- ఏడాది పాటు కార్యాచరణ ప్రణాళిక అమలు
- ప్రజారోగ్యం కోసం సంజీవనితో అనుసంధానం
- అధికారులతో సమీక్షలో సీఎం చంద్రబాబు
- రాష్ట్రవ్యాప్తంగా 1.33 లక్షల సెంటర్లలో ఏర్పాట్లు
- యోగా డే కోసం కోటి దాటిన రిజిస్ట్రేషన్లు
- ప్రత్యేక అతిథిగా రానున్న బాబా రాందేవ్
- 20, 21 తేదీల్లో సీఎంతో కలిసి హాజరు
అమరావతి(చైతన్యరథం): సంజీవని కార్యక్రమంతో అనుసం ధానం ద్వారా యోగాను రాష్ట్రంలో ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఆరోగ్యంపై అందరూ ధ్యాస పెట్టేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా నిర్వ హించ తలపెట్టిన యోగా డే కార్యక్రమం నిర్వహణపై అధికారు లతో సచివాలయంలో బుధవారం సమీక్షించారు. యోగాంధ్ర నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్దేశించారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన యోగా మాస్టర్ ట్రైనర్లకు వచ్చే ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు ప్రత్యేక పురస్కారాలు అందజేయాలని సూచించారు. ఇంటింటికీ యోగా ప్రధాన థీమ్‌గా ఏడాది పాటు కార్యాచరణ ప్రణాళిక చేయాలన్నారు. వివిధ వైద్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక థెరప్యూటిక్ యోగా కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయా లని చెప్పారు.
ఈసారి యోగా డేకు రాష్ట్రానికి ప్రత్యేక అతిథిóగా వస్తున్న ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌తో కలిసి ఈనెల 20న ఉండవల్లి గుహల దగ్గర జరిగే యోగా కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. 21వ తేదీన విజయ వాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి కార్యక్ర మం నిర్వహించనున్నారు. స్టేడియంలో 5 వేల నుంచి 6 వేల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కూడా బాబా రాందేవ్ సహా ముఖ్యమంత్రి హాజరవుతారు. వర్షం కారణంగా ఏమైనా అవాంతరం తలెత్తితే ప్రత్యామ్నాయంగా విజయవాడ అంబేద్కర్ కళావేదికలో వెయ్యి మందితో స్టేట్ ఈవెంట్ నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. యోగా ప్రచారంలో భాగంగా 19వ తేదీనే రాష్ట్రానికి వస్తున్న బాబా రాందేవ్ అదేరోజు ముఖ్యమంత్రితో సమావేశమవుతారు.
యోగాంధ్రలో భాగంగా ఇప్పటివరకు 2.6 లక్షల మందిని ట్రైనర్లుగా తీర్చిదిద్దినట్టు అధికారులు ముఖ్యమం త్రికి వివరించారు. 21న యోగాడేలో పాల్గొనేందుకు ఇప్పటికే కోటికి మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు విజయవాడలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్టు వివరించారు. 21న 1.33 లక్షల సెంటర్లలో యోగా కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నామని సీఎంకు తెలిపారు. 21 తేదీన ‘యోగా ఏ డెస్టినేషన’ పేరుతో వచ్చే ఏడాది యోగా డే వరకు క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. ఈ సమీక్షకు ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ చక్రధర్‌బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, ఆ శాఖ సంయుక్త కార్యదర్శి రోణంకి గోపాలకృష్ణ తదితరులు హాజరయ్యారు.
















