కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాలోని ప్రసిద్ధ అమృతపురి ఆశ్రమాన్ని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం సందర్శించారు.
కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాలోని ప్రసిద్ధ అమృతపురి ఆశ్రమాన్ని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం సందర్శించారు. అనంతరం శ్రీ మాతా అమృతానందమయి దేవితో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. మాతా అమృతానందమయి దేవి ఆశీస్సులు పొందారు. అనంతరం అమృత విశ్వవిద్యాపీఠం క్యాంపస్ ను, అమృత ఆయుర్వేద కళాశాలను మంత్రి సందర్శించారు.