- నాడు పార్లమెంట్లో లో అనుకూలంగా ఓటు
- నేడు రాజధానిపై విషప్రచారం తగునా..
- నాగరికత గురించి ముందు తెలుసుకోండి
- ప్రజల మధ్య చిచ్చు పెట్టే చర్యలను మానుకోండి.
- మళ్లీ అడ్డుకోవాలని చూస్తే మొట్టి కాయలే
- టీడీపీ పొలిటబ్యూరో సభ్యులు వర్ల రామయ్య
మంగళగిరి(చైతన్యరథం ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొంటే అదే రాజధాని అని జగన్ వ్యాఖ్యానించడం అతని అవగాహన రాహిత్యానికి నిదర్శనమని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “అమరావతి” అనే పేరు పలకడానికి జగన్ మనసు పూర్తిగా అంగీకరించడం లేదు.. జగన్ వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రజలతో పాటు సాక్షి విలేకరులు సైతం నవ్వు తున్నారని వ్యాఖ్యానించారు. 2014 మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు జగన్ కాంగ్రెస్ ఎంపీగా రాజధానికి అనుకూలంగా ఓటు వేశారని పేర్కొ న్నారు. నాడు సోనియాగాంధీ సమక్షంలో అనుకూలంగా ఓటు వేసి.. నేడు వ్యతిరేకించడం దారుణమని పేర్కొన్నారు. “ఆంధ్ర ప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్టు చట్టం చేసి అందులో సెక్షన్ 5(2) ప్రకారం కొత్త రాజధాని ఉండాలని, అంతవరకు సెక్షన్ 5(1) ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని అందులో సారాంశమని తెలిపారు. సెక్షన్ 6 ప్రకారం రాజధానికై “ఎక్స్పర్ట్ కమిటీ” కేంద్రమే వేసిందని పేర్కొన్నారు. ఆరు నెలల్లో నూతన రాజధాని నిర్ణయించుకోవాలని ఆ కమిటీ సూచించిందని పేర్కొన్నారు. సెక్షన్ 94(3) ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మా ణానికి పూర్తిగా సహకరించాలని పేర్కొన్నారు. అందులో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం గురించి స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. అదే చట్టంలో రాజధాని నిర్మాణం కోసం అవసరమైతే అటవీ భూములను కూడా ” డీ
నోటిఫై” చేసి రాజధాని ఏర్పాటు చేసుకో వచ్చని చెప్పినట్లు గుర్తు చేశారు. తల లేనిదే మనిషి లేడు.. రాజధాని లేనిదే రాష్ట్రం లేదని జగన్ గ్రహించాలని సూచించారు. అమరావతిపై ఆయనకు అంత ద్వేషం ఎందుకో అర్థం కావడం లేదన్నారు. జగన్ కావాలనే కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని సూచిస్తున్నారని పేర్కొన్నారు.
అమరావతి 175 నియోజకవర్గాల అభివృద్ధి
రాజధాని అమరావతి ” సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధాని “రైతులు ఇచ్చినా భూములే రాజధాని నిర్మాణానికి పెట్టుబడులని తెలిపారు. రాష్ట్రమంతా వదిలి అమరావతికి మాత్రమే రూ.3 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారనే జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. జగన్ కావాలనే మిగతా జిల్లాల ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తు న్నారని ఆరోపించారు. అమరావతి అభివృద్ధితో రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర యువతకు కల్ప తరువుగా మారుతుందని వ్యాఖ్యానించారు. రేపటి రాష్ట్ర ప్రగతికి కామ ధేనువుగా మారుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చంద్రబాబు, లోకేష్ నిరంతరం శ్రమిస్తు న్నారని గుర్తు చేశారు. రాజధాని అంశం గురించి వైసీపీ పార్టీలో ఉన్న బుగ్గనా, అంబటి రాంబాబు లాంటి ఉన్నత చదువులు చది విన వాళ్లు ముందుకు వచ్చి మాట్లాడాలని సూచించారు. జగన్ భారత రాజ్యాంగంపై పూర్తిగా చదివి అవగాహన చేసుకుని మాట్లాడని సూచించారు. రాజ్యాంగంలో రాజధాని ప్రస్తావన లేదనడం జగన్ అమాయకత్వాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలో పొందుపరచని అంశాలు, పార్ల మెంట్ పరిధిలోకి వస్తాయని జగన్ తెలుసుకోవాలని సూచించారు. జగన్ విధానాలు పిచ్చి తుగ్లక్ మాదిరి ఉన్నాయని ఆక్షేపించారు.
నాగరికతలు ఎక్కడ వెలిశాయో జగన్ తెలుసుకోవాలి
అమరావతి కృష్ణా నది తీరాన్నా నిర్మిస్తున్నారని అంటున్న జగన్.. ప్రపంచ నాగరికతలు ఎక్కడ వెలిశాయో తెలుసుకోవాలని హితవు పలికారు. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీ-యమునా, కోల్ కత్తా- హుగ్లీ, పాట్న- గంగా, హైదరాబాద్ మూసి నది ఒడ్డునే నిర్మించారనే వాస్తవం తెలుసుకోవాలన్నారు. అలానే లండన్ లాంటి ప్రఖ్యాత నగరాలు కూడా నది తీరాన్నే అభివృద్ధి చెందినట్లు గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి జగన్ ఆయన బృందం రాచ పుండు మాదిరిగా తయారయ్యారని విమర్శించారు.
అమరావతి రైతులపై దాడులు మరిచిపోలేదు
అమరావతి ఉద్యమంలో గర్భిణిని పొత్తి కడుపులో ఎగిరి బూటు కాళ్లతో తన్నించిన నీచ చరిత్ర వైసీపీ పార్టీదని మండిప డ్డారు. అలాంటి పార్టీకి రాష్ట్ర ప్రజలు ఓటు వేసి కొరివితో కోరి తల గోక్కుంటారా అని వ్యాఖ్యానించారు. జగన్ అధికారంలోకి వస్తాననడం కల అని.. ఈ సారి వచ్చిన ఆ 11 సీట్లు కాస్తా సున్నా సీట్లకు పడిపోవడం ఖాయమని జోస్యం చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశంలో అమరావతి చట్ట బద్ధ హెూదా వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రులు గర్వించే రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అమరావతికి వ్యతిరేకంగా 2015లోనే సుప్రీంకోర్టుకు వెళ్లి మొట్టికాయలు తిన్న జగన్.. మరలా ఇప్పుడు అమరావతిపై కోర్టుకు వెళ్తే.. మళ్లీ జగన్కు మొట్టి కాయలే మిగులుతాయని దుయ్యబట్టారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని తెలిసిన తరువాత, బ్యాంక్ గ్యారెంటీ కేంద్రం ఇస్తుండగా.. జగన్ ప్రపంచ బ్యాంక్కు తప్పుడు ఉత్తరాలు రాయ డం ఇకనైనా మానుకోవాలని హితవుపలికారు. ఒక్కసారి జగన్ అతని బృందం అమరావతి రాజధానిలో జరుగుతున్న వివిధ పను లు సందడి వచ్చి చూడాలి.. పనుల తీరు చూసిన తరువాత జగన్ వ్యాఖ్యానిస్తే మంచిదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రప్పా రప్పా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వీధి రౌడీ మాదిరి జగన్ కాంట్రాక్టరులను బెదిరిస్తున్నారని విమర్శించారు. పీపీపీ మోడల్ లో వైద్య కళాశాలలు నిర్మిస్తే ఏ యాక్ట్ ప్రకారం కాంట్రాక్టరులను జైలకు పంపిస్తాడో చెప్పాలన్నారు. జగన్ బెదిరింపులకు భయపడే స్థితిలో ఎవరూ లేరని హితవుపలికారు.














