చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

బీసీలను బతకనివ్వరా జగన్‌?

జగన్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి కొల్లు ఫైర్

చైతన్యరధం by చైతన్యరధం
January 30, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
బీసీలను బతకనివ్వరా జగన్‌?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వైసీపీ పాలనలో భయం భయంగా బీసీల బతుకులు
  • బీసీలకు అన్ని విధాలుగా జగన్‌రెడ్డి ద్రోహం
  • మత్స్యకారుడి ఆత్మహత్య.. ప్రభుత్వ హత్యే
  • జగన్‌ మూల్యం చెల్లించుకోక తప్పదు
  • మాజీ మంత్రి కొల్లు ఆగ్రహం

అమరావతి: వైసీపీ పాలనలో బీసీలకు బతకాలం టేనే భయమేస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ జాతీయ కార్యాల యంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమా వేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడుతూ జగన్‌ పాలనలో అనేక వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టించా రని ఆగ్రహం వ్యక్తంచేశారు. వేలమంది బీసీలపై దాడు లు, దౌర్జన్యాలు చేసినా జగన్‌కు ఇంకా కసి తీరలేదు. ఇటీవల పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం బంగారుపెంట గ్రామానికి చెందిన బీసీ మత్స్యకారుడు చెవిటిపల్లి దుర్గారావు.. పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్యచేసుకున్నాడు.ఈ మత్స్య కారుడి ఆత్మహత్యకు ముఖ్యమంత్రి జగనే బాధ్యత వహి ంచాలి. ఈసంఘటన చాలాదారుణం, దుర్మార్గం. పోలీ సులు బెదిరించడంతోనే ఈ మత్స్యకారుడు చనిపోయా డు. తెలంగాణ రాష్ట్రం నుంచి మద్యం తీసుకొస్తున్నా డని అతనిపై అక్రమ కేసు పెట్టారు. ఆ తరువాత వైసీపీ లో చేరుతావా..లేదా..అని బెదిరించారు. వైసీపీలో చేర లేదనే ఉద్దేశంతో అతనిపై అక్రమ కేసు పెట్టారు. రూ. 2 లక్షల డబ్బులివ్వమని భయపెట్టారు. అతను ముం దస్తు బెయిల్‌ తెచ్చుకున్నాడు. అతనిపై అక్కసుతో స్టేష న్‌కు వస్తే నిన్ను ఎన్‌కౌంటర్‌ చేస్తా అని ఎస్‌ఐ బెదిరిస్తే, పోలీసుస్టేషన్‌కు సంతకం పెట్టడానికి వెళ్లాల్సిన అతను భయపడి తను వేటకు వెళ్లే బోటులో ఎక్కి వలకు ఉన్న తాడును మెడకు చుట్టుకొని నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వైసీపీ పాలనలో ఇలాంటి దౌర్జన్యాలు, ఆకృత్యాలు, దుర్మార్గాలు, అక్రమాలు అధికమయ్యాయ ని కొల్లు ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీలకు బతకాలంటే భయమేస్తోంది..
ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని అనేక ఆటలు ఆడుతోంది. ఇవన్నీ చూస్తుంటే బలహీనవర్గాల కు బతికే హక్కుందా అని భయమేస్తోంది. పల్నాడు జిల్లాలో తోట చంద్రయ్య అనే బీసీ నాయకుడు టీడీపీ లో బ్రహ్మానందరెడ్డికి తోడుగా ఉన్నాడని అతనిపై వేధిం పులకు పాల్పడ్డారు. జై జగనన్న అని చెప్పమంటే జై చంద్రబాబు అని చెప్పినందుకు నడిరోడ్డుపై కోడిని కోసినట్లు పీక కోసి చంపారు. జల్లా యాదవ్‌ను కూడా అనేక హింసలు పెట్టారు. చేనేత వర్గానికి చెందిన నం దం సుబ్బయ్యను కూడా పొట్టన పెట్టుకున్నారు. ప్రకా శం జిల్లా చీరాలకు చెందిన మత్స్యకార మహిళ పద్మ వైసీపీలో చేరమంటే చేరలేదని వివస్త్రను చేసి వేధించా రు. దీంతో ఆమె సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంది. చంద్ర బాబు అరెస్టు అయినప్పుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీసీ సామాజికవర్గానికి చెందినరెడ్డిక సోదరులు కుప్పం వరకు సైకిల్‌ యాత్ర చేస్తూ పుంగనూరుకు చేరుకున్న ప్పుడువారి బట్టలు ఊడదీసి రోడ్డుపై మోకాళ్లపై కూర్చో బెట్టారు. నెల్లూరు జిల్లా కావలిలో విజయవాడకు చెంది న బొందల అనే బీసీ సామాజిక కులానికి చెందిన రాం సింగ్‌ అనే ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌ హారన్‌ కొట్టాడని నడి రోడ్డుపై దారుణంగా చితకబాదారు. చావు బతుకుల మధ్య ఉన్న అతడిని పలకరించడానికి టీడీపీ నాయకు లు వెళితే పోలీసులు అడ్డగించారు. రేపల్లెలో తన అక్క ను వేధించవద్దని చెప్పినందుకు పదవ తరగతి చదివే బీసీ వర్గానికి చెందిన అమర్నాథ్‌ గౌడ్‌ అనే బాలుడిని పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. విజయనగరం జిల్లాలో కృష్ణా మాష్టర్‌ని దారుణంగా హత్య చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే బీసీలపై జరిగిన దారుణాలకు లెక్కే లేదని కొల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీలకు ఒక్క పైసా సహాయం లేదు..
బీసీ కార్పొరేషన్‌ నుంచి ఒక పైసా సహాయం చేయ లేదు. బీసీలకు హక్కుగా రావాల్సిన పథకాల్ని అణగ దొక్కారు. రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, విదేశీ విద్య, బీసీ సబ్‌ ప్లాన్‌ ఏవీ లేకుండా చేశారు. బీసీలకు అన్ని రకాలుగా ద్రోహం చేసిన జగన్‌.. నా బీసీలు అనడంలో అర్థం లేదు.రాష్ట్రం మ్యాచింగ్‌ ఫండ్‌ ఇవ్వకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనేక పథకాలు ఆగిపోతున్నా యని కొల్లు అన్నారు.

దారుణాతి దారుణంగా దాడులు చేస్తున్నారు..
బీసీలపై దారుణాతి దారుణంగా దాడులు చేస్తున్నా రు. ప్రభుత్వం బీసీలను కల్లబొల్లి మాటలతో మభ్యపెడు తోంది. 5 సంవత్సరాలపాటు నిద్రపోయి ఇప్పుడు కుల గణన అంటే ఎలా? బీసీలను అణగదొక్కారు. ఎన్నికల వస్తున్నాయని జగన్‌ మళ్లీ బీసీలను వాడుకోవాలని చూస్తున్నారు. కులగణన ఇలా కాదు. దానికి ఒక చట్ట బద్ద విధానం ఉంటుంది. దానికి ఒక కమిషన్‌ ఉంటుం ది. కొందరికి శిక్షణ ఇచ్చి వారి ద్వారా తీసుకోవాల్సిన సమాచారాన్ని తీసుకోవడంలేదు. బీహార్‌లో చేసిన కుల గణన సరైంది కాదని కోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చీవా ట్లు పెట్టింది. ఎన్నికల్లో భయపట్టి గెలవాలని చూస్తు న్నారు. చేసిన పాపాలన్నీ చేసి మభ్యపెట్టాలని చూస్తే నమ్మేందుకు బలహీనవర్గాల ప్రజలు అమాయకులు కారని కొల్లు అన్నారు.

ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు..
వెల్దుర్తి మండలం బంగారుపెంట గ్రామానికి చెందిన బీసీ మత్స్యకారుడి ఆత్మహత్య.. ప్రభుత్వ హత్యే. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. కచ్చి తంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కొందరు అధికారులు వైసీపీ ప్రభుత్వానికి తొత్తులు గా వ్యవహరిస్తున్నారు.రాబోయేకాలంలోవారికి శిక్ష తప్పదు. నియం తృత్వ ప్రభుత్వాన్ని గద్దెదించే తొలి ఓటు బీసీలదే అవుతుందని జగన్మోహన్‌రెడ్డి గుర్తు పెట్టుకోవాలని కొల్లురవీంద్ర హెచ్చరించారు.

Tags: జగన్ రెడ్డి సామాజిక న్యాయం మాటల్లోనేనిరంతర దాడులుబీసీ ద్రోహి జగన్‌బీసీ లపై దాడులుమాజీ మంత్రి కొల్లు రవీంద్ర
Previous Post

వైసీపీ గేమ్ ఓవర్..

Next Post

గ్రహణాలన్నీ త్వరలోనే వీడిపోతాయి: అశోక్‌బాబు

Next Post
గ్రహణాలన్నీ త్వరలోనే వీడిపోతాయి: అశోక్‌బాబు

గ్రహణాలన్నీ త్వరలోనే వీడిపోతాయి: అశోక్‌బాబు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.