చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభంజనం

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ఫలితాల విశ్లేషణలను వివరించిన చంద్రబాబు

by చైతన్యరధం
November 10, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
కూటమి ప్రభంజనం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం
  • 58.9 శాతం ఓట్లతో ఘన విజయం (దీన్ని కూడా హైలెట్ చేసుకోవాలి)
  • 2024 ఎన్నికలతో పోలిస్తే 3.6 శాతం పెరిగిన ఓట్ల వాటా
  • 100 పట్టణ స్థానిక సంస్థల్లో 94 చోట్ల పాగా… 3,941 వార్డుల్లో 3,233 కైవసం
  • పల్లెల్లోనూ అదే జోరు… ఒక్క జెడ్పీ వినా 27 జెడ్పీలు కూటమి కైవసం
  • మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, యువతకు నాయకత్వంలో పెద్దపీట
  • మరో 30 ఏళ్లకు సరిపోయేలా కొత్త నాయకత్వాన్ని తయారు చేశాం
  • స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ఫలితాల విశ్లేషణలను వివరించిన చంద్రబాబు

అమరావతి (చైతన్య రథం): స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఘన విజయం సాధించాయని, 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రజల్లో కూటమి ఆదరణ మరింత పెరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్నికల ఫలితాలు, వివిధ స్థాయిల్లో కూటమి సాధించిన విజయాలు, అభ్యర్థుల ఎంపికలో అనుసరించిన విధానం, సామాజిక ప్రాతినిధ్యానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో గణాంకాలతో సహా వివరించారు. పట్టణ, పరిషత్ ఎన్నికల్లో కలిపి కూటమి 58.9 శాతం ఓట్లను సాధించిందని, 2024 ఎన్నికల్లో సాధించిన 55.3 శాతం ఓట్లతో పోలిస్తే 3.6 శాతం పెరుగుదల నమోదైందని వివరించారు. అదే సమయంలో వైసీపీ ఓట్ల శాతం 39.81 నుంచి 33.56కు పడిపోయిందని, ఆ పార్టీకి 6.25 శాతం ఓట్లు తగ్గాయని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో కూటమికి, వైసీపీకి మధ్య ఓట్ల శాతంలో 25.34 శాతం వ్యత్యాసం ఉందని వెల్లడించారు. పట్టణ స్థానిక సంస్థల్లో కూటమికి 59.9 శాతం ఓట్లు రాగా, వైసీపీకి 34.3 శాతం మాత్రమే వచ్చాయని సీఎం చంద్రబాబు తెలిపారు. పట్టణాల్లో కూటమి స్ట్రైక్ రేట్ 94 శాతంగా నమోదైందన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమికి 57.6 శాతం, వైసీపీకి 39.7 శాతం ఓట్లు వచ్చాయని, కూటమి స్ట్రైక్ రేట్ 87.5 శాతంగా ఉందని వివరించారు. పట్టణాల్లో కూటమి, వైసీపీ ఓట్ల శాతం మధ్య 25.6 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 17.9 శాతం వ్యత్యాసం ఉందన్నారు. పట్టణాల్లో కూటమికి 65.7 శాతం పోస్టల్ బ్యాలెట్లు రాగా, వైసీపీకి 27.42 శాతం వచ్చాయని చెప్పారు. పరిషత్ ఎన్నికల్లో కూటమికి 62.83 శాతం, వైసీపీకి 31.46 శాతం పోస్టల్ బ్యాలెట్లు లభించాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ఓట్ల శాతాలు చూస్తేనే.. ఉద్యోగులతో సహా అన్ని వర్గాలు కూటమిని ఏ స్థాయిలో ఆదరించారో అర్థం చేసుకోవచ్చన్నారు. బాగా పని చేసిన ఉద్యోగులు, అధికారుల పనితీరును బహిరంగంగానే ప్రశంసిస్తోన్న విషయాన్ని ప్రెస్‌మీట్‌లో గుర్తు చేశారు.

తిరుగులేని విజయాలు… తిరుగులేని మెజార్టీలు
రాష్ట్రవ్యాప్తంగా 659 జెడ్పీటీసీ స్థానాలకుగాను కూటమి 575 స్థానాలను కైవసం చేసుకుందని ముఖ్యమంత్రి తెలిపారు. మొత్తం 28 జిల్లాల్లో 27 జిల్లాల్లో కూటమి ఆధిక్యత సాధించిందని, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే వైసీపీ కూటమి కంటే ఎక్కువ స్థానాలు సాధించిందని వివరించారు. ఏడు జిల్లాల్లో వైసీపీకి ఒక్క జెడ్పీటీసీ స్థానం కూడా దక్కలేదని చెప్పారు. అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, మార్కాపురం, పల్నాడు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో వైసీపీ ఖాతా తెరవలేకపోయిందన్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో మొత్తం 9,818 స్థానాలకు గాను కూటమి 7,803 స్థానాలను గెలుచుకుందని, రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం మండల అధ్యక్ష స్థానాలను కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని ముఖ్యమంత్రి చెప్పారు. మొత్తం 100 మేయర్, చైర్‌పర్సన్ పదవులకు గాను 94 స్థానాలను కూటమి గెలుచుకుందని, 13 మేయర్ పదవుల్లో 12, 87 చైర్‌పర్సన్ పదవుల్లో 82 దక్కించుకుందని తెలిపారు. ఇందులో టీడీపీ 70, జనసేన 20, బీజేపీ నాలుగు మేయర్, చైర్‌పర్సన్ పదవులను సాధించాయని ముఖ్యమంత్రి వివరించారు. మొత్తం 3,941 వార్డులకుగాను 3,233 వార్డుల్లో కూటమి జయకేతనం ఎగురవేసిందని, ఇది 82 శాతమని పేర్కొన్నారు. 100 పట్టణ స్థానిక సంస్థల్లో 95 చోట్ల కూటమికి కౌన్సిల్ మెజారిటీ లభించిందని, 16 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రతి వార్డునూ కూటమి గెలుచుకుందని చెప్పారు. మరోవైపు వైసీపీ 100 పట్టణ స్థానిక సంస్థల్లో కేవలం నాలుగు చోట్లే విజయం సాధించిందని, 3,941 వార్డుల్లో 558 స్థానాలకే పరిమితమైందని తెలిపారు. 22 పట్టణ స్థానిక సంస్థల్లో వైసీపీ ఒక్క వార్డు కూడా గెలుచుకోలేకపోయిందని వివరించారు.

దశాబ్దాల తర్వాత పులివెందులలో స్వేచ్ఛగా పోలింగ్
విశాఖలో 2,47,817 ఓట్ల మెజారిటీ, విజయవాడలో 1,30,872 ఓట్లు, గుంటూరులో 96,294 ఓట్ల ఆధిక్యంతో కూటమి విజయం సాధించిందని ముఖ్యమంత్రి తెలిపారు. పులివెందులలో సైతం కూటమి 13,875 ఓట్ల మెజారిటీతో చైర్‌పర్సన్ పదవిని కైవసం చేసుకుందని, మొత్తం 40 వార్డుల్లో 37 గెలుచుకుందని చెప్పారు. కడప కార్పొరేషన్‌లో 65,588 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో పాటు 66 వార్డుల్లో 64 స్థానాలను కూటమి గెలుచుకుందని వివరించారు. కడప జిల్లాలో రౌడీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారని, జిల్లాలోని తొమ్మిది పట్టణ స్థానిక సంస్థలూ కూటమి ఖాతాలోకి వచ్చాయని సీఎం చంద్రబాబు అన్నారు. కడప జిల్లాలో 345 వార్డులకు గాను వైసీపీ కేవలం తొమ్మిది స్థానాలకే పరిమితమైందని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే ఫలితాలు ఇలాగే ఉంటాయని ముఖ్యమంత్రి అన్నారు. అనంతపురంలో మేయర్ పదవి దక్కకపోయినా కార్పొరేటర్లలో ఎక్కువ మంది కూటమి తరఫున గెలిచారని పేర్కొన్నారు.

మహిళలకు 60 శాతం… బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 62.9 శాతం ప్రాతినిధ్యం
మేయర్లు, చైర్‌పర్సన్ల ఎంపికలో మహిళలకు, వెనుకబడిన వర్గాలకు, సామాజికంగా అణగారిన వర్గాలకు, మైనారిటీలకు పెద్దపీట వేశామని ముఖ్యమంత్రి తెలిపారు. టీడీపీ నుంచి గెలిచిన 70 మంది మేయర్లు, చైర్‌పర్సన్లలో 42 మంది మహిళలేనని, అంటే 60 శాతం ప్రాతినిధ్యం కల్పించామని వివరించారు. టీడీపీ గెలిచిన పది మేయర్ పదవుల్లో ఎనిమిది స్థానాల్లో మహిళలే బాధ్యతలు చేపట్టనున్నారని చెప్పారు. విశాఖ, విజయనగరం, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, కడప, కర్నూలు, చిత్తూరు నగరాలకు మహిళలు నాయకత్వం వహించనున్నారని తెలిపారు. టీడీపీ నుంచి ఎన్నికైన 70 మంది మేయర్లు, చైర్‌పర్సన్లలో 44 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందినవారని, మొత్తంగా ఈ వర్గాలకు 62.9 శాతం ప్రాతినిధ్యం కల్పించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. బీసీలకు 25 పదవులు, ఎస్సీలకు తొమ్మిది, మైనారిటీలకు తొమ్మిది, ఎస్టీలకు ఒక పదవి దక్కిందన్నారు. మొత్తం 27 సామాజిక వర్గాలకు చెందినవారు టీడీపీ తరఫున మేయర్లు, చైర్‌పర్సన్లుగా ఎన్నిక కావడం సామాజిక న్యాయానికి నిదర్శనమని పేర్కొన్నారు. టీడీపీ నుంచి ఎన్నికైన పది మంది మేయర్లు పది విభిన్న సామాజిక వర్గాలకు చెందినవారని, వీరిలో నలుగురు బీసీలు, నలుగురు ఓసీలు, ఒకరు ఎస్సీ, మరొకరు మైనారిటీ వర్గానికి చెందినవారని తెలిపారు. మేయర్లు, చైర్‌పర్సన్లలో తొమ్మిది మంది ముస్లిం మైనారిటీలు ఉండగా, వారిలో ఆరుగురు మహిళలేనని సీఎం చంద్రబాబు చెప్పారు.

యువతకు అవకాశాలు… విద్యావంతులకు ప్రోత్సాహం
పట్టణ స్థానిక సంస్థల నాయకత్వంలో యువతకు, విద్యావంతులకు ప్రాధాన్యం ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. టీడీపీ నుంచి గెలిచిన 70 మంది మేయర్లు, చైర్‌పర్సన్లలో 55 మంది డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతలు కలిగినవారని, వీరిలో 11 మంది పీజీ చదివినవారని వివరించారు. అంటే 78.6 శాతం మంది ఉన్నత విద్యావంతులేనని చెప్పారు. 31 మంది 45 ఏళ్లలోపు వారని, ఎనిమిది మంది 35 ఏళ్లలోపు వారని సీఎం తెలిపారు. పది మంది టీడీపీ మేయర్ల సగటు వయసు 39 సంవత్సరాలని పేర్కొన్నారు. రాజంపేటలో 26 ఏళ్ల డాక్టర్ దొంతం గాయత్రి, మచిలీపట్నంలో 29 ఏళ్ల షేక్ అబ్దుల్ అబీదా, విజయనగరంలో 31 ఏళ్ల అవనాపు భార్గవి, విశాఖలో 32 ఏళ్ల డాక్టర్ ముక్కా శ్రావణి మేయర్లుగా ఎన్నిక కావడం యువతకు ఇచ్చిన అవకాశాలకు నిదర్శనమన్నారు. ఒంగోలులో 27వ డివిజన్ నుంచి 24 ఏళ్ల చావలి చార్పిత కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారని చెప్పారు. ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారు, అత్యంత నిరుపేదలు, రోజువారీ కూలీలు, రాజకీయ నేపథ్యం లేనివారు, సమాజంలో మంచి పేరున్నవారు ఇలా విభిన్న నేపథ్యాల నుంచి వచ్చినవారికి నాయకత్వ అవకాశాలు కల్పించామని ముఖ్యమంత్రి తెలిపారు.

రాజకీయాల్లో తాము చేసిన ప్రయోగాలు అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయని, భవిష్యత్తులో మరో 30 ఏళ్ల పాటు పార్టీకి, రాష్ట్రానికి సేవలందించేలా కొత్త నాయకత్వాన్ని తయారు చేశామని చెప్పారు. మహిళలు, యువత, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించడమే కాకుండా, పట్టణ పాలనలోనూ వారి భాగస్వామ్యాన్ని పెంచామని వివరించారు. స్థానిక ఎన్నికల ఫలితాలు కేవలం కూటమి విజయాన్నే కాకుండా, సామాజిక న్యాయం, కొత్త నాయకత్వ నిర్మాణం, ప్రజాస్వామ్యానికి ప్రజలు ఇచ్చిన మద్దతును కూడా ప్రతిబింబిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

Next Post

సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ఫ్రంట్ రన్నర్

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 10-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-11-2026

November 10, 2026
ఏపీ పారిశ్రామిక ప్రగతికి నూతన దశదిశ
ఆంధ్రప్రదేశ్

ఏపీ పారిశ్రామిక ప్రగతికి నూతన దశదిశ

November 10, 2026
సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ఫ్రంట్ రన్నర్
ఆంధ్రప్రదేశ్

సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ఫ్రంట్ రన్నర్

November 10, 2026
చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

November 8, 2026
ప్రజాస్వామ్యంపై గౌరవం లేని వైసీపీ
ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్యంపై గౌరవం లేని వైసీపీ

November 8, 2026
జగన్ రెడ్డి అరాచకాల వారసుడే లేళ్ల అప్పిరెడ్డి
ఆంధ్రప్రదేశ్

జగన్ రెడ్డి అరాచకాల వారసుడే లేళ్ల అప్పిరెడ్డి

November 8, 2026
Next Post
సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ఫ్రంట్ రన్నర్

సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ఫ్రంట్ రన్నర్

ముఖ్య వార్తలు

సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ఫ్రంట్ రన్నర్

సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ఫ్రంట్ రన్నర్

by చైతన్యరధం
November 10, 2026

యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం తలసరి ఆదాయంలో 13వ స్థానం... అయినా అవకాశాల కల్పనలో రెండో స్థానం ఆదాయానికి మించి ప్రజలకు సేవలు, సౌకర్యాలు...

కూటమి ప్రభంజనం

కూటమి ప్రభంజనం

by చైతన్యరధం
November 10, 2026

స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం 58.9 శాతం ఓట్లతో ఘన విజయం (దీన్ని కూడా హైలెట్ చేసుకోవాలి) 2024 ఎన్నికలతో పోలిస్తే 3.6 శాతం పెరిగిన ఓట్ల...

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

by చైతన్యరధం
November 7, 2026

అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పొలం గట్లు, పంట బోదెలపై వెళ్తూ దెబ్బతిన్న పంటల పరిశీలన జిల్లెళ్లమూడి...

ప్రతి అడుగులోనూ భరోసా!

ప్రతి అడుగులోనూ భరోసా!

by చైతన్యరధం
November 7, 2026

రైతు కష్టం తెలిసిన నాయకుడిగా... తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అటు సమీక్షలు, ఇటు పర్యటనలతో నిరంతరం సమన్వయం అమరావతి (చైతన్యరథం): సచివాలయంలో సమీక్షలే...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 10-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 10-11-2026

by కార్యకర్త
November 10, 2026

ఏపీ పారిశ్రామిక ప్రగతికి నూతన దశదిశ

ఏపీ పారిశ్రామిక ప్రగతికి నూతన దశదిశ

by చైతన్యరధం
November 10, 2026

నేవిగేటింగ్ న్యూవరల్డ్ ఆర్డర్ థీమ్‌తో సీఐఐ సమ్మిట్ వాణిజ్యం నుంచి క్వాంటం వరకూ ఆరు అంశాలపై చర్చ 58 దేశాల నుంచి ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధుల హాజరు...

సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ఫ్రంట్ రన్నర్

సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ఫ్రంట్ రన్నర్

by చైతన్యరధం
November 10, 2026

యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం తలసరి ఆదాయంలో 13వ స్థానం... అయినా అవకాశాల కల్పనలో రెండో స్థానం ఆదాయానికి మించి ప్రజలకు సేవలు, సౌకర్యాలు...

కూటమి ప్రభంజనం

కూటమి ప్రభంజనం

by చైతన్యరధం
November 10, 2026

స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం 58.9 శాతం ఓట్లతో ఘన విజయం (దీన్ని కూడా హైలెట్ చేసుకోవాలి) 2024 ఎన్నికలతో పోలిస్తే 3.6 శాతం పెరిగిన ఓట్ల...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.