- జగన్మోహన్ రెడ్డి అరాచకాల వారసుడే లేళ్ల అప్పిరెడ్డి
- ఎన్నికల అధికారులపై దాడులు చేసిన లేళ్ల అప్పిరెడ్డి వెంటనే ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలి
- గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు
జగన్మోహన్ రెడ్డి అరాచకాల వారసుడే లేళ్ల అప్పిరెడ్డి అని ఆయన కింద కామెడీ విలన్ అంబటి రాబాంబు అని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడిన ఆయన.. రాజ్యాంగ వ్యవస్థపై జగన్మోహన్ రెడ్డికే గౌరవం లేనప్పుడు వాళ్ల నాయకులకు ఉంటుందని అనుకోవడం భ్రమ అని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విధ్వంసం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డితో మొదలైతే.. లేళ్ల అప్పిరెడ్డి ముంగించినట్లు కనిపిస్తుందని దుయ్యబట్టారు. ఎన్నికల అధికారులపై తప్పుడు ప్రచారం చేసిన లేళ్ల అప్పిరెడ్డి వెంటనే ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలి
“గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం, వెంగళాయపాలెంలో జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ఓటింగ్ ముగిసిన తర్వాత… వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి తన రౌడీ మూకలతో స్ట్రాంగ్ రూమ్‌లకు వెళ్లే బ్యాలెట్ బాక్సులపై అబద్ధపు ప్రచారం చేస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎమ్మెల్సీ హోదాలో ఉండి రౌడీలా వ్యవహరించిన అప్పిరెడ్డిని వెంటనే ఎమ్మెల్సీ పదవి నుండి భర్తరఫ్ చేయాలి. ఎన్నికల వ్యవస్థను, చట్టాన్ని ధిక్కరిస్తే పోలీసులు సహజంగానే అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అదే అక్కడ జరిగింది.” అని స్పష్టం చేశారు.
*లేళ్ల అప్పిరెడ్డిని “గాంధీ వారసుడిలా” అభివర్ణించడం విచిత్రం*
లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండిస్తూ జగన్ మోహన్ రెడ్డి ఆయనను ఏదో “గాంధీ వారసుడిలా” రోడ్ల మీద ధర్నాలు చేసే వ్యక్తిగా అభివర్ణించడం విచిత్రంగా ఉంది. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసుల సమక్షంలో, సీసీ కెమెరాల సాక్షిగా ఈవీఎంలను పగలగొడితే, జగన్ మోహన్ రెడ్డి “ఓడిపోతున్నప్పుడు బాధ ఉండదా, తప్పు ఏముంది?” అని సమర్థించారు. జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికల మీద, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద అసలు గౌరవమే లేదు. పులివెందులలో ఓటు వేయకుండా నాటకాలు ఆడి ఎన్నికలను బహిష్కరించానంటూ మాట్లాడిన తీరే ఇందుకు నిదర్శనం.
లేళ్ల అప్పిరెడ్డికి కఠిన శిక్షలు పడాలి
దేవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కరుడుగట్టిన నేరస్తులలో లేళ్ళ అప్పిరెడ్డి కూడా ఒకరు. సత్యం, గోపిరెడ్డి, చైతన్య వంటి రౌడీ మూకలతో కలిసి పార్టీ కార్యాలయంపై దాడి చేయించారు. రాష్ట్రంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవినాష్ రెడ్డి ఏవిధంగా అరాచకాలకు పాల్పడ్డారో, గుంటూరులో అప్పిరెడ్డి కూడా అదే బాటలో నడిచారు. బ్యాలెట్ బాక్సుల దౌర్జన్యం కేసులో అప్పిరెడ్డికి కేవలం రెండు సంవత్సరాలు కాకుండా, ఎన్నికల చట్టాల ప్రకారం ఏడేళ్ల వరకు శిక్ష పడేలా, బెయిల్ కూడా రాకుండా చేయాలి. పోలీసులను, ఎన్నికల అధికారులను భయపెట్టాలని చూస్తే చట్టం చూస్తు ఊరుకోదు. ఎస్సీ, ఎస్టీలను, బడుగు బలహీన వర్గాలను ఓట్లు వేయకుండా బెదిరించే వారిని ఉపేక్షించకూడదు.” అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజారంజకమైన పరిపాలన అందిస్తోందని తెలిపారు. పత్తిపాడు లాంటి నియోజకవర్గాల్లో గతంతో పోలిస్తే వైసీపీ ఓట్లు భారీగా ఎందుకు తగ్గిపోయాయో ఆ పార్టీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే ఈ విజయాలకు, ప్రజల మద్దతుకు కారణమని పిల్లి మాణిక్యరావు స్పష్టం చేశారు.




















