంది దళితయువతకు ఉపాధి కల్పించాము. తాను సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నప్పుడు దళితులకు టీడీపీ ప్రభుత్వం ఎంతఖర్చుపెట్టిందో ఆధారాలతో సహా బయటపెడ తాను. ఇప్పుడు మంత్రిగా ఉన్న నాగార్జున జగన్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పగలడా? చేతగాని మాటలు తప్ప ఏమీ చెప్పలేరు. అమ్మ ఒడి దళితులకే ఇస్తున్నారా? అందరికీ ఇస్తున్నా రు. రెసిడెన్షియల్ వ్యవస్థకు శ్రీకారంచుట్టిందే తెలుగుదేశం ప్రభుత్వం. వాటిని వందల సంఖ్యకు చేర్చింది చంద్రబాబుగారు. జగన్ వచ్చాక టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ ని అయినా పూర్తి చేశాడా? దళిత బిడ్డల కోసం చంద్రబాబు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు తీసుకొస్తే, జగన్ వాటిని రద్దు చేశాడు.

దళిత యువతను విదేశాలకు పంపేందుకు చంద్రబాబు డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ విదేశీ విద్య పథకం తీసుకొస్తే, దాని పేరు జగనన్న విదేశీ విద్యగా మార్చి ఎవరికీ రూపాయి ఇవ్వకుండా నీరుగార్చాడు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని, భూమి కొనుగోలు పథకం, ఇన్నోవాకార్లు ఇచ్చే పథకాల్ని రద్దు చేశాడు. ఎస్సీ ఎస్టీల పై అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత జగన్ కే దక్కింది. దళిత రైతులకు బేడీలు వేసిన దరిద్రపు ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. సబ్ ప్లాన్ అమలుపై దళితవాడల్లో చర్చకు వచ్చే ధైర్యం దళితమంత్రులకు ఉందా? టీడీపీ ప్రభుత్వం దళితవాడల్లో మౌలిక వసతుల కల్పనకు ఐదేళ్లలో రూ.45 వేల కోట్లు ఖర్చుపెడితే, జగన్ రూ.33 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించాడు. దళితులకు అదనంగా రావాల్సిన సౌకర్యాలను జగన్ రద్దు చేశాడు.

డిగ్రీ చదివిన దళిత యువకుడు పీజీ చదవకుండా చేశాడు. బీటెక్ చదివినవారు ఎంటెక్ చదవకుండా చేశాడు. జీవోనెం-77 తీసుకొచ్చి వారి ఉన్నతచదువులకు గండికొట్టాడు. యూనివర్సిటీల్లో సీట్లువస్తే తప్ప, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ కాలేజీల్లో చదివే అవకాశం లేకుండా చేసింది జగన్ కాదా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు ఒక దళిత కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే, అందరికీ చదువుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పుడు జగన్ ఒక్కడికే అమ్మ ఒడి ఇవ్వడం అన్యాయం కాదా? దళితులకు చంద్రబాబు అమలుచేసిన పథకాల్ని దారుణంగా రద్దు చేసింది కాక, సిగ్గు లేకుండా నోళ్లున్నాయని ఇష్ట మొచ్చినట్టు మాట్లాడతారా? నేను చెప్పిన అంశాల పై ఎప్పుడైనా, ఎక్కడైనా సరే చర్చకు సిద్ధం. ఉత్తుత్రి ప్రమాణాలు, చర్చలు కాకుండా చిత్తశుధ్ధితో చర్చకు రావాలని దళిత మంత్రులకు సవాల్ విసురుతున్నా. దళితులకు జగన్ రద్ దుచేసిన పథకాలు ఒకెత్తు అయితే, దళితులు,దళిత ఆడబిడ్డలపై జరిగిన హత్యలు, అత్యాచారాలు మరో ఎత్తు. వాటి పై కూడా చర్చకు సిద్ధమే.” తాడేపల్లికి భయపడి దళిత మంత్రులు, వైసీపీలోని దళిత నేతలు చచ్చుపాముల్లా ప్రవర్తిస్తున్నారు.

దళితులపై జగన్ దాడులు, దుర్మార్గాలకు పాల్పడినప్పుడు మంత్రి సురేశ్ చొక్కాలు విప్పలేదేం? : శ్రీమతి పీతలసుజాత (మాజీ మంత్రి).

” వైసీపీ ప్రభుత్వం ఆదినుంచి ప్రజావ్యతిరేక విధానాలనే నమ్ముకుంది. జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న చంద్రబాబునాయుడి పర్యటనలు అడ్డుకోవడం జగన్ ప్రభుత్వ దిగజారుడు తనానికి నిదర్శనం. రిజర్వుడు నియోజకవర్గాల్లో చంద్రబాబుని అడ్డుకోవడానికి, ప్రభుత్వం దళితుల్ని అవమానించేలా వ్యవహరిస్తోంది. యర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ తీరు యావత్ దళిత జాతికే కళంకం. చంద్రబాబునాయుడి పర్యటనల్లో తలెత్తే సంఘటనలు రాష్ట్ర ఇంటిలిజెన్స్ వ్యవస్థకు తెలియవా? అన్యాయంగా, అక్రమంగా టీడీపీ నేతల పై కేసులపెట్టడాని కే ఇంటిలిజెన్స్, పోలీస్ వ్యవస్థలు పనిచేస్తాయా?

4 ఏళ్లలో జగన్, అతని ప్రభుత్వం దళితులకు తీరని అన్యాయం చేసింది. తాము విడుదలచేసి న పుస్తకం పై దమ్ముంటే ప్రభుత్వంలోని దళిత మంత్రులు ఎవరైనా సరే చర్చకు రావచ్చు. తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు గారు దళితుల కోసం అమలు చేసిన సంక్షేమం, పథకాల పై పూర్తి వాస్తవాలు, ఆధారాలతో సహా నిరూపించడానికి తాము సిద్ధం. తాడేపల్లికి భయపడి దళిత మంత్రులు, వైసీపీ దళిత నేతలు చచ్చపాముల్లా ప్రవర్తిస్తున్నారు. దళిత జాతి పై జగన్ దాడులు , దురాగతాలు చేయించినప్పుడు మంత్రి సురేశ్ ఎందుకు చొక్కాలు విప్పలేదు? మేరుగ నా గార్జున ఎందుకు మాట్లాడలేదు? జూపూడి ఎందుకు స్పందిచ లేదు? ఎవరు తమకు న్యాయం చేస్తారో, ఎవరు అన్యాయం చేస్తున్నారో దళితులకు అర్థమైంది. సరైన సమయంలో వారు సరైన విధంగా ప్రభుత్వానికి బుద్ధిచెబుతారు.”

దళిత మహిళల మానప్రాణాల్ని క్రూరాతిక్రూరంగా బలి తీసుకుంటున్న జగన్ , దళితుల బిడ్డ ఎలా అవుతాడు? : పిల్లి మాణిక్యరావు (టీడీపీ అధికార ప్రతినిధి).

“దళితుల పై జరిగిన దాడులు, హత్యలు, అత్యాచారాల పై, దళితుల అభివృద్ధి, సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టి, ఎంత మేలు చేసిందో చర్చకు రావాలని మా పార్టీనేతలు కోరారు. దాని పై నిజాయితీగా, చిత్తశుద్ధితో చర్చకు వచ్చే ధైర్యం దళిత మంత్రులకు లేకపోతే, మగాడైతే సజ్జల అయినా రావచ్చు. జగన్ ప్రభుత్వంలో దళితులపై హత్యలు, అత్యాచారాలే జరగలేదనే ఆధారాలుంటే వాటితో చర్చకు రావచ్చు. రూ.2.50లక్షల కోట్ల ప్రభుత్వ బడ్జెట్లో రూ.30 వేల కోట్లు దళితుల సంక్షేమానికే ఖర్చుపెట్టామని నిరూపించే ఆధారాలు ఉన్నా చర్చ కు రావచ్చు.

చంద్రబాబునాయుడు గారు దళితుల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారు అన్నట్టు విష ప్రచారం చేశారు. దాని పై సాక్షిలో దిక్కుమాలిన ప్రచారం చేశారు. అలానే లోకేశ్ గారి పై అబద్ధాలు రాశారు. ఆ తప్పుడు రాతల్ని దళితుల మెడల్లో బోర్డుల్లా కట్టి, వారిని మూర్ఛ రోగుల్లా మార్చి రోడ్ల పైకి వదులుతున్నారు. జగన్ దళితుల బిడ్డ ఎలా అవుతాడు? ఆయన మా బిడ్డే అయితే, మావాళ్లను ఎందుకింత దారుణంగా చంపాడు? మా ఆడబిడ్డల్ని ఎందుకింత క్రూరాతిక్రూరం గా బలి తీసుకుంటున్నాడు? ఇలాంటి అంశాల పై కూడా ప్రభుత్వంలోని దళిత నేతలు చర్చకు రావాలి అని డిమాండ్ చేస్తున్నాం.”

నెల్లూరు మేయర్ స్రవంతి పై దాడిచేసిన వైసీపీ కౌన్సిలర్లపై ప్రభుత్వం వెంటనే కఠినచర్యలు తీసుకోవాలి.

ఎస్టీ మహిళ పై జరిగిన దాడి జగన్ అండతో జరిగిందే: ధారునాయక్ (టీడీపీ ఎస్టీవిభాగం రాష్ట్ర అధ్యక్షులు)

“నెల్లూరు మేయర్ స్రవంతి గారి పై వైసీపీ కౌన్సిలర్లు గూండాల్లా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శ్రీనివాస యాదవ్, విజయ భాస్కర్ రెడ్డి, గౌరిరెడ్డిలు మేయర్ స్రవంతి పై ప్రవర్తించిన తీరు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎస్టీ వర్గానికి చెందిన మహిళ పై అలా ప్రవర్తించే ధైర్యాన్నిచ్చింది జగన్మోహన్ రెడ్డే. గుంటూరు జిల్లా నకరికల్లు తండాలో గిరిజన మహిళను వైసీపీ కార్యకర్త శ్రీనివాస రెడ్డి ట్రాక్టర్ తో తొక్కించి చంపేస్తే ఇంత వరకు ఈ ప్రభుత్వం అతని పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో ప్రజలకున్న సమస్యల్ని పట్టించు కోని జగన్ ప్రభుత్వం, ఎస్టీల పై మాత్రం యథేచ్ఛగా దాడులకు తెగబడుతోంది. గిరిజనుల పై దాడులు చేయడం హత్యలు చేయడమే జగన్ ప్రభుత్వ పనా? నెల్లూరు ఘటన లో ఎస్టీ మహిళ స్రవంతి పై దాడి చేసిన ముగ్గురు కౌన్సిలర్ల పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. గతంలో జగన్ పాదయాత్ర సమయంలో గిరిజనులకు కల్ల బొల్లి కబుర్లు చెప్పాడు. అధికారంలోకి వచ్చాక గిరిజనులకు అందాల్సిన పథకాల్ని రద్ దుచేశాడు. కేంద్ర ప్రభుత్వ పథకమైన ఎన్.ఎస్. డీ.ఎఫ్.సీ ని కూడా దుర్వినియోగం చేశాడు. జగన్ ప్రభుత్వం ఇతర కులాల్ని ఎస్టీల్లో చేరుస్తూ తీర్మానం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం.”

దళిత మంత్రులు, వైసీపీ దళిత నేతలు నిజంగా సిగ్గుపడాలి. పాతర్ల రమేశ్ : (టీడీపీ అధికారప్రతినిధి)

దళితుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన చంద్రబాబుగారిని, మంత్రి సురేశ్ ఇష్ట మొచ్చినట్టు మాట్లాడటం సిగ్గుచేటు. దళిత మంత్రులు, వైసీపీ నేతలు నిజంగా సిగ్గుపడాలి. మంత్రి సురేశ్ నల్ల బెలూన్లు, నల్ల చొక్కాలతో ప్రతిపక్ష నేతపై దాడికి యత్నించడం దుర్మార్గం. దళితుల పథకాల్ని రద్దు చేసిన జగన్ కు వత్తాసుగా మేరుగ నాగార్జున మాట్లాడటం సిగ్గుచేటు.”

దళిత మంత్రుల చిల్లర మాటలు నమ్మే స్థితిలో లేదు : అఖిల్ : (ఎస్సీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు).

“ప్రభుత్వంలోని దళిత మంత్రులు, వైసీపీలోని దళిత నేతల్లో ప్రవహస్తున్నది దళిత రక్తమే అయితే వారు సిగ్గుతో తలదించుకోవాలి. దళిత బాంధవుడు చంద్రబాబునాయుడు గారే అని చెప్పడం పచ్చి నిజం. దళిత జాతి ఇక ముందు జగన్ కల్లబొల్లి మాటలు, ప్రభుత్వంలోని దళిత మంత్రుల చిల్లర మాటలు నమ్మే స్థితిలో లేదు. దళిత జాతి మొత్తం జగన్ , అతని ప్రభు త్వం భరతం పట్టడానికి సిద్ధంగా ఉంది. చంద్రబాబునాయుడే లక్ష్యంగా దళిత నియోజకవర్గాల్లో చిల్లర వేషాలేస్తే మీ సంగతేంటో తేలుస్తాం.”

Tags: andhra pradeshap political newslatest newsTDPtdp release new bookys jaganys jagan Anarchiesదళిత ద్రోహి జగన్ రెడ్డి దళిత బాంధవుడు - పేదల పెన్నిధి చంద్రన్న
Previous Post

పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చేస్తాం : నారా లోకేష్ వెల్లడి

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 25-04-2023

మరిన్ని వార్తలు

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం
ఆంధ్రప్రదేశ్

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం

November 7, 2026
బోటు మునిగి తమిళ జాలర్లు మృతి
ఆంధ్రప్రదేశ్

వారం వ్యవధిలోనే రెండు తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయాం

November 7, 2026
చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం
ఆంధ్రప్రదేశ్

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

November 7, 2026
ప్రతి అడుగులోనూ భరోసా!
ఆంధ్రప్రదేశ్

ప్రతి అడుగులోనూ భరోసా!

November 7, 2026
బోటు మునిగి తమిళ జాలర్లు మృతి
ఆంధ్రప్రదేశ్

బోటు మునిగి తమిళ జాలర్లు మృతి

November 7, 2026
ప్రజా తీర్పును గౌరవించడం జగన్ డీఎన్ఏలోనే లేదు
ఆంధ్రప్రదేశ్

ప్రజా తీర్పును గౌరవించడం జగన్ డీఎన్ఏలోనే లేదు

November 6, 2026
Next Post
చైతన్యరధం ఈ పేపర్ 25-04-2023

చైతన్యరధం ఈ పేపర్ 25-04-2023

ముఖ్య వార్తలు

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

by చైతన్యరధం
November 7, 2026

అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పొలం గట్లు, పంట బోదెలపై వెళ్తూ దెబ్బతిన్న పంటల పరిశీలన జిల్లెళ్లమూడి...

ప్రతి అడుగులోనూ భరోసా!

ప్రతి అడుగులోనూ భరోసా!

by చైతన్యరధం
November 7, 2026

రైతు కష్టం తెలిసిన నాయకుడిగా... తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అటు సమీక్షలు, ఇటు పర్యటనలతో నిరంతరం సమన్వయం అమరావతి (చైతన్యరథం): సచివాలయంలో సమీక్షలే...

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

by చైతన్యరధం
November 5, 2026

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి (చైతన్యరథం): ఏలూరు జిల్లాలో...

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

by చైతన్యరధం
November 4, 2026

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

by కార్యకర్త
November 7, 2026

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం

by చైతన్యరధం
November 7, 2026

2019లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ కూడా ఇవ్వకుండా రివర్స్ పీఆర్సీతో దగా చేసిన ఘనుడు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే...

బోటు మునిగి తమిళ జాలర్లు మృతి

వారం వ్యవధిలోనే రెండు తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయాం

by చైతన్యరధం
November 7, 2026

ఉపశమనం కోసం తక్షణ సాయం అందించండి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ అమరావతి (చైతన్యరథం): వరుస తుఫాన్లతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ నష్టం...

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

by చైతన్యరధం
November 7, 2026

అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పొలం గట్లు, పంట బోదెలపై వెళ్తూ దెబ్బతిన్న పంటల పరిశీలన జిల్లెళ్లమూడి...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.