- భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ ఖరారు
- బీ ఫారాలు అందజేసిన సీఎం చంద్రబాబు
- రేపు నామినేషన్లు వేయనున్న అభ్యర్థులు
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి టీడీపీ అభ్యర్థుల కసరత్తు కొలిక్కి వచ్చింది. పార్టీ తరపున పార్లమెంట్ ఎగువ సభకు పంపే ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ అధిష్ఠానం శనివారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. పార్టీ పట్ల అంకితభావం, సామాజిక సమతుల్యతతో పాటు యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తూ వారిని ఎంపిక చేసినట్టు పార్టీ స్పష్టం చేసింది. భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు బి.ఫారాలు అందజేశారు. వీరు సోమవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.















