- ఆయన కట్టుకథలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు
- గతం మరిచి మద్యంపై పిచ్చి ప్రేలాపనలు
- జగన్ హయాంలో కల్తీ మద్యానికి 30 వేల మంది బలి
- మెడికల్ కాలేజీలనూ అడ్డుకుంటున్న జగన్ రెడ్డి
- పీపీపీకి ప్రైవేటైజేషన్కు తేడా తెలియని జగన్
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధ్వజం
జగన్రెడ్డి అబద్ధాల కథలను నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. అబద్ధం, అవినీతి కలిస్తే జగన్రెడ్డి అనే విషయం సాక్ష్యాధారా లతో సహా బట్టబయలు అయింది.. కళ్లు పొడుచు కున్నా భవిష్యత్తు కనిపించని గాఢాంధకారంలో చిక్కు కున్న జగన్, ఏ అబద్ధం అన్నా రక్షించలేకపోతుందా అనే ఆశతో అబద్ధాల తుపానులో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కల్తీ మద్యం, మెడికల్ కాలేజీల విషయంలో ప్రజలను మభ్యపెట్టేం దుకు జగన్రెడ్డి మరోసారి అబద్ధాలనే నమ్ముకుని దుష్ప్రచారం చేస్తున్నారని పల్లా మండిపడ్డారు. ప్రజల కంటే ప్రతిపక్ష హెూదా ముఖ్యమంటూ అసెంబ్లీకి రాని పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదు. జగన్ రెడ్డి చేష్టలకు గురివిందలు కూడా సిగ్గుపడుతున్నాయి. ప్రజలు ఛీ కొట్టినా అబద్ధాలు వల్లె వేయడంలో జగన్ ఏ మాత్రం తగ్గడం లేదు. కేవలం అబద్ధాలు చెప్పడానికే నెలకొకసారి తాడేపల్లి ప్యాలెస్ లో వైసీపీ నేతలతో జగన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేస్తున్నాడు. జగన్ రెడ్డి అబద్ధాలను వైసీపీ నాయకులే ఛీ కొడుతున్నారు. మంగళవారం తాడేపల్లి ప్యాలెస్లో ఏర్పాటు చేసిన వైసీపీ సమావేశంలో అబద్ధాలే అజెండాగా జగన్ మాట్లాడం సిగ్గుచేటు. జగన్ రెడ్డి పాలనలో కల్తీ మద్యం తాగి నరాల వ్యాధి, కిడ్నీ వ్యాధులు, కాలేయ వ్యాధులకు గురై 30వేల మంది పేదలు మరణించారు.
అలాగే విషపూరిత మద్యంవల్ల రాష్ట్రవ్యాప్తంగా 35లక్షల మంది ఆరోగ్యాల దెబ్బతిన్నాయి. జే బ్రాండ్ల మద్యంలో విషపూరిత పదార్థాలు ఉన్నట్టు చెన్నై, బెంగళూరుతోపాటు అమెరికాలోని ప్రముఖ ల్యాబ్ లు నిర్ధారించాయి. జే బ్రాండ్ మద్యంతో పేదల ప్రజల ప్రాణాలు తీసిన జగన్ అండ్ కో నేడు మద్యంపై మాట్లాడటం సిగ్గుచేటు. కమీషన్లకు కక్కుర్తిపడి నాసిరకం మద్యం అమ్మి మహిళల తాళిబొట్లు తెంచింది మీరు కాదా? 5 ఏళ్లపాటు మద్యం పాపుల్లో డిజిటల్ పేమెంట్లు లేకుండా చేసి వేల కోట్లు దోచుకున్నారు. వైసీపీ హయాంలో రూ.3,500 కోట్ల కుంభకోణం జరిగినట్టు సిట్ నిర్ధారించింది వాస్తవం కాదా? జగన్ రెడ్డి మద్యం రేట్లను 150 శాతానికి పైగా పెంచి తాడేపల్లి ప్యాలెస్ ఖజానా నింపుకున్నాడు. జగన్ రెడ్డి హయాంలో మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్లు లేకుండా 99.38 శాతం కేవలం నగదు లావాదేవీల ద్వారానే జరిపారు. ఐదు సంవత్సరాల పాటు మద్యంలో నాణ్యతను గాలికి వదిలేసి నేడు సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నాడు. వైసీపీ హయాంలో కల్తీ మద్యం కారణంగా జంగారెడ్డి గూడెంలో ఏకంగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని పూర్తిగా నిషేధించాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఈ ఎన్ఏ్న 13 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం. విస్కీ, బ్రాందీ, జిన్, వోడ్కాను 9 రకాలుగా పరీక్షిస్తున్నాం. రమ్ 9 రకాల పరీక్షలు, బీర్ ఏడు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం. శాంపిల్ పరీక్షలను ముడి సరుకు, బ్లెండ్, బాటిలింగ్ సహా డిపోల్లో కూడా చేస్తున్నాం. మద్యం ఏ స్థాయిలో కూడా కల్తీ అయ్యేందుకు ఆస్కారం లేకుండా డిస్టిలరీలు, డిపోలు, మద్యం షాపులు, బార్లలో కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, శాంపిళ్లను సేకరించి పరీక్షిస్తున్నామని పల్లా స్పష్టం చేశారు.
మెడికల్ కాలేజీలను అడ్డుకుంటున్న జగన్ రెడ్డి
జగన్ అసమర్థ పాలన వల్ల రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలకు గ్రహణం పట్టింది. కేంద్ర ప్రభుత్వం పార్వతీపురం జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేస్తే ఐదేళ్లలో కనీసం భూసేకరణ కూడా చేయలేని జగన్.. ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. పాడేరులో మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తి చేసింది. ఇప్పుడు మెడికల్ కాలేజీల పర్యటనలు అంటూ జగన్ కొత్త డ్రామాకు తెరలేపాడు. జగన్రెడ్డి చేసిన పాపాలు మెడికల్ కాలేజీలకు శాపాలుగా మారాయి. పీపీపీకి ప్రైవేటైజేషన్కు తేడా తెలియకుండా జగన్ మాట్లాడు తున్నాడు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఉత్తరాంధ్ర మెడికల్ కాలేజీలకు జగన్ పాలన 5 ఏళ్లలో రూ.200కోట్లు కూడా ఖర్చు చేయలేదు కానీ… రుషికొండ ప్యాలెస్ కు మాత్రం రూ.500కోట్లు ఖర్చు పెట్టింది నిజం కాదా? జగన్రెడ్డి విలాసాలపై చూపిన శ్రద్ధ వైద్య కళాశాలల నిర్మాణంపై చూపలేదు. వివేకానందరెడ్డిని హత్యచేసి నెత్తుటి మరకలు తుడిచేసి, సాక్ష్యాధారాలను చెరిపేసి, శవానికి కుట్లువేసి ఆయన మరణానికి కారణం గుండెపోటు అని ప్రచారం చేసిన జగన్నాటక సూత్రధారులు.. మెడికల్ కాలేజీలు కట్టకుండానే కట్టినట్లు ప్రచారం చేసి ప్రజలను నమ్మించాలని చూడటంలో ఆశ్చర్యం ఏముంది? జగన్ రెడ్డి ఎన్ని అబద్ధాల కథలు చెప్పినా మరోసారి నమ్మడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని పల్లా తేల్చిచెప్పారు.