- సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఆయనే
- పెద్దాయన దామచర్ల సేవలు చిరస్మరణీయం
- కూటమి ప్రభుత్వం సుస్థిర కాలం ఉండాలి
- టీచర్లపై గొడ్డలి పార్టీ దాడులు దుర్మార్గం
- మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి
కొండపి(చైతన్యరథం): ఎన్టీఆర్ అనేది మూడక్షరాల పేరు కాదు..అది తెలుగుజాతి ఆత్మ గౌరవ ప్రతీక అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి కొనియా డారు. కొండపి మండలం పెడకండ్లకుంటలో మంగళవారం స్వర్గీయ ఎన్టీఆర్, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహా ల ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు, మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలసి పాల్గొన్నారు. ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాల ఆవిష్కరణ అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సభలో మాట్లాడుతూ తెలుగుజాతి శక్తిని దశ దిశలా చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్. విప్లవాత్మకమైన సంక్షేమ, అభివృద్ధి పధకాలు తీసుకొచ్చి పేదల గతిని మార్చిన యుగపురుషుడు. పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాలు, ఆస్తిలో మహిళలకు సమాన వాటా వంటి విప్లవాత్మక నిర్ణయాలతో ఎన్టీఆర్ పాలనలో తనదైన ముద్ర వేశారు.
ఎన్టీఆర్ సినీ రంగంలో ఉన్నా, రాజకీయ రంగం లో ఉన్న ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. తెలుగుజాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ కీర్తి అజరామరంగా వెలుగుతూనే ఉంటుందని తెలిపారు. దామచర్ల ఆంజనేయులు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ ప్రాంత ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయం. ప్రజల గుండెల్లో పెద్దాయనగా చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. సీఎం చంద్రబాబు రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. వెలిగొండ పూర్తికాకుండానే జాతికి అంకితం చేసి జగన్ ప్రజలను మోసం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక యుద్ద వెలిగొండ పనులు పూర్తి చేసి నీళ్లు ఇచ్చామన్నారు. గొడ్డలి పార్టీ గూండాలు బరితెగించి గురువులపై దాడులకు తెగబడుతున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ కుట్రలు పన్నుతున్న గొడ్డలి పార్టీ ప్రజా క్షేత్రం లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం సుస్థిర కాలం ఉండాలని ఆకాంక్షించారు.














