తెలుగుదేశం ప్రభుత్వం వేసే ప్రతి అడుగూ రాష్ట్ర ప్రగతి కోసమే. మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని స్వాగతిస్తోంది అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. అనంతపురం జిల్లాలో పాదయాత్ర సాగుతుంటే మేము తీసుకొచ్చిన కంపెనీలు, అవి కల్పించిన ఉపాధి, ఉద్యోగాలు ఎదురై ఎంతో సంతోషాన్ని ఇచ్చాయని ఆయన చెప్పారు.
కూడేరు వద్ద కనిపిస్తున్న ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుని రాష్ట్రానికి తీసుకొచ్చింది మేము అని గర్వంగా చెబుతున్నాను అని ఆ ప్రాజెక్ట్ ను చూపుతూ లోకేష్ వ్యాఖ్యానించారు. నీ నాలుగేళ్ల పాలనలో గాలి మాటలే తప్పించి గాలిమరల విద్యుత్ ప్రాజెక్టు ఒక్కటైనా తెచ్చావా మిస్టర్ జగన్ మోహన్ రెడ్డి? అని ప్రశ్నించారు.