ఒక ఫ్యాక్షనిస్టు, తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని లక్షకోట్లు దోచుకున్న దోపిడీదారు, అధికారం కోసం సొంత బాబాయినే హతమార్చిన పచ్చినెత్తురుతాగే కిరాతకుడికి అధికారపగ్గాలు అప్పగించిన పాపానికి మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నిద్రలేని రాత్రులు గడుపుతోంది. తీవ్రమైన ఆర్థిక నేరాలు, అధికార దుర్వినియోగం, మనీల్యాండరింగ్, క్విడ్ ప్రోకో, ఛీటింగ్ వంటి 32 సిబిఐ, ఈడి కేసుల్లో 16నెలలు చిప్పకూడు తిన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రప్రజలను కల్లబొల్లి మాటలతో మభ్యపెట్టి మూడేళ్లక్రితం అధికార పగ్గాలు చేపట్టాడు. అధికారం చేపట్టాక కూడా పాతవాసనలు వీడకుండా తమకు అచ్చివచ్చిన చేతివాటం విద్యను ఉద్ధృతం చేస్తూ కొందరు దోపిడీ దొంగలు, స్మగ్లర్లు, ఖూనీకోర్లను సామంతరాజులుగా నియమించుకొని ప్రకృతిసంపదను, ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకుంటూ మూడేళ్లలో రూ.1.75లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలియాస్ జగనాసురుడు.
మూడేళ్ల క్రితం వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రాన్ని అడ్డగోలుగా లూఠీ చేయడమే పనిగా పెట్టుకొని యథేచ్చగా దోపిడీ సాగిస్తున్నారు. గత మూడేళ్లలో జగన్ రెడ్డి అండ్ కో రాష్ట్రంలో 1.75 లక్షల కోట్ల రూపాయలమేర దోపిడీకి పాల్పడ్డారు. ల్యాండ్, శ్యాండ్, మైన్, రెడ్ శ్యాండల్ ను విచ్చలవిడిగా దోచుకుంటూ వేలకోట్లరూపాయలు దోచుకుంటున్నారు. జగన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత భారతి సిమెంట్స్ కంపెనీ ఆస్తుల విలువ 40రెట్లు పెరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా 275 రూపాయలకు లభించిన సిమెంటు ధరను ఏకంగా 150రూపాయలకు పెంచేసి ప్రస్తుతం 425కు విక్రయించి ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్నారు. భారతీ సిమెంట్స్ విశాఖ- తూర్పుగోదావరి సరిహద్దుల్లో టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ సోదరుడు అనిల్ రెడ్డి సంయుక్తంగా రూ.15వేల కోట్లరూపాయల ల్యాటరైట్, బాక్సయిట్ లో అటవీచట్టాలను తుంగలో తొక్కి యథేచ్చగా తవ్వి కడపజిల్లాలోని భారతీ సిమెంట్స్‌కు తరలిస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బ్రోకర్లు కొడాలి నాని, వల్లభనేని వంశీ సంక్రాంతిపండుగ సందర్భంగా గుడివాడలోని నానికి చెందిన కన్వెన్షన్ ప్రాంగణంలో మూడురోజులపాటు చట్టవిరుద్ద క్యాసినో నిర్వహించి 500 కోట్లరూపాయల దోపిడీకి పాల్పడ్డారు. క్యాసినో సూత్రధారి ప్రవీణ్ చికోటి, మాధవిరెడ్డిలతో కొడాలి, వల్లభనేని లింకులు ఇప్పటికే దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
రాష్ట్రంలో గత మూడేళ్లుగా జగన్ రెడ్డి బినామీ కంపెనీల్లో నాసిరకం మద్యాన్ని తయారుచేసి రూ.60లు ఉన్న క్వార్టర్ మద్యాన్ని రూ.200కు పెంచడం ద్వారా 25వేలకోట్లరూపాయలు పేదల సొమ్మును లూఠీచేశారు. పేద,మధ్య తరగతి కుటుంబాలు చితికిపోయాయి. నాసిరకం మద్యం వల్ల రాష్ట్రంలో వందలాది మహిళల మాంగల్యాలు మంటగలిసి పోతున్నాయి.
రాష్ట్రంలో ఇసుక మొత్తాన్ని జయప్రకాష్ పవర్ వెంచర్స్ పేరుతో తమ బినామీ శేఖర్ రెడ్డి కట్టబెట్టడం ద్వారా రూ.10వేల కోట్లరూపాయల దోపిడీకి తెరలేపారు. పేరుకే జయప్రకాష్ వెంచర్స్ కు టెండరు ఇచ్చి ఆ సంస్థ ద్వారా టర్న్‌కీ అనే శేఖర్ రెడ్డి బినామీ కంపెనీకి కట్టబెట్టడం ద్వారా రాష్ట్రంలో భారీఎత్తున ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. దీనివల్ల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక విధానం ద్వారా రవాణా ఖర్చులతో 1500రూపాయలకు ట్రాక్టర్ ఇసుక ఇంటికి చేరగా, ప్రస్తుతం ట్రాక్టర్ ఇంటికి చేరాలంటే 6వేలరూపాయలు పలుకుతోంది. ఇష్టారాజ్యంగా ఇసుక ధరల పెంపువల్ల 125 వ్యాపారాలు, వృత్తులు దెబ్బతిన్నాయి. తద్వారా ఒక్క భవన నిర్మాణ కార్మికులే 40లక్షలమంది పనుల్లేక రోడ్డునపడ్డారు.
విశాఖ ఏజన్సీలో నిబంధనలు ఉల్లంఘించి లాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలు సాగిస్తూ రూ.15వేల కోట్లరూపాయల దోపిడీకి తెరతీశారు. అక్రమ మైనింగ్ కారణంగా కాలుష్యం పెరిగి మన్యంలో ఆదివాసీల జీవనం దుర్భరంగా మారింది. అక్రమ మైనింగ్ వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడిరది. రాష్ట్రంలో జగన్ రెడ్డి బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన సన్నిహితుడు మాచవరం సుధాకర్ ద్వారా గుజరాత్ లోని ముంద్రా పోర్టు నుంచి రూ.21వేల కోట్లరూపాయల విలువచేసే డ్రగ్స్ ను ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకోగా నిఘా అధికారులకు పట్టుకున్నారు. తప్పుడు సంపాదన కోసం యువత జీవితాలను నిర్వీర్యం చేస్తూ దేశద్రోహానికి ఒడిగట్టారు.
విశాఖ ఏజన్సీలో ముఖ్యమంత్రి జగన్ అంతరంగీకుడు, ఎ2 విజయసాయి రెడ్డి నేతృత్వంలో మాఫియా ఏర్పాటై 25వేల ఎకరాల్లో గంజాయి సాగుచేస్తూ 8వేలకోట్లరూపాయలు అక్రమసంపాదనకు తెగబడ్డారు. విచ్చలవిడిగా రాష్ట్రంలో గంజాయి సరఫరా చేస్తుండటంతో లక్షలాదిమంది విద్యార్థుల భవితవ్యం అంధకారంగా మారింది. ఎ2 విజయసాయిరెడ్డి విశాఖలో ల్యాండ్ మాఫియాకు కూడా నాయకత్వం వహిస్తూ పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. ఇటీవల చారిత్రక రుషికొండను నిబంధనలు ఉల్లంఘించి గుండుకొట్టించడంపై రాష్ట్రం ఉన్నత న్యాయస్థానం సైతం తీవ్రంగా స్పందించి రుషికొండలో అనుమతికి మించి అక్రమ తవ్వకాలు తేలితే జైలుకు వెళ్లకతప్పదని హెచ్చరించింది.
ప్రపంచంలోనే అరుదుగా సింహాచలం అడవుల్లో లభించే ఎర్రచందనాన్ని జగన్ అండో కో భారీఎత్తున పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ 25వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారు. సాక్షాత్తు రాష్ట్ర పంచాయితీరాజ్, అటవీ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్టీసి వైస్ చైర్మన్ జ్జానేందర్ రెడ్డి నేతృత్వంలో పెద్దఎత్తున ఎర్రచందనాన్ని చెన్నయ్ పోర్టు ద్వరా విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. పేదలకు అందాల్సిన నాణ్యమైన బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసి 4వేలకోట్లరూపాయల అవినీతికి తెరతీశారు.
రాష్ట్ర మాజీ పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని, ముఖ్యమంత్రి బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కలిసి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి విశాఖపోర్టు ద్వారా విదేశాలకు పంపి 4వేలకోట్లరూపాయల అవినీతికి పాల్పడ్డారు. తమ అవినీతి సంపాదన కోసం పేదల నోటికాడ కూడు లాగేశారు.
స్కాంల కోసమే స్కీంలు పెట్టారు. సెంటుపట్టా పేరుతో రూ.7వేల కోట్లు లూటీ చేశారు. అంబులెన్స్ ల పేరుతో రూ.307 కోట్లు కొట్టేశారు. బెంజి మంత్రి, హవాలా మంత్రి, పేకాట మంత్రిగా మారిపోయారు. మద్యం, ఇసుక, సిమెంటు, మైన్స్ లో లక్షకోట్ల ముడుపులు తాడేపల్లి ప్యాలెస్ పరమయ్యాయి. పెంచిన పన్నులు, ధరలు ప్రజల్ని కుంగదీస్తున్నాయి. ఇలా గత మూడేళ్లలో జగన్‌రెడ్డి అండ్‌కో 1.75లక్షల కోట్ల దోపిడీకి పాల్పడిరది. ఈ పాపిష్టి సొమ్ముతోనే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తన దోపిడీ ముఠాతో ఎన్నికలకు వెళ్లి మరోమారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు.
అవినీతి ప్రశ్నించే గళాల హత్య, తప్పుడు కేసులు
రాష్ట్రంలో గత మూడేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అవినీతిపై అలుపెరగని పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ కేడర్ ను వైసిపి గూండాలు హత్యలు, దౌర్జన్యాలకు తెగబడ్డారు. ఫలితంగా 37మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఒక్క పల్నాడులోనే పచ్చినెత్తురుతాగే నరరూప రాక్షసుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 12మంది టిడిపి కార్యకర్తలను పొట్టనబెట్టుకోగా, ప్రొద్దుటూరులో ఇళ్లపట్టాల కుంభకోణాన్ని ప్రశ్నించిన నందం సుబ్బయ్య అనే టిడిపి బిసి నేతను ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తమ గూండాలతో దారుణంగా నరికి చంపేశారు. 1500లకు పైగా టిడిపి కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, లోకేష్ ల మొదలు సోషల్ మీడియా కార్యకర్త సాంబశివరావు వరకు సిఐడితో తప్పుడు కేసులు బనాయించి గొంతునొక్కే ప్రయత్నం చేశారు.
జగన్ రెడ్డి అండ్ కో అవినీతి కారణంగా ప్రస్తుతం రాష్ట్ర అప్పు రూ. 8.29 లక్షలకోట్ల రూపాయలకు చేరి రాష్ట్రం శ్రీలంక పరిస్థితులకు చేరువగా ఉంది. వైసిపి ప్రభుత్వ దోపిడీ విధానాలపై ప్రజలు చైతన్యవంతులై ప్రశ్నించకపోతే రాబోయేరోజుల్లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పీల్చే గాలిపైన కూడా పన్నులేసి జనాన్ని జలగలా పీల్చడం ఖాయం.