చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 17వ పెట్టుబడుల బోర్డు సమావేశం

by చైతన్యరధం
May 7, 2026 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • విశాఖలో రూ.లక్ష కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్
  • సత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్
  • కడపలో రూ.12 వేల కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు
  • తిరుపతిలో రూ.2.5వేల కోట్లతో ‘రాయల్ ఎన్‌ఫీల్డ’ పరిశ్రమ
  • రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం… 39 వేలమందికి ఉద్యోగాలు
  • నిర్దేశిత గడువుకు ముందే అనుమతులతో బ్రాండ్ సృష్టిద్దాం
  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన 17వ పెట్టుబడుల బోర్డు సమావేశం

అమరావతి (చైతన్య రథం): రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వస్తోంది. విశాఖలో రిలయన్స్ సంస్థ రూ.1,08,010 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అలాగే సత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్‌ను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంను కూడా రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది. కడపలో రూ.12 వేల కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును, తిరుపతిలో రూ.2,500 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటర్ సైకిల్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. వీటితోపాటు పలు పెట్టుబడులకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు బుధవారం ఆమోదం తెలిపింది.
ప్రతీ ఒప్పందం గ్రౌండ్ కావాలి
రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ప్రతీ ప్రతిపాదనా ఒప్పందంగా మారాలని… కుదుర్చుకున్న ప్రతీ ఒప్పందం పెట్టుబడిగా రూపాంతరం చెందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక పెట్టుబడి, పరిశ్రమ రాష్ట్రానికి వచ్చే విషయంలో అనుమతుల నుంచి శంకుస్థాపన, ప్రారంభోత్సవం వరకు నిర్దేశిత గడువులోగా జరిగేలా చూడాలన్నారు. ఒప్పందం చేసుకున్న కంపెనీల శంకుస్థాపన నుంచి ఉత్పత్తి వరకూ నిర్దుష్టమైన కాలపరిమితిలో జరిగేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వపరంగా ఇవ్వాల్సిన అనుమతుల విషయంలో ఒక్క రోజు కూడా జాప్యం జరగకూడదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనుమతుల జారీ విషయంలో ఏపీ బ్రాండ్ సృష్టించాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పెట్టుబడులను ఆకర్షించాలంటే ఇతరులకంటే మనం ఎలా భిన్నమో ఏపీలో అనుమతులు ఎంత సులభతరమన్నది చాటి చెప్పాలని స్పష్టం చేశారు. ఏపీలో ప్రాజెక్టులు రావాలన్న తపన ఉన్న అధికారులను అనుమతులు ఇచ్చే స్థానాల్లో నియమించాలని సూచించారు.
వన్ ఫ్యామిలీ- వన్ ఎంట్రప్రెన్యూర్‌లో ఎంఎసఎంఈలు కీలకం
సచివాలయంలో జరిగిన 17వ ఎసఐపిబి సమావేశంలో 25 ప్రాజెక్టులకు చెందిన రూ.2,01,023 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 39,067 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “పెట్టుబడుల విషయంలో భారీ పరిశ్రమలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో… ఎంఎసఎంఈలకు అంతే ప్రాధాన్యమివ్వాలి. వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రప్రెన్యుర్ విషయంలో ఎంఎసఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయి. అన్ని పారిశ్రామిక ప్రాంతాలకు గ్యాస్ పైప్‌లైన్ అందుబాటులో ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రాష్ట్రంలో అపార అవకాశాలున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుని పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలా చూడాలి. మన రాష్ట్రంలో ఉద్యాన, వాణిజ్య పంట ఉత్పత్తులకు విలువ జోడింపు జరగాలి. ఆయిల్ పాం, మామిడి, కొబ్బరి, కోకో సహా పలు పంటలకు వ్యాల్యూ అడిషన్ ఇస్తే రైతులకు ఎంతో మంచి జరుగుతుంది” అని సీఎం చంద్రబాబు అన్నారు. సమావేశంలో సీఎస్ సాయిప్రసాద్, మంత్రులు టీజీ భరత్, అచ్చెన్నాయుడు, సుభాష్, వివిధ శాఖల అధికారులు, వర్చువల్‌గా మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.
17వ ఎసఐపీబీలో ఆమోదం పొందిన ప్రతిపాదనలు
ఇంధన రంగం:
1.రిలయన్స్ ఇండస్ట్రీస్ -శ్రీసత్యసాయి జిల్లాలో సోలార్ పవర్ ప్రాజెక్టు. రూ.51,300 కోట్ల పెట్టుబడులు, 20 వేలమందికి ఉద్యోగాలు
2.క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రీడ్ త్రీ లిమిటెడ్. నంద్యాలలో రూ.155 కోట్ల పెట్టుబడులు. 40మందికి ఉద్యోగాలు
3.క్లీన్ ఎనర్జీ హైబ్రీడ్ ట్వెల్వ్ లిమిటెడ్. అనంతపురం జిల్లాలో రూ.779 కోట్ల పెట్టుబడులు. 125 మందికి ఉద్యోగాలు.
4.క్లీన్ ఎనర్జీ హైబ్రీడ్ థర్టీన్ లిమిటెడ్. అనంతపురం జిల్లాలో రూ.779 కోట్ల పెట్టుబడులు. 125మందికి ఉద్యోగాలు.
5.అదాని హైడ్రో ఎనర్జీ ఎలెవెన్. కడప జిల్లాలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్. రూ.12,297 కోట్ల పెట్టుబడులు. 3375 మందికి ఉద్యోగాలు
6.యమాన్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. తిరుపతి జిల్లాలో గ్రీన్ హైడ్రోజన్. రూ.9398 కోట్ల పెట్టుబడులు, 5820 మందికి ఉద్యోగాలు
7.అమృత శ్రీ బయో సీఎన్జీ లిమిటెడ్, విజయనగరం. రూ.89 కోట్ల పెట్టుబడులు, 402మందికి ఉద్యోగాలు
8.బాలాజీ బయోఎనర్జీ ఆర్గానిక్స్, నెల్లూరు జిల్లా రూ.59 కోట్ల పెట్టుబడులు, 335మందికి ఉద్యోగాలు
9.హెచ్ పీసీఎల్ రెన్యూబుల్ గ్రీన్ ఎనర్జీ.. ఏలూరు జిల్లా రూ.100 కోట్ల పెట్టుబడులు.. 150మందికి ఉద్యోగాలు
10.ఎనర్జియా బయో ఫ్యూయల్స్.. తిరుపతి జిల్లాలో సీబీజీ ప్లాంట్.. రూ.59 కోట్ల పెట్టుబడులు.. 335మందికి ఉద్యోగాలు
11.విభా బయో ఫ్యూయల్స్.. తూర్పుగోదావరి జిల్లాలో రూ.67 కోట్ల పెట్టుబడులు.. 110మందికి ఉద్యోగాలు
12.ఐఓసీ జీపీఎస్ రెన్యూవబుల్స్.. ఎన్టీఆర్ జిల్లాలో సీబీజీ ప్లాంట్.. రూ.120 కోట్లు పెట్టుబడులు.. 200 మందికి ఉద్యోగాలు.
13.డెల్టా బయోగ్యాస్.. పలనాడు జిల్లాలో రూ.100 కోట్లు పెట్టుబడులు.. 750మందికి ఉద్యోగాలు

ఐటీ:
14.రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. విశాఖలో డేటాసెంటర్ ఏర్పాటు.. రూ.1,08,010 కోట్ల పెట్టుబడి.. 1000 మందికి ఉద్యోగాలు
15.క్యారియర్ ఎయిర్ కండిషనింగ్.. తిరుపతి జిల్లాలో బల్క్ చిల్లర్స్ తయారీ.. రూ.863 కోట్ల పెట్టుబడులు.. 721మందికి ఉద్యోగాలు.
16.ఎనఎస్టీఎల్ డీఆర్డీఓ, అమరావతి క్వాంటం వ్యాలీ రూ.22.5 కోట్ల పెట్టుబడి, 20మందికి ఉద్యోగాలు

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

వేగంగా విత్తన సరఫరా

ఫుడ్ ప్రాసెసింగ్:
17.స్నేహా ఫార్మ్స్ లిమిటెడ్.. అనంతపురం, అన్నమయ్య జిల్లాలు.. రూ,277.94 కోట్ల పెట్టుబడులు.. 435 మందికి ఉద్యోగాలు

పరిశ్రమలు:
18.గ్రైడోన్ ఎనర్జీ లిమిటెడ్.. కర్నూలు జిల్లాలో రూ.3149 కోట్ల పెట్టుబడులు.. 320ఉద్యోగాలు
19.అపోలో టైర్స్. తిరుపతి జిల్లా శ్రీసిటీ.. రూ,6100 కోట్లు పెట్టుబడులు.. 1000మందికి ఉద్యోగాలు
20.ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్, ఫ్రాగ్రెన్సెస్ ఇఫ్కో సెజ్ నెల్లూరు.. రూ.3153 కోట్ల పెట్టుబడులు.. 172మందికి ఉద్యోగాలు
21.రాయల్ ఎన్‌ఫీల్డ్, తిరుపతి జిల్లా.. రూ.2508 కోట్ల పెట్టుబడులు.. 3 వేలమందికి ఉద్యోగాలు.
22.చెట్టినాడ్ సిమెంట్స్, పలనాడు జిల్లా.. రూ.1340 కోట్లు పెట్టుబడులు.. 360మందికి ఉద్యోగాలు
23.ఏఏకె సౌత్ ఈస్ట్ ఇండియా కాకినాడ జిల్లా.. రూ.171.52 కోట్ల పెట్టుబడులు.. 102మందికి ఉద్యోగాలు
24.ఐటీసీ లిమిటెడ్, గుంటూరు జిల్లా.. రూ.51.65 కోట్ల పెట్టుబడులు.. 50మందికి ఉద్యోగాలు
25.హ్యాంగ్యో ఐస్ క్రీమ్స్, తిరుపతి జిల్లా.. రూ.74.49 కోట్ల పెట్టుబడులు.. 110మందికి ఉద్యోగాలు.

Previous Post

అతుకులు లేని జాతీయజెండా

Next Post

సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026

కార్యకర్త
@ May 7, 2026
ఆంధ్రప్రదేశ్

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
వేగంగా విత్తన సరఫరా
ఆంధ్రప్రదేశ్

వేగంగా విత్తన సరఫరా

చైతన్యరధం
@ May 7, 2026
సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్
ఆంధ్రప్రదేశ్

సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

చైతన్యరధం
@ May 7, 2026
అతుకులు లేని జాతీయజెండా
ఆంధ్రప్రదేశ్

అతుకులు లేని జాతీయజెండా

చైతన్యరధం
@ May 7, 2026
డేటా సెంటర్ పరికరాల తయారీలో దేశం అగ్రగామిగా నిలవాలి
ఆంధ్రప్రదేశ్

డేటా సెంటర్ పరికరాల తయారీలో దేశం అగ్రగామిగా నిలవాలి

చైతన్యరధం
@ May 7, 2026
చైతన్యరధం ఈ పేపర్ 06-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-05-2026

కార్యకర్త
@ May 6, 2026
రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

చైతన్యరధం
@ May 6, 2026
Load More

ముఖ్య వార్తలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

చైతన్యరధం
@ May 6, 2026
కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
వేగంగా విత్తన సరఫరా

వేగంగా విత్తన సరఫరా

చైతన్యరధం
@ May 7, 2026
సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

చైతన్యరధం
@ May 7, 2026
భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

చైతన్యరధం
@ May 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist