చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

చేనేతకు కొత్తఊపిరి!

భువనమ్మకు రెండు చీరలు కొన్న చంద్రబాబు

by చైతన్యరధం
Aug 8, 2024 at 7:31am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
చేనేతకు కొత్తఊపిరి!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నెలలో ఒక్కరోజైనా నేత వస్త్రాలు ధరించండి
  • నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత నాది
  • చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దుకు ప్రయత్నిస్తా..
  • చేనేతల ఇళ్లకు సౌరవిద్యుత్‌ సదుపాయం
  • ప్రోత్సాహకాలు రద్దుచేసి కడుపుకొట్టింది వైసీపీ
  • ఐదేళ్ల పాలనలో ఏ శాఖలో చూసినా విధ్వంసమే..
  • చేనేత జాతీయ దినోత్సవంలో వరాలిచ్చిన సీఎం
  • భువనమ్మకు రెండు చీరలు కొన్న చంద్రబాబు

విజయవాడ (చైతన్య రథం): నెలలో ఒకరోజు ప్రజలంతా చేనేత దుస్తులు ధరించి నేత కార్మికుల ప్రగతికి తోడ్పాటునివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడ మేరీస్‌ స్టెల్లా కళాశాలలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో చేనేత వస్త్రాల మాల్‌ను సందర్శించి, కార్మికుల ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘టీడీపీ ఆవిర్భావం నుంచీ అన్నివేళలా చేనేతలు అండగా నిలిచారు. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించడం నా బాధ్యత. మా ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా ఉంటుంది. నాడు స్వాతంత్య్రోద్యమంలో స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించడం ఒక ఉద్యమంలా సాగి, అంతిమంగా క్విట్‌ ఇండియా ఉద్యమానికి దారితీసింది.

2015లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నాడు సీఎంగా ఉన్న నేను చేనేత అంతర్జాతీయ దినోత్సవానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో చేనేత కార్మికులందరికీ భరోసా కల్పిండం కోసం నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. గత ప్రభుత్వం నేతన్న నేస్తం అని చెప్పి నేత కార్మికుడికి రూ.24 వేలు ఇచ్చేసి.. దాంతోనే అంతా బాగుపడిపోతారని అనుకున్నారు. మీకు రావాల్సిన అన్ని రకాల పథకాలను రద్దు చేశారు. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాల కొనుగోళ్లు ఆపేశారు. నూలు, రంగులపై ఇచ్చే రాయితీలు తీసేశారు. అన్ని రకాల రుణాలు తీసేసి చేనేత కార్మికులు పొట్టగొట్టారు. గత ప్రభుత్వం పోతూపోతూ చేనేత రంగానికి, కార్మికులకు రూ.266 కోట్లు అప్పు పెట్టి వెళ్లిపోయింది’ అని సీఎం విమర్శించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-06-2026

చైతన్యరధం ఈ పేపర్ 15-06-2026

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

రుణ మాఫీ చేసి ఆదుకున్నాం
చరిత్ర ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని, టీడీపీ అధికారంలోవున్నా, ప్రతిపక్షంలోవున్నా చేనేత కార్మికుల కోసం అవిశ్రాంత పోరాటం చేసిందన్నారు. 2007లో చేనేతలకు రూ.372 కోట్ల రుణాలు మాఫీ చేయకుండా ఆనాటి ప్రభుత్వం మోసం చేస్తే పోరాడామన్నారు. ఆ పోరాటాల ఫలితంగా 2009లో అప్పటి సీపం రోశయ్య రూ.109 కోట్లు రుణాలు మాఫీ చేశారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే చేనేతలకు రూ.110 కోట్లు రుణాలు మాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. 2014లో చేనేతలకు రూ.250 కోట్లు బడ్జెట్‌ కేటాయించామని, 90,795 చేనేత కుటుంబాలకు వంద యూనిట్లు విద్యుత్‌ ఉచితంగా ఇచ్చామని గుర్తు చేశారు. చేనేత కార్మికులకు చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిసీ 50 ఏళ్లకే పింఛన్లు ఇచ్చిన ఘనత టీడీపీదేనన్నారు. నూలు, రంగులపైన సబ్సిడీ 20 శాతంవుంటే దాన్ని 40 శాతానికి పెంచామని, మగ్గాలపై 50 శాతం రాయితీ ఇచ్చి రూ.80 కోట్లు ఖర్చు చేశామన్నారు. 70 వేలమంది చేనేత కార్మికులకు మోటరైజ్డ్‌ జకార్డ్‌ లిఫ్టింగ్‌ సదుపాయం కల్పించామన్నారు. చేనేత పరిశ్రమపట్ల, చేనేతలపట్ల తెలుగుదేశం పార్టీ శ్రద్ధకు ఇది నిదర్శనం అన్నారు. చేనేతలకు ఇచ్చిన అన్ని హామీలు నిలబెట్టుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం
రాష్ట్రంలో బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. బీసీల్లో చాలా ఉప కులాలున్నాయని, వారంతా వెనుకబడి ఉన్నారని, ఎక్కువమంది కుల వృత్తులపైనే ఆధారపడి జీవిస్తున్నారని, వారందర్నీ ఆదుకుంటామన్నారు. బీసీ సబ్‌ ప్లాన్‌ ద్వారా రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని, తద్వారా బీసీ జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. స్థానిక సంస్థల్లో మళ్లీ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తామన్నారు. చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, ఇది పార్లమెంటులో చట్టమయ్యేంత వరకూ బీసీల తరఫున పోరాటం చేస్తామని తెలిపారు. నామినేటెడ్‌ పోస్టుల్లో కూడా బీసీలకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష, అసెంబ్లీ స్పీకర్‌ ఇద్దరూ బీసీలేనని గుర్తు చేశారు.

ఎక్కడ చూసినా విధ్వంసమే
చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతలకు ఎన్నో చెప్పాలని అనుకున్నానని, అడిగినదానికంటే ఎక్కువ ఇవ్వడం తన స్వభావమన్నారు. కానీ గత రెండు నెలలుగా ప్రభుత్వాన్ని చూస్తుంటే బాధేస్తోందని చెప్పారు. రాష్ట్ర ఖజానాను గత ప్రభుత్వం దివాలా తీయించిదన్నారు. రూ.10లక్షల కోట్లు అప్పు పెట్టిందని, దానికి వడ్డీ, అసలు చెల్లించడానికే యేటా రూ.80వేల కోట్లు కావాలన్నారు. ఎక్కడ చూసినా విధ్వంసం, వ్యవస్థలను సర్వనాశనం చేశారన్నారు. ప్రభుత్వంలో ఇప్పుడు చూస్తున్న ఇబ్బందులను తన అనుభవంలో ఎన్నడూ చూడలేదన్నారు. అయినా సరే ఇబ్బందులున్నాయని వెనుకడుగు వేయబోయమన్నారు. సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం తొలి రోజే ఐదు హామీల అమలుపై సంతకాలు చేశానని తెలిపారు. 65 లక్షల మందికి ప్రతి నెలా రూ.2,737 కోట్లు పింఛన్లు చెల్లిస్తున్నామని, రాబోయే ఐదేళ్లలో పింఛన్ల కిందే ప్రభుత్వం రూ.1.65 లక్షల కోట్లు పంపిణీ చేయబోతోందన్నారు.

ఆప్కో బకాయిలు చెల్లిస్తాం..
రాష్ట్రంలో 100 ఆప్కో షోరూములున్నాయని, గత ప్రభుత్వం పెట్టిన ఆప్కో బకాయిలు కూడా త్వరలో చెల్లిస్తామన్నారు. చేనేతల ప్రతి ఇంటికి సౌర విద్యుత్తు సదుపాయం కల్పిస్తామన్నారు. చేనేత కార్మికులకు పైసా ఖర్చుకాకుండా పీఎం సూర్యఘర్‌ పథకం కింద కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. అవసరాలకు పోను మిగిలిన విద్యుత్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. అన్నివేళలా తనకు పార్టీకి అండగా ఉన్న చేనేత కార్మికులు తన ఆత్మబంధువులన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ భారంగా ఉందని, దాన్ని తొలగించాలని చేనేత కార్మికులు కోరుతున్నారని, కేంద్రం, జీఎస్టీ కౌన్సిల్‌లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి జీఎస్టీ తొలగించేలా చేస్తామన్నారు. ఒకవేళ కేంద్రం జీఎస్టీ తొలగించడానికి ముందుకు రాకపోతే చేనేతలు చెల్లించే జీఎస్టీ మొత్తాన్ని వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వమే రియింబర్స్‌ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా చేయిస్తామని, దానికి రూ.10కోట్లు అవసరమవుతుందని అధికారులు అంటున్నారని, ఈ కార్యక్రమం కూడా చేపడతామన్నారు. రాష్ట్రంలో 64 చేనేత క్లస్టర్ల అభివృద్ధికి సమగ్ర విధానం తెస్తామన్నారు. 92,724 మంది చేనేతలకు 50 ఏళ్లకే పింఛను అందిస్తున్నామన్నారు.

రాష్ట్రానికి సీఎం అయినా.. భువనమ్మకు భర్తే
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మేరీస్‌ స్టెల్లా కాలేజీలో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శనను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. స్టాళ్లలో ఉత్పత్తులను పరిశీలించి చేనేతలతో మాట్లాడారు. చేనేతను ప్రోత్సహించాలని పిలుపునిచ్చిన చంద్రబాబు `తన సతీమణి భువనేశ్వరికి ఉప్పాడ, వెంకటగిరి చీరలు కొనుగోలు చేశారు. చీరల గురించి అడిగి తెలుసుకుని మరీ కొనుగోలు చేయడం ఆసక్తికర అంశం. ‘నా భార్యకు నాఅంతట నేను ఎప్పుడూ చీరలు కొనలేదు. ఎందుకో ఇక్కడికి రాగానే ఆమె గుర్తుకొచ్చి రెండు చీరలు కొనాలనిపించింది’ అని చంద్రబాబు వ్యాఖ్యానించి నేతనల్లో ఆనందం నింపారు. తాను ఎమ్మెల్యే అయినప్పుడు పొందూరు ఖద్దరు బాగా ఇష్టపడేవాడినని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం విశేషం.

త్వరలో చేనేత సహకార సంఘాల ఎన్నికలు
రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాల పాలకమండళ్ల కాల పరిమితి ముగుస్తోంది. త్వరలోనే వాటికి ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడిరచారు. అయితే చేనేతరంగ అభివృద్ధి కోసం మేలు చేసేవారినే సభ్యులుగా ఎన్నుకోవాలని కార్మికులకు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆలోచన తీరు మారుతోందని, ఒకప్పడు అందరూ ఇండస్ట్రియల్‌ కాటన్‌ దుస్తులు ధరించేవారని, ఇప్పుడు ఖద్దరు, చేనేత దుస్తులు ధరించాలని ముందుకొస్తున్నారని.. దీన్ని ఒక అవకాశంగా తీసుకుని సరైన డిజైన్లు రూపొందించి ప్రతిభ నిరూపించుకుని అధిక ఆదాయం పొందే స్థితికి చేరుకోవాలన్నారు. చేనేత పరిశ్రమకు చేయూతనిచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Previous Post

డొక్కా సీతమ్మ దాతృత్వం భావితరాలకు తెలియాలి

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 07-08-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-06-2026

కార్యకర్త
@ June 16, 2026
చైతన్యరధం ఈ పేపర్ 15-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-06-2026

కార్యకర్త
@ June 15, 2026
విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం
ఆంధ్రప్రదేశ్

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు
ముఖ్య వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!
ఆంధ్రప్రదేశ్

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్
ఆంధ్రప్రదేశ్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
ఆంధ్రప్రదేశ్

సింగపూర్‌కు సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ June 15, 2026
Load More

ముఖ్య వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

చైతన్యరధం
@ June 14, 2026
ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

చైతన్యరధం
@ June 13, 2026
ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

చైతన్యరధం
@ June 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist