సిఎం జగన్ కు కళ్ల ముందు తన దారుణ ఓటమి కనిపిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. జగన్ ప్రజా విశ్వాసం కోల్పోయాడని…చివరికి సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా ప్రజలు అసంతృప్తితో ఉన్నారని లోకేష్ అన్నారు. కడప జిల్లా లో, పులివెందులలో జగన్ పునాదులు కదులుతున్నాయని….ఈ ఫ్రస్టేషన్లోనే జగన్ అక్రమ కేసులతో టీడీపీ నేతలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. కడప జిల్లాలో ప్రొద్దుటూరు ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, పులివెందుల ఇంచార్జ్ బీటెక్ రవిల అరెస్టుతో నే ప్రతిపక్షం అంటే జగన్ ఎంతగా భయపడుతున్నాడో అర్థం అవుతుందని లోకేష్ అన్నారు. పులివెందులలో టీడీపీ స్పీడు పెరిగడంతో తన మార్కు అక్రమ కేసులతో భయపెట్టే చర్యలకు దిగాడని విమర్శించారు. రాష్ట్రంలో రోజుకో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ అరెస్టు జగన్ లో మొదలైన అలజడికి నిదర్శనం అని లోకేష్ అన్నారు. కడప జిల్లాలో, పులివెందులలో తీవ్ర వర్షాభావంతో రైతులు బాధలుపడుతుంటే…వారి సమస్యపై దృష్టిపెట్టని సిఎం….ప్రతి పక్ష నేతలపై అక్రమ కేసులే తనకు ప్రాధాన్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. సిఎంగా ఉండి సొంత నియోజకవర్గ రైతుల సమస్యలు తీర్చలేని జగన్….చివరికి పులివెందుల ప్రజల నమ్మకాన్ని కూడా కోల్పోయారని లోకేష్ అన్నారు. ప్రతిపక్ష నేతలపై కేసుల పై రివ్యూలు పెట్టి మరీ అరెస్టులు చేయిస్తున్న జగన్….ముందు రైతాంగ సమస్యలపై దృష్టిపెట్టాలని సూచించారు. ఏ సిఎం అయినా సొంత జిల్లాలో తాను చేసిన అభివృద్ది పనుల గురించో…కట్టిన ప్రాజెక్టుల గురించో…తెచ్చిన కంపెనీల గురించో చెప్పుకుంటారు..కానీ జగన్ మాత్రం ఏ నియోజకవర్గంలో ఎన్ని అక్రమ కేసులు పెట్టానో మాత్రమే చెప్పుకోగలడు..ఎందుకంటే అతను సొంత జిల్లాకు కూడా ఏమీ చేయలేకపోయాడు అని లోకేష్ మండి పడ్డారు. తన సైకో చర్యలతో తన పార్టీకి తానే జగన్ రాజకీయ సమాధి కట్టుకున్నారని…ఈ అక్రమ కేసులు, బెదిరింపు రాజకీయాలు వైసీపీని బతికించలేవని లోకేష్ అన్నారు. అక్రమ పద్దతుల్లో సహకరిస్తున్న పోలీసులు లేకపోతే….రాష్ట్రంలో వైసీపీని పార్టీ యే లేదని అన్నారు. జగన్ పెట్టే ప్రతి కేసు ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుతుంది తప్ప…ప్రజల పక్షాన తమ పోరాటాన్ని ఆప దని నారా లోకేష్ అన్నారు.