చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వైసీపీ గేమ్ ఓవర్..

రాజమండ్రి రా..కదలి రా సభలో చంద్రబాబునాయుడు

by చైతన్యరధం
Jan 30, 2024 at 8:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
వైసీపీ గేమ్ ఓవర్..
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మన గెలుపును..ఎవరూ ఆపలేరు.
  • జగన్ బాధితులంతా నాకు స్టార్ క్యాంపెయినర్లే
  • సామాజిక న్యాయమంటూ..సామంతులకు రాష్ట్రాన్ని అప్పగిస్తారా..?
  • కోడికత్తి శ్రీనును జైల్లో..బాబాయి హంతకులు బయట తిప్పడమే సామాజిక న్యాయమా..?
  • ఓటు అనే వజ్రాయుధంతో కలియుగ భస్మాసురుడిని తరిమికొట్టండి
  • రాజమండ్రి రా..కదలి రా సభలో చంద్రబాబునాయుడు

రాజమహేంద్రవరం: వైసీపీ గేమ్‌ ఓవర్‌…పని అయిపోయింది..టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. జగన్‌ పాలనలో నష్టపోయిన బాధితులే తనకు స్టార్‌ క్యాంపెయినర్లు అని ఆయన ప్రకటించారు. జగన్‌ ఒక వైపు సామాజిక న్యాయం అంటాడు…. మరోవైపు రాష్ట్రం అంతా తన వర్గానికి చెందిన సామంతులతో పాలన సాగిస్తాడని చంద్రబాబు నాయుడు మండి పడ్డారు. 10వ తరగతి విద్యార్థి, బీసీ బిడ్డ అమర్నాథ్‌ ను చంపిన వాళ్లు బయట తిరగడమే సామాజిక న్యాయమా అని ప్రశ్నించారు. కోడికత్తి శ్రీను జైల్లో… బాబాయి హంతకులు బయట ఉండడమే సామాజిక న్యాయమా అని జగన్‌ను ప్రశ్నించారు. రాజమండ్రి రూరల్‌ లో సోమవారం జరిగిన రా కదలి రా సభలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై చంద్రబాబు మండిపడ్డారు. పలు ప్రశ్నలతో జగనును నిలదీశారు.

రాజమండ్రి దద్దరిల్లింది
‘‘ఈ రోజు రాజమండ్రి రంకేసింది. రాజమహేంద్ర వరం దద్దరిల్లింది. త్వరలో మంచిరోజులు వస్తాయి. టీడీపీ-జనసేన గెలుపును ఎవరూ ఆపలేరు. రాజమం డ్రికి రాజమహేంద్రవరం అని పేరు పెట్టింది నేనే. కందుకూరి వీరేశలింగం ఈ గడ్డపై నుంచే సంస్కరణ లు ప్రారంభించారు. సైకో జగన్‌రెడ్డి నుంచి ఈ రాష్ట్రా న్ని కాపాడుకోవాలి. ఆనాడు నేను దూరదృష్టితో హైద రాబాద్‌ అభివృద్ధిచేశాను. తలసరి ఆదాయంలో తెలం గాణ దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉందంటే అందుకు తెలుగుదేశం పార్టీ వేసిన పునాదులే కారణం. నేనిచ్చిన ఐటీ ఆయుధంతో తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా స్థిరపడ్డారు. ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్‌ కు ఏమైనా అనుమానం ఉంటే మీ పిల్లలను అడగండి. వారు కూడా నాలబ్ధిదారులే అని చంద్రబాబు అన్నారు.

సంబంధితవార్తలు

పరిశ్రమలకు కేరాఫ్‌గా రాష్ట్రం అదే మన సంకల్పం కావాలి: సీఎం చంద్రబాబు

తొలి అడుగు పడింది

నాన్న వారసత్వం కొనసాగిస్తాం

సైకో రెడ్డిని తరిమికొట్టండి
రాష్ట్రంలో సైకో పాలన జరుగుతోంది. మానసిక రోగి రాష్ట్రాన్ని పాలించడం బాధాకరం. ఈ ముఖ్య మంత్రి విశాఖలో మీటింగ్‌ పెట్టాడు. రాజకీయ విమ ర్శలకు నేను బాధపడను. కానీ నాది, పవన్‌ ది ఫోటో పెట్టి బూటు కాలితో తన్నించాడు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఏమనాలి? ఇలాంటి చర్యలను నాగరిక ప్రపంచం అనుమతిస్తుందా? ప్రజల కోసమే మిమ్మల్ని భరిస్తున్నాం. మీ సంగతి తేల్చడం… నాకు ఒక్క నిమి షం పని. దుర్మార్గుడి చేతినుంచి ప్రజలను కాపాడాలనే తాను తపిస్తున్నానని చంద్రబాబు అన్నారు.

ఆంబోతు రాంబాబూ… నీకు కళ్లెం వేస్తా
టీడీపీ నాయకుడు కన్నా లక్ష్మీ నారాయణ సత్తెనపల్లి నియోజకవర్గానికి వెళితే ఆంబోతు రాంబాబు ఆయన పై దాడిచేయించాడు. ఆంబోతూ…నీకు కళ్లెం వేస్తా…. వదలిపెట్టను. వడ్డీతో సహాచెల్లిస్తా. ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తే చూస్తూ ఊరుకోం. అవినీతి డబ్బుతో, అధికార మదంతో ప్రవర్తిస్తే తగిన శాస్తి చేస్తాను. ఎవర్నీ వదిలి పెట్టను. ఖబడ్దార్‌… జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

తెలుగుదేశం గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ!
వైసీపీలో తిరుగుబాటు మొదలైంది. ఆ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా నేతలు భయపడి పారిపోతున్నారు. 68మందిని తీసేశారు. అందులో 29 మందికి సీట్లు గల్లంతు. నేతలను బదిలీ చేసేస్తున్నారు. నా రాజకీయ జీవితంలో నేతల బదిలీ ఎప్పుడూ చూడ లేదు. ఒక ఊరి చెత్త ఇంకో ఊరిలో వేస్తే బంగారం అవుతుందా? 49మంది బడుగు, బలహీనవర్గాల నేతల ను, 11మంది దళితులు, నలుగురు బీసీలను దూరం పెట్టారు. మీ సీటుకో దండమని 4గురు ఎంపీలు పారి పోయారు.మనం తలుపులు తెరిస్తే వైసీపీ ఖాళీ. ఇద్దరు ఎమ్మెల్యేలు రాజనామా చేశారు. తానేటి వనిత, చెల్లని వేణుగోపాల్‌,ఆదిమూలపు, మేరుగ,గుమ్మనూరు, జోగి, గుడివాడ, ఉషశ్రీ చరణ్‌ సహా 10మంది మంత్రులు అవుటయ్యారు. గేమ్‌ ఈజ్‌ ఓవర్‌ తమ్ముళ్లూ. టీడీపీ-జనసేన పొత్తు అనగానే ప్యాంటులు తడిచాయి. డైపర్లు వేసుకుని తిరుగుతున్నారు. రేపో, ఎల్లుండో వైసీపీ వెంటిలేటర్‌ పైకి వెళ్లబోతోంది. నో డౌట్‌ అని చంద్ర బాబు ఎద్దేవా చేశారు.

అంబేద్కర్‌ కంటే గొప్పవాడివా జగన్‌రెడ్డీ?
సైకో జగన్‌రెడ్డి ఎదుట దళితులు నిలబడకూడ దంట.. మాట్లాడకూడదంట. నాలుగున్నరేళ్లలో దళితు లపై 6వేల దాడులు చేశారు. 188మందిని పొట్టన పెట్టుకున్నారు. మాస్క్‌ అడిగిన డాక్టర్‌ సుధాకర్‌ను చంపేశారు. కోత్తి కొత్తి శ్రీను జైల్లో మగ్గుతున్నాడు. బాబాయ్‌ని చంపిన అవినాష్‌ దర్జాగా బయట తిరు గుతున్నాడు.ఊరికో దళితుడిని బలిచేశావ్‌.. సామాజిక న్యాయం గురించి మాట్లాడే జగన్‌రెడ్డి, రాష్ట్రం మొత్తాన్ని తన వర్గానికి చెందిన సామంత రాజులకు అప్పగించి పాలన సాగిస్తున్నాడు. రాష్ట్రమంతా వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిదే పెత్తనమని చంద్రబాబు విమర్శించారు.

దళిత డైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ చేసిన వాణ్ణి పక్కన పెట్టుకుని ఈ ముఖ్యమంత్రి ఊరేగుతున్నాడు. దళితులకు మేలుచేసే 27సంక్షేమ పథకాలు రద్దు చేశా రు. ఒక్క దళిత కాలనీలో రోడ్డు వేశావా జగన్‌రెడ్డీ? తమ్ముళ్లూ… మీరు నడిచే రోడ్లు నేను వేసినవే. మీరు తినే తిండికి వాడే గ్యాస్‌ నేనిచ్చిందే. మీరు రోడ్డుపై తిరిగినప్పుడు వెలిగే ఎల్‌ఈడీ బల్బులు నేను ఇచ్చినవే. విదేశీ విద్య పథకానికి అంబేద్కర్‌ పేరు తీసి జగన్‌ తన పేరు పెట్టుకున్నాడు. అంబేద్కర్‌ కంటే గొప్ప వాడా ఈ ముఖ్యమంత్రి. నీతులు చెబుతాడు. సైకో పనులు చేస్తాడని చంద్రబాబు విమర్శించారు.

ఎన్నికలకు ముందే వైసీపీ ఓడిపోయింది
వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలంకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వ కుండా ఎంపీ సీటు ఇస్తామన్నారు.ఎందుకో చెప్పమం టే నీ గ్రాఫ్‌ బాలేదు. అందుకే ఎంపీగా వెళ్ళమన్నాడు ముఖ్యమంత్రి. ఒక దళితుడునైన తనకు సీటు రాక పోవడానికి మంత్రి పెద్దిరెడ్డి కారణమని ఆదిమూలం నేరుగానే ముఖ్యమంత్రికి చెప్పాడు. అయినా న్యాయం జరగలేదు. పెద్దిరెడ్డి ఏది దొరికితే అది తినేసే రకం.. అతనిపై చర్యలు తీసుకోగలవా జగన్‌రెడ్డీ? పెద్దిరెడ్డికి ఒక న్యాయం…ఆదిమూలంకు ఒక న్యాయమా? కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు సర్వేలో వ్యతిరేకత వచ్చిం దని ముఖ్యమంత్రి చెబితే అతను.. నేను నిత్యం ప్రజ ల్లోనే ఉన్నాను. మర్డర్లుచేయలేదు.. చేసినవారికి సపోర్ట్‌ చేయలేదని స్పష్టంగా చెప్పేశాడు. రాష్ట్రంలో అవినీతి కేంద్రీకృతమైందని దేశమంతా చెప్పుకుంటున్నారని సీఎం ముఖం మీదనే చెప్పి ఆ ఎమ్మెల్యే బయటకు వచ్చే శాడు. ఎన్నికలకు ముందే వైసీపీ ఓడిపోయింది. రాష్ట్రా న్ని కాపాడుకోవడడం మనందరిబాధ్యత.నిన్న ఒక్కరోజే నాలుగు సంఘటనలు జరిగాయి. ఒక ఆడబిడ్డకు రక్షణ లేదు. ఒక ఎస్సీ నేతకు న్యాయం జరగలేదు. ఒక స్త్రీపై దాడి చేస్తే అడిగే నాథుడు లేడు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోడానికే నేను మీ ముందుకొచ్చా. రా కదిలి రా పిలుపునిచ్చా. ఇది ఐదు కోట్లు ఆంధ్రుల కార్యక్ర మం. జగన్‌రెడ్డిని దించడానికి ఐదు కోట్లమంది జనం సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు ఉద్ఘాటించారు.

సైకిల్‌ ఎక్కండి… గ్లాస్‌ పట్టుకోండి
ఐదేళ్లలో ఒక్కరికైనా ఉద్యోగాలు వచ్చాయా? డీఎస్సీ పెట్టాడా? యువత ఉద్యోగం అడిగితే గంజాయి ఇస్తు న్నాడు. గంజాయివల్ల పిల్లలు నాశనం అయిపోతున్నా రు. ఆ రోజు గట్టిగా పోరాడితే టీడీపీ ఆఫీస్‌ పైనా, నా ఇంటిపైనా దాడిచేశారు. పిల్లల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నాడు. మన రాష్ట్రంలో ఆకుకూరలు దొరకవుకానీ గంజాయి దొరుకుతుంది. బ్లేడ్‌ బ్యాచ్‌, గంజాయి బ్యాచ్‌ కలిసి అరాచకం సృష్టిస్తున్నారు.తమ్మూళ్లూ మీ భవిష్యత్‌ బాగుండాలంటే టీడీపీ-జనసేనకు మద్దతివ్వండి. ప్రతి ఏడాది 4లక్షల ఉద్యోగాలు, ఐదేళ్లలో 20లక్షల ఉద్యో గాలు ఇప్పించే బాధ్యత నాది. ఉద్యోగం వచ్చే వరకూ 3వేల నిరుద్యోగ భృతి ఇస్తా. వర్క్‌ఫ్రమ్‌ హోంకు శ్రీ కారంచుడతా.మండల కేంద్రాల్లో వర్క్‌ స్టేషన్లు పెడతా. 72రోజుల కౌంట్‌ డౌన్‌ మొదలైంది. సైకిల్‌ ఎక్కండి. గ్లాస్‌ పట్టుకోండి. టీడీపీ- జనసేన జెండాలు పట్టుకుని జనాల్లోకి వెళ్లాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.

మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం టీడీపీ
ఆడబిడ్డలను ఆదుకోడానిక భవిష్య్‌త్‌కు గ్యారంటీ కార్యక్రమం తెచ్చాం. అన్న ఎన్టీఆర్‌ రాజకీయాల్లో మహిళలకు 8శాతం రిజర్వేషన్లు, ఆస్తిహక్కు కల్పించా రు. నేను ఉద్యోగావకాశాల్లో 33శాతం రిజర్వేషన్లు అమలు చేశాను. డ్వాక్రా సంఘాలు పెట్టాను. పొదుపు ఉద్యమం నేర్పాను. ఇంటికే పరిమితమైన ఆడబిడ్డను డ్వాక్రాతో అన్నింటా చక్రం తిప్పేలా తయారుచేశాను. రాబోయే కాలంలో ఆడబిడ్డల సహాయ సహకారాలు తీసుకుని పేదరిక నిర్మాలన చేస్తా. ప్రతి ఆడబిడ్డకు నెల కు రూ.1500 అకౌంట్‌లో వేస్తాను. తల్లికి వంద నం కింద ఎంతమంది బడికి వెల్లే పిల్లలు ఉంటే అంద రికీ ఏడాదికి రూ.15,000 ఇస్తాను. ప్రతి ఆడబిడ్డకు ఉచి తంగా మూడు గ్యాస్‌ సిలిండెర్లు, ఆర్టీసీ బస్పుల్లో ఉచిత ప్రయాణం ఏర్పాటుచేస్తానని చంద్రబాబు చెప్పారు.

బకాయిలు చెల్లించమంటే బెదిరిస్తావా?
ఆరోగ్యశ్రీని అటకెక్కించి పేదల ప్రాణాలతో జగన్‌ చెలగాటం ఆడుతున్నాడు. ఆసుపత్రులకు రూ.1200 కోట్లు బకాయిలు చెల్లించకుండా రౌడీలను పంపి బెదిరి స్తున్నాడు. ఆస్పత్రుల యాజమాన్యాలు భయ పడొద్దు. మేం వస్తున్నాం. ఆదుకుంటాం. పెండిరగ్‌ బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరోవైపు సర్వే రాళ్లపైనా సైకో రెడ్డి ఫోటోలే. ఇంట్లో టీవీలో నీ ఫోటో, మరుగుదొడ్డికి పోయినా నీ ఫోటోనే చూడాలా? భూ రక్షణ చట్టంఫేక్‌…రికార్డులు మార్చేసి మీ భూమిని కొట్టేసేందుకు ప్లాన్‌ చేశాడు. ఆ చట్టాన్ని మేమొచ్చాక రద్దుచేస్తాం. రాజమండ్రి సమీపంలో ఆవ భూముల్లో అవినీతి చేసి రూ.600 కోట్ల కుంభకోణం చేశాడు జగన్‌రెడ్డి. మేము వచ్చాక ఈ దొంగలు తిన్న డబ్బులు మొత్తం కక్కిస్తామని చంద్రబాబు హమీ ఇచ్చారు.

వచ్చేది మన ప్రభుత్వమే
మన ప్రభుత్వం వచ్చాక రాజమండ్రిని టూరిజం హబ్‌గా తయారుచేస్తాను. ధాన్యం రైతులను, ఆక్వా రైతులను ఆదుకుంటాం. వచ్చే ప్రభుత్వంలో కరెంటు చార్జీలు పెంచకుండా నాణ్య మైన కరెంటు ఇచ్చేబాధ్యత టీడీపీ`జనసేన తీసుకుంటుంది. రోడ్లు బాగుచేస్తాం. మళ్లీ ఉచిత ఇసుక తెస్తా. పంట కాలువలు ఆధునీకరి స్తా. కలియుగ భస్మాసురుణ్ణి తరిమికొడదాం. సైకో పాలనకు నేనూ బాధితుణ్ణే. ఐదేళ్లు మనకు దారి దొరకలేదు. ఎంపీ జయదేవ్‌… రాజకీయ విరామం కోరాడంటే అర్థం చేసుకోండి. సైకో దెబ్బకు అందరూ పారిపోతున్నారు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ప్రజాస్వా మ్యాన్ని పునరుద్ధరించుకుందాం. 72 రోజుల్లో జరిగే ఎన్నికల్లో వజ్రాయుధం లాంటి మీ ఓటుతో భస్మాసురు డిని తుద ముట్టించండి. నష్టపోయిన బాధితులే నాకు స్టార్‌క్యాంపెయినర్లు. సైకో పాలనపోవాలి. సైకిల్‌ పాల న రావాలి. అన్నదాతల సంక్షేమం కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, జీవనాడి పోలవరం కోసం, గంజా యిలేని సమాజం కోసం, బడుగుల ఆత్మగౌరవం కోసం, రాతియుగం పోవాలి-స్వర్ణయుగం రావాలి. తెలుగు దేశం-జనసేన ఐక్యత వర్థిల్ల్లాలి అని చంద్ర బాబునాయుడు పిలుపు నిచ్చారు.

ఆడబిడ్డల జోలికొస్తే తోలుతీస్తా!
నిన్నటికి నిన్న మాచర్లలో దుర్గారావు అనే వ్యక్తిని పోలీసులు వేధించారు.. కొట్టారు.. పార్టీ మారమని ఒత్తిడి తెచ్చారు. ఆ బాధలు తాళలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సైకో పాలనలో బలవంతపు మరణాలు లెక్కలేనన్ని జరిగాయి. ఉన్మాది పాలనలో అందరం బాధితులమే. నీ దగ్గర అధికారం ఉందని తప్పుడు కేసులు పెట్టించి వేధిస్తున్నావ్‌. ఇలాంటి వారిని చాలా మందిని చూశాను. కాలగర్భంలో కలిసిపోవడం గ్యారంటీ. జగన్‌ పెద్ద సైకో అయితే మాచర్ల ఎమ్మెల్యే చిన్న సైకో. అనంతపురంలో ఒక మహిళను వైసీపీ నేత నటరాజ్‌ కోరిక తీర్చమని వేధించాడు. అందుకు ఒప్పు కోలేదని నడిరోడ్డుపై కొట్టాడు. మరో వైసీపీ నేత.. సంక్షేమ పథకాలు ఇవ్వాలని కోరిన మహిళ ను, పడుకుంటావా అనిఅడిగాడు. ఆంబోతుల మాదిరిగా వైసీపీ నేతలు ఊరిమీద పడ్డారు. నా ఆడబిడ్డల జోలి కొస్తే ఖబద్ధార్‌ జగన్‌రెడ్డీ అని చంద్రబాబు హెచ్చరించారు.

సామాజిక న్యాయం గురించి మాట్లాడే జగన్‌రెడ్డి, రాష్ట్రం మొత్తాన్ని తన వర్గానికి చెందిన సామంతరాజులకు అప్పగించి అరాచక పాలనను సాగిస్తున్నాడు. రాష్ట్రమంతా వైవీ సుబ్బారెడ్డి, విజయ సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిలదే పెత్తనం. అభంశుభం తెలియని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను బలి చేసి సొంత ముఠాకు పదవులన్నీ కట్టబెడుతున్న జగన్‌కు సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత ఉందా?

తూర్పుగోదావరిని దోచేసిన వైసీపీ గజదొంగలు
ఇక్కడున్న రాజమండ్రి వైసీపీ ఎంపీ ఒక రీల్స్‌ మాస్టర్‌. పార్లమెంటులో మాట్లాడడు. సోషల్‌ మీడ యాిలో మాత్రం రీల్స్‌ పెడుతూనే ఉంటాడు. అడిగి మరీ గుడ్‌ మార్నింగ్‌ చెప్పించుకుంటాడు. పూలు చల్లించు కుంటాడు. నీ రీల్స్‌ చూసి అలిసిపోయా మని ఒక తన్ను తన్ని ఎమ్మెల్యేగా పోటీ చేయమ న్నారు. ఆవ భూముల కుంభకోణంలో ఎంపీ వాటా రూ.150 కోట్లు. అనపర్తి ఎమ్మల్యే మరోపేరు గ్రావెల్‌రెడ్డి. ఆయన సతీమణిది కూడా అదే పని. కోట్లు కొల్లగొట్టాడు. కుటుంబం మొత్తం అవినీతి మయం.రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా… బ్లేడ్‌ బ్యాచ్‌ లీడర్‌. పేదల ఇళ్ల స్థలాలు కొట్టేస్తు న్నాడు. కొండలు కరిగించేస్తున్నాడు. ఆయన భోజ నమే ఇసుక, గ్రావెల్‌. కొవ్వూరు మహిళా మంత్రిని గోపాలపురానికి తరిమేశారు.అక్కడి ఎమ్మెల్యే తలారి అవినీతికి మారుపేరు. ఆయన సీటూ పోయింది. ఆయన కొవ్వూరు.. ఈవిడ గోపాలపురానికి. అక్కడ చెత్త ఇక్కడికి ఇక్కడ చెత్త అక్కడికి వేస్తే గెలుస్తారా? చిన్న ప్పుడు నేను ఊళ్లలో చూసే వాణ్ని కనికట్టు ఆటలు. వాటికి లేటెస్ట్‌ వెర్షనే ఈ జగన్మాయ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

 

Tags: కోడికత్తి శ్రీనుచంద్రబాబునాయుడుభస్మాసురుడురా..కదలి రా సభరాజమండ్రి సభస్టార్ క్యాంపెయినర్లు
Previous Post

జగన్ను చూసి జనం నవ్వుకుంటున్నారు: గంటా

Next Post

బీసీలను బతకనివ్వరా జగన్‌?

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-07-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-07-2025

కార్యకర్త
@ July 1, 2025
చైతన్యరధం ఈ పేపర్ 30-06-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-06-2025

కార్యకర్త
@ June 30, 2025
ఆంధ్రప్రదేశ్

పౌరసేవలకు ర్యాంకింగ్స్‌

చైతన్యరధం
@ June 30, 2025
ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ అంటే..పేదల ముఖంలో చిరునవ్వు!
ఆంధ్రప్రదేశ్

మీ ఏడుపులే..మాకు దీవెనలు!

చైతన్యరధం
@ June 30, 2025
ఆంధ్రప్రదేశ్

40 ఏళ్ల పసుపు రైతు కల సాకారం

చైతన్యరధం
@ June 30, 2025
ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడికి..
ఆంధ్రప్రదేశ్

ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడికి..

చైతన్యరధం
@ June 30, 2025
యువ రచయిత సూరాడకు లోకేష్‌ అభినందనలు
ఆంధ్రప్రదేశ్

యువ రచయిత సూరాడకు లోకేష్‌ అభినందనలు

చైతన్యరధం
@ June 30, 2025
ఇంటింటికీ సుపరిపాలన విజయాలు
ఆంధ్రప్రదేశ్

ఇంటింటికీ సుపరిపాలన విజయాలు

చైతన్యరధం
@ June 30, 2025
Load More

ముఖ్య వార్తలు

మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌!

మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌!

చైతన్యరధం
@ June 25, 2025
వరద జలాలే వాడతాం

వరద జలాలే వాడతాం

చైతన్యరధం
@ June 25, 2025
ఉద్యోగకల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ

ఉద్యోగకల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ

చైతన్యరధం
@ June 25, 2025
గెలిచింది కూటమికాదు… ప్రజలు!

గెలిచింది కూటమికాదు… ప్రజలు!

చైతన్యరధం
@ June 24, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

చైతన్యరధం
@ June 21, 2025 6:55 AM

సంపాదకుల ఆక్రోశం ఎవరి మెప్పుకోసం?

చైతన్యరధం
@ June 18, 2025 6:05 AM

విద్యాదానమే ఉన్నతోన్నతం

చైతన్యరధం
@ June 18, 2025 6:00 AM

వైసీపీ మేనిఫెస్టో.. కూటమి మేనిఫెస్టో అమలులో ఏది బెస్టో?

చైతన్యరధం
@ June 17, 2025 6:25 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పౌరసేవలకు ర్యాంకింగ్స్‌

చైతన్యరధం
@ June 30, 2025
ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ అంటే..పేదల ముఖంలో చిరునవ్వు!

మీ ఏడుపులే..మాకు దీవెనలు!

చైతన్యరధం
@ June 30, 2025

40 ఏళ్ల పసుపు రైతు కల సాకారం

చైతన్యరధం
@ June 30, 2025
ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడికి..

ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడికి..

చైతన్యరధం
@ June 30, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist