సెయింట్ పీటర్స్ బర్గ్ (రష్యా): సెయింట్ పీటర్స్ బర్గ్ గవర్నమెంట్ రీజనల్ ఫారిన్ ఎఫైర్స్ విభాగం చీఫ్ ఎక్స్పర్ట్ పోలినా పోలుఖినాతో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సేఫ్ & స్మార్ట్ సిటీ కోసం పౌరులతో చర్చలు, డేటా ఆధారిత నగర నిర్వహణ, డిజిటల్ ఎడ్యుకేషన్, విశ్వసనీయ మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. పోలినా పోలుఖినా మాట్లాడుతూ… డిజిటలైజేషన్ ద్వారా సెయింట్ పీటర్స్బర్గ్ ఖర్చును తగ్గించి రెండు లక్షల పని గంటలను ఆదా చేసిందని చెప్పారు. సెయింట్ పీటర్స్ బర్గ్ లో అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – సెయింట్ పీటర్స్బర్గ్ గవర్నమెంట్ మధ్య ఒక వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దాలని తాము కృతనిశ్చయంతో ఉన్నామని, ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే వేగవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు.















