- అంబేద్కర్, ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటున్న టీడీపీ
- పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉద్ఘాటన
- టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
- రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన నేతలు
- భారత రాజ్యాంగం ప్రతీ పౌరునికి పవిత్ర గ్రంథం: ఎమ్మెల్సీ వర్ల రామయ్య
- గత వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచిందన్న నేతలు
అమరావతి (రైతన్యరథం: డా. బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి, స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ నడుచుకుంటుందని పార్టీ నేతలు పేర్కొన్నారు. గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో సాగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ వర్ల రామయ్య, ఎమ్మెల్యేలు పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు), గల్లా మాధవి, టీడీపీ సీనియర్ నేత ఎన్టీఎస్ఎన్ వర్మ, పార్టీ ప్రధాన కార్యదర్శి పర్చూర్ అశోక్ బాబు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్, ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ …. మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉండటానికి కారణం మన అన్నారు. రాజ్యాంగమే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగ రచన కమిటీ సభ్యులు కలిసి రూపొందించిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ప్రవేశపెట్టి, 1960 జనవరి 26న అమల్లోకి తెచ్చారు. చట్టాలు ఎన్ని చేసినా, వాటిని నిజాయతీగా అమలుచేసే నాయకులు, అధికారులు ఉండాలని అంబేద్కర్ నాడే చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇష్టానుసారంగా పాలించి, పౌర హక్కులను అణచివేసి రాష్ట్రాన్ని ఇబ్బందుల్లో పెట్టింది. ప్రజల ఆశీర్వాదంతో 2024లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ – నేతృత్వంలో రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని సమానంగా చూస్తూ అభివృద్ధి చేస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ స్ఫూర్తితో, ప్రతి ఒక్కరి హక్కులను కాపాడుతూ మంచి పాలన అందించడానికి పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ వర్ల రామయ్య మాట్లాడుతూ… 1947 155 స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, దేశ ప్రజలకు మార్గదర్శకంగా ఒక చిఖిత రాజ్యాంగం ఉండాలని నాటి పెద్దలు నిర్ణయించారన్నారు. రాజ్యాంగ రచన బాధ్యతను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అప్పగించగా, ఆయన తన కమిటీతో కలిసి గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించారు. 1949 నవంబర్ 26న భారతీయులందరూ దీనిని ఆమోదించారు. హిందువులకు భగవద్గీత, క్రైస్తవులకు బైబిల్, ముస్లింలకు ఖురాన్ ఎలాగో, ప్రతి భారతీయుడికి ఈ రాజ్యాంగం అంతకంటే గొప్ప పవిత్ర గ్రంథం లాంటిదని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలు పి.జి.వి.ఆర్. నాయుడు ( మాధవి మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు గర్వంగా జరుపుకోవాల్సిన పండుగ ఇదన్నారు.
రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు.. 145 కోట్ల నుంది ప్రజల హక్కులు, ఆశలకు ప్రతీక. అంబేడ్కర్ స్ఫూర్తి, ఎన్టీఆర్ ఆత్మగౌరవం, చంద్రబాబు నాయుడు అభివృద్ధి దార్శనికతతో పేద, ధనిక, ప్రాంతాల తేడా లేకుండా అందరికీ హక్కులు, చాధ్యతలు అందాలి. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే స్తంభాలపై రాజ్యాంగం నిలబడి ఉంది. అణగారిన వర్గాలు, యువతకు అభివృద్ధి ఫలాలు అందినప్పుడే రాజ్యాంగానికి విజమైన సార్థకత ఉంటుంది. మేధావులు, అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ, రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని పేర్కొన్నారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి పర్చూరి మాట్లాడుతూ.. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు అనే స్ఫూర్తితో అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలో మన రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. రాజ్యాంగంలోని మౌలిక అంశాలను ఎవరూ మార్చలేరని సుప్రీంకోర్టు గతంలో అనేక కేసుల్లో స్పష్టం చేసింది. సమానత్వం, లౌకికవాదం దీని ప్రధాన లక్ష్యాలు, కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థలకు స్పష్టమైన అధికారాలు ఇస్తూ మన రాజ్యాంగ నిర్మాతలు గొప్ప వరం అందించారు. అయితే రాజ్యాంగం ఎంత గొప్పదైనా, దాన్ని అమలు చేసే నాయకులను బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుందని అంబేద్కర్ ఆనాడే చెప్పారు. గతంలో రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిన తీరును మనం చూశాం, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో నిబంధనలు, ప్రజాస్వామ్య స్వేచ్ఛ చక్కగా అమలవుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన రాజ్యాంగం అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు.
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మణ్ బుచ్చి రాంప్రసాద్ మాట్లాడుతూ… రాజ్యాంగ విలువలు, నియమాలకు అనుగుణంగా పార్టీ బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు అధికస్థానం కల్పిస్తున్న పార్టీ తెలుగుదేశం అన్నారు. అన్ని మతాలను గౌరవిస్తూ అన్ని వర్గాలకు సమానంగా చూస్తూ చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారు.
ఏపీ లయోడైవర్సిటీ కుమార్ మాట్లాడుతూ.. బాబూ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టిన మన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పెద్దదన్నారు. రాబోయ్ వందేళ్ల అవసరాలను ముందుగానే ఊహించి, సభ్యులు, డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు ఎంతో కష్టపడి.. సమన్వయంతో దీన్ని రూపొందించారు. ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నామంటే, ప్రతిపక్షాలు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలుగుతున్నాయంటే దానికి కారణం రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్చే కొందరు ఆ స్వేచ్ఛను దుర్వనియోగం చేసినా, మరికొందరు చక్కగా పాటిస్తారు. తెలుగుదేశం మాత్రం ఎప్పుడూ రాజ్యాంగాన్ని దాటాలని అనుకోదు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ పనీ చేయదు. ప్రాథమిక హక్కులతో పాటు బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ పాటించాలని కోరుకునే పార్టీ తెలుగుదేశమని స్పష్టం చేశారు.
పార్టీ సీనియర్ నేత. వర్మ మాట్లాడుతూ.. బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దేశ పౌరుల హక్కులకు పెద్ద అండగా నిలిచిందన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే పనిచేస్తోంది. రాజకీయ, సామాజిక, సంక్షేమ రంగాల్లో అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ, సమతుల్యత పాటిస్తూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మంచి పాలన సాగుతోందని వర్మ పేర్కొన్నారు.



















