- కృష్ణా బేసిన్‌లో వరద నీటి నిర్వహణ చేపట్టాలి
- అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేయాలి
- రవాణా శాఖలో అనవసర నిబంధనలు తీసేయాలి
- ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): ఎల్‌నినో పరిస్థితుల కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి సమస్యపై దృష్టిపెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రిజర్వాయర్లు, నీటి వనరుల్లో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. సచివాలయం ఆర్టీజీఎస్ సెంటర్‌లో సోమవారం వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్షించారు. ఎగువన వర్షాలు కురుస్తున్నం దున్న కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నా యని అధికారులు వివరించారు. కృష్ణానదిలో కొద్దిరోజులుగా నీటి ప్రవాహాలు మొదలైనట్లు వివరించారు. అలాగే గోదావరిలో వరద పరిస్థితిని వివరించారు. కృష్ణా బేసిన్‌లో ఎగువ నుంచి వచ్చే వరదను సద్వినియోగం చేసుకునేలా నీటి నిర్వహణ చేపట్టా లని సీఎం ఆదేశించారు. వర్షాభావం వల్ల రానున్నరోజుల్లో పశుగ్రాసం కొరత వచ్చే అవకాశం ఉందని…దీనికి అవసరమైన చర్య లు తీసుకోవాలని ఆదేశించారు.
మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో తరచూ తాగునీటి పరీక్షలు నిర్వహించాలని..ల్యాబ్ టెస్టుల నివేదికలను విడుదల చేయాలని సూచించారు. అధికారు లు క్షేత్రస్థాయిలో పర్యటించి అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేయాలని సీఎం ఆదేశించారు. రవాణ శాఖలో పూర్తిస్థాయి టెక్నాలజీ వినియోగం, అనవసర నిబంధనల తొలగింపు వంటి అంశాలకు తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. 24 గంటల్లో డీమ్డ్ రిజిస్ట్రేషన్ విధానం, ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్, ఫారం-5బీ వంటి పరీక్షలను తొలగించడం వంటి చర్యల ద్వారా అవినీతిని తగ్గించడం, సులభతర సేవలను అందించే అవకాశం కలుగుతుందని అధికారులు చెప్పారు. దశల వారీగా రవాణా శాఖలో ఈ సంస్కరణలు చేపట్టేలా తాము ప్రణా ళికను సిద్ధం చేశామని తెలిపారు. వీలైనంత మేరకు అనవసర నిబంధనలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచిం చారు. ఈ సమీక్షలో సీఎస్ సాయిప్రసాద్, వివిధ శాఖల ఉన్నతా ధికారులు పాల్గొన్నారు















