- మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో గోల్డ్ మెడల్
- మెడల్ అందజేసి అభినందించిన శాప్ ఛైర్మన్ రవినాయుడు
- ఐఓఏ ప్రెసిడెంట్, సభ్యులతో కలిసి పోటీలు వీక్షించిన శాప్ ఛైర్మన్
- ఏపీలో అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీ రూపొందిచామని వివరించిన రవినాయుడు
డెహ్రాడూన్ (చైతన్యరథం): ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్ విభాగంలో బంగారు పతకం సాధించిన ఏపీ అథ్లెట్ జ్యోతి యర్రాజీ విజయం తెలుగు ప్రజలందరూ గర్వించదగ్గ విషయమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. జాతీయ క్రీడాపోటీల్లో భాగంగా ఆదివారం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో జరిగిన అథ్లెటిక్స్ పోటీలను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ ఉష, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, అథ్లెటిక్ అసోసియేషన్ సభ్యులతో కలిసి శాప్ ఛైర్మన్ వీక్షించారు. ఈ సందర్భంగా మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో బంగారు పతకం సాధించిన జ్యోతి యర్రాజీని శాప్ ఛైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు.
పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచి దేశవ్యాప్తంగా రాష్ట్ర కీర్తిప్రతిష్టతలను ఇనుమడిరపజేశారని, మీ విజయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి క్రీడాకారులందరికీ స్ఫూర్తిదాయంగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన పతకాల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొని అథ్లెట్ జ్యోతి యర్రాజీకి మెడల్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముందు పురుషుల 400 మీటర్లు, మహిళల 400 మీటర్ల హర్డిల్స్ పోటీలను శాప్ ఛైర్మన్ వీక్షించారు. అనంతరం జాతీయ క్రీడల్లో వివిధ పోటీల్లో పాల్గొననున్న క్రీడాకారులను సైతం శాప్ ఛైర్మన్ ప్రత్యేకంగా కలిసి అత్యుత్తమ ప్రతిభను కనబరిచి అత్యధిక పతకాలు సాధించాలని ప్రోత్సహించారు.
క్రీడలకు సీఎం చంద్రబాబు పెద్దపీట
క్రీడలకు రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ముఖ్యంగా సీఎం చంద్రబాబు క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని శాప్ ఛైర్మన్ రవినాయుడు వివరించారు. జాతీయ పోటీల్లో భాగంగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ ఉష, ఐఓఏ సభ్యులతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించిన స్పోర్ట్స్ ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న స్పోర్ట్స్ పాలసీని వివరించారు. ఏపీని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. దానిలో భాగంగానే అత్యుత్తమంగా ఏపీ స్పోర్ట్స్ పాలసీని రూపొందించామని వెల్లడిరచారు. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో క్రీడాసౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.