- మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానం
అమరావతి(చైతన్యరథం ముఖ్యమంత్రి చంద్రబాబును మంగళవారం డ్వాక్రా మహిళలు కలిశారు. సెర్ఫ్ సీఈవో వాకాటి కరుణ నేతృ త్వంలో డ్వాక్రా మహిళలు సీఎంను క్యాంప్ కార్యాలయంలో కలిసి 13వ తేదీ మంగళవారం నుంచి జరిగే సరస్ మేళాకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా తాము తయారుచేసిన ఉత్పత్తు లను సీఎంకు చూపించారు.
మంత్రి లోకేష్ కు ఆహ్వానం
విజయవాడ పున్నమి ఘాట్లో ఈ నెల 13 నుంచి 31వ తేదీ వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జాతీయ సరస్ మేళాకు హాజరుకావాలని మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానం పలికారు. ఈ మేరకు సెర్చ్ సీఈవో వాకాటి కరుణ, మెప్మా ఎండీ జి. బాలకృష్ణ, దేశంలోని పొదుపు సంఘాల మహిళల తరపున ఎన్టీఆర్ జిల్లా డీఆర్డీఏ సమాఖ్యఅధ్యక్షులు కల్పన తదితరులు ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ను కలిసి పత్రికను అందజేశారు. జాతీయ సంస మేళా మొట్టమొదటిసారిగా విజయవాడలో జజరగనుంది. ఈ మేళాలో అన్ని రాష్ట్రాల నుంచి వారి స్థానిక ఉత్పత్తుల ప్రదర్శన, విక్ర యాలు ఇజరుగుతాయి. ఈ నెల 15వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఈమేళా ప్రారం భం కానుంది. మంత్రి లోకేష్ను ఆహ్వానించిన వారిలో ఎన్టీఆర్ జిల్లా డీఆర్డీఏ జిల్లా సమాఖ్య ఉపాధ్యక్షురాలు ఎన్.బేబీ, కార్యదర్శి బి. రామలక్ష్మి, కోశాధికారి సీహెచ్ హైమావతి ఉన్నారు.














