- ఏడాదికి రూ.25 వేలు సాయం
- రెండోదశ 3,168 ఉద్యోగాల భర్తీకి మరింత అధ్యయనం
- గోదావరి పుష్కరాల కోసం భద్రతా ఏర్పాట్లకు రూ.50 కోట్లు
- 1800 మెగావాట్ల భారీ విద్యుత్ ప్రాజెక్టుకు నెడ్ క్యాప్కు భూముల కేటాయింపు
- టూరిజం ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ స్థలాలు
- కుప్పంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు
- 25కు పైగా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గం భేటీ
అమరావతి(చైతన్యరథం): ఏపీ క్యాబినెట్ సమావేశం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగింది. ఉద్యోగాల కల్పన, సంక్షేమం, విద్య, నీటిపారుదల రంగాల వంటి కీలక అంశాలకు ఆమోదం తెలపటమే అజెండా గా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండో దశలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై చర్చించింది. దీనిపై మరింత అధ్యయనం తరువాత ఉద్యోగాల భర్తీపై మంత్రివర్గ ఉపసంఘం తదుపరి భేటీలో చర్చకు సీఎం నిర్ణయం నిర్ణయించారు. ‘నేతన్న భరోసా’ కింద 50 ఏళ్లలోపు బీపీఎల్ చేనేత కుటుంబాలకు ఏటా రూ.25 వేల ఆర్థికసాయం ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భుజానికి శస్త్రచికిత్స కారణంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకాలేదు. దాదాపు 25కు పైగా అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జాబ్ క్యాలెండర్ 2026-27లో భాగంగా రెండో దశ కింద 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తదుపరి భేటీలో చర్చకు సీఎం నిర్ణయించారు. బాపట్ల జిల్లా వెదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రభు త్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గోదావరి పుష్కరాల కోసం భద్రతా ఏర్పాట్లకు రూ.50 కోట్లు మంజూరు చేసింది.
1800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు భూములు
అగ్నిమాపక శాఖ ఆధునికీకరణకు ఆమోదం లభించింది. పరిశ్రమలు, విద్య, మౌలిక సదుపాయాలకు ఊతమిస్తూ వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, ఏపీ మార్ఫెడ్కు రూ.300 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చింది. విష్ణు ఉమెన్స్ యూనివ ర్సిటీ, చలపతి యూనివర్సిటీలను ప్రైవేట్ యూనివర్సిటీల జాబితాలో చేర్చే ఆర్డినెన్స్ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీటిపారుదల రంగంలో నేరడి బ్యారేజ్ నిర్మాణానికి రూ.641 కోట్ల పరిపాలనా అనుమతి, హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్-2 పనుల వ్యయాన్ని రూ.312 కోట్లకు పెంచే
ప్రతిపాదనలకు ఆమోద ముద్ర పడింది. విశాఖలో ఏఐజీ సంస్థ ఆధ్వర్యంలో నర్సింగ్, అలైడ్ హెల్త్ సైన్సెస్ కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణానికి భూ కేటా యింపులు చేశారు. నంద్యాల జిల్లాలో ఏఎం గ్రీన్ సంస్థ ఆధ్వర్యం లో 700 మెగావాట్ల సోలార్, 300 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుల స్థాపనకు రెండు విడతల్లో భూములు కేటాయించారు. గండికోట పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు పరిధిలో అదానీ సంస్థ నిర్మిస్తున్న
1800 మెగావాట్ల భారీ విద్యుత్ ప్రాజెక్ట్ పనుల కోసం నెడ్క్యప్కు భూములు కేటాయించారు. కుప్పంలో శ్రేష్ఠ రెన్యూవ బుల్స్ ఆధ్వర్యంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు, నంద్యాలలో ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ మినీ హైడల్ ప్రాజెక్టుకు 33 ఏళ్ల లీజుపై భూములిస్తూ క్లియరెన్స్ ఇచ్చారు.
పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ స్థలాల బదిలీ
పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా ఏపీ టూరిజం అథారిటీకి కీలక భూ బదిలీలు జరిగాయి. చిత్తూరు, కాకినాడ నగరాల్లో వరల్డ్ క్లాస్ రిసార్ట్స్, స్టార్ హోటళ్లు, సరికొత్త టూరిజం ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాలను బదిలీ చేస్తూ మంత్రివర్గం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. విజయనగరంలో యశశ్రీ విరోహా ఇంపెక్స్ సంస్థ ఆధ్వర్యంలో “రద్దీస్ రీజెనరేటివ్ హబ్” పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. పుట్టపర్తి లో ఎస్ఎస్ఎస్ ఏరోస్పేస్ ప్రాజెక్టు స్థాపన కోసం శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ భూములపై ఉన్న 76.13 ఎకరాల నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశంలో ల్యాండ్ పూలింగ్ రైతులకు న్యాయం చేయడంతో పాటు పలు
మౌలికవసతుల ఒప్పందాలకు సవరణలు చేశారు. అనకాపల్లి ల్యాండ్ పూలింగ్లో భాగంగా చెర్లపాలి ఖండం రైతులకు 1,800 చదరపు గజాలు లేఅవుట్ డెవలప్ చేసిన ప్లాట్లను పరిహారంగా ఇవ్వనున్నారు. విజయవాడ జెట్ సిటీ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లో స్థలాల కేటాయింపులకు ఆమోదం తెలిపారు. ఇండస్ట్రియల్ పార్కుల వేగవంతం కోసం ఏపీఐఐసీ-ఎన్ఐసీడీఐట మధ్య జరిగిన ఒప్పందాన్ని
సవరించారు.
మంత్రులు ప్రో-యాక్టివ్గా ఉండాలి
క్యాబినెట్ సమావేశంలో మంత్రులకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఎల్సినోను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై సమీక్ష నిర్వహించారు. ఎల్నినో పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలని చెప్పారు. తాగునీటి సరఫరా, పశువులకు మేతపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రులు, అధికారులకు సూచించారు. మెగా డీఎస్సీ అంశాన్ని ఢిల్లీలో జరుగుతున్న ఆందో ళనలతో ముడిపెట్టి వైసీపీ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్ని స్తోందని వ్యాఖ్యానించారు. లేని వివాదాలను సృష్టించే ప్రయత్నాలు జరుగుతాయని, అలాంటి చర్యలపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొగాకు ధరల అంశాన్ని సమావేశంలో మంత్రులు ప్రస్తావించారు. ఈ అంశాన్ని వివాదా స్పదం చేసేం దుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని మంత్రులు చెప్పగా.. వాళ్లకు ఎందుకు అవకాశం ఇవ్వాలని సీఎం ప్రశ్నించారు. ప్రభుత్వం పొగాకు రైతుల కోసం తీసుకున్న చర్యలను ప్రజలకు ముందుగానే వివరించాలని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజల కు ముందే తెలియజేస్తే ప్రతిపక్షానికి అవకాశం ఉండదని, ప్రో-యాక్టివ్గా మంత్రులు ముందుకెళ్లాలని స్పష్టం చేశారు.















