- బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలి
- ఐదేళ్ల పాలనలో సీమకు తీరని ద్రోహం
- చివరి భూముల వరకు కృష్ణా జలాలు పారిస్తున్న సీఎం చంద్రబాబు
- మాజీ ఎమెల్సీ బీటెక్ రవి.
అమరావతి (చైతన్యరథం రాయలసీమ రైతుల గురించి, రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడే కనీస అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పులివెందుల ఇన్ఫ్ర్ఛార్జి బీటెక్ (మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి) మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో రాయలసీమకు తీరని ద్రోహం చేసిన వ్యక్తి జగర్ అని గురువారం ఒక ప్రకటనలో రవి ధ్వజమెత్తారు. హంద్రీనీవా పనులు శరవేగంగా పూర్తి చేసి రాయలసీమ చివరి భూముల వరకు సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలను పారస్తున్నారని పొరుగు రాష్ట్రాల నాయకులు కీర్తిస్తుంటే… జగన్ రెడ్డికి కడుపు మంటగా ఉన్నట్టుంది. 2020లోనే సీఎం జగన్కు వార్నింగ్ ఇచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించామని మాజీ మంత్రి, బీజర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అంటున్నా రు. జగన్ దీనికి సమాధానం రెప్పాలి.. శ్రీశైలం జలాశయం నుంచి 788 అడుగుల వీటిమట్టం వద్దనే కృష్ణా జలాలను తరలిం రేందుకు నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ముచ్చుమర్రి వద్ద చంద్రబాబు నిర్మించారు.
జగన్ ఐరీళ్లపాలనలో ఈ పథకాన్ని నిర్వీర్యం చేశారు. రాయలసీమ లిఫ్ట్ పేరుతో రూ.1000 కోట్లు మట్టి పనులు చేసుకొని దోచుకున్నారు. 2020లోనే అనుమతులు లేవని రాయలసీమ లిట్టిన ఎన్జీటీ నిలిపి వేసింది. వైసీపీ ఇసుక మాఫియాకు అన్నమయ్య. ద్యామ్ తెగి 39 మంది చనిపోయారు. హంద్రీనీవాకరెంటీ బిల్లులకు కూడా డబ్బులు చెల్లించలేదు. ఐదేళ్ల పాలనలో కేవలం రూ.2 వేల కోట్లు కూడా సీమ ప్రాజెక్టుల ఖర్చు చేయలేదు జీవో. 365 తెచ్చి 102 రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పనులు రద్దు చేశారు. పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని తరలించి, కృష్ణా జలాల్లో 512టీఎంసీల వాటా సాధించి రాయలసీమను సస్యశామలం చేసిన ఘనత చంద్రబాబుది. ఈ రెండున్నరేళ్ల పాలనలో దాదాపు. రూ.18,500 కోట్లు రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు చేశాం. మరో రూ.10వేల కోట్లు ఖర్చు చేయబోతు
న్నాం. రెండు సార్లు కుప్పం వరకు కృష్ణా జలాలను తరలించాం. రాయలసీమను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలుపుతున్నాం. నీచ రాజకీయల కోసం రాయలసీమ పేరును వాడుకోవడం జగనేను అల వాటుగా మారింది. 20:24 ఎన్నికల్లో, ఇప్పుడు జరు గుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ ఇంకా మార్పు రాలేదని బీటెక్ 50 దుయ్యబట్టారు.



















