భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ఘన స్వాగతం లభించింది. మంత్రి లోకేష్ గారికి హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు, ఎంపీలు శ్రీ మతుకుమిల్లి భరత్, శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే శ్రీమతి అదితి గజపతిరాజు, ఏపీ గిరిజన సహకార సంస్థ చైర్మన్ శ్రీ కిడారి శ్రావణ్ కుమార్, ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ శ్రీ కర్రోతు బంగార్రాజు, విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కిమిడి నాగార్జున, టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.