- గ్లోబల్ ఇన్వెస్టర్లకు పాలసీల్లో సహకారం ఇవ్వండి
- ఎన్‌యూఎస్ ప్రతినిధులకు చంద్రబాబు ఆహ్వానం
- సీఐఐ ఏపీ బిజెనెస్ డెలిగేషన్‌తోనూ సమావేశం
- పరిశ్రమల స్థాపనకు భాగస్వాములను చేయాలి
- ఏపీ బ్రాండ్‌ను విదేశాల్లో ప్రమోట్ చేయాలని పిలుపు
సింగపూర్: అమరావతిలో యూనివర్శిటీ క్యాంపస్ ఏర్పాటు చేయాలని ప్రపంచంలో మేటి యూనివర్సిటీల్లో ఒకటైన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్‌యూఎస్)ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ టానఎంగ్ చేయ్‌తో సోమవారం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో ఎన్‌యూఎస్ ఇంటర్నేషనల్ బ్రాంచ్, లేదంటే శాటిలైట్ క్యాంపస్ ఏర్పాటుకు ప్రతిపాదించిన ముఖ్యమంత్రి అమ రావతిలో ప్రపంచస్థాయి విద్యాసంస్థల ఏర్పాటు లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు రాజ ధాని ప్రాంతంలో కార్యకలాపాలు మొదలుపెట్టాయని వివరించా రు. గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించేలా సరికొత్త పాలసీల రూపకల్ప నపై ఎన్‌యూఎస్ పాలసీ ఇనిస్టిట్యూట్ సహకారానికి విజ్ఞప్తి చేశా రు. ఈ సందర్భంగా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు అమరా వతి నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అమరావ తి మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో తమ భాగస్వామ్యాన్ని ప్రొఫెసర్లు గుర్తు చేసుకున్నారు. అమరావతిలో క్యాంపస్ పెట్టాల న్న ముఖ్యమంత్రి సూచనపై సానుకూలంగా స్పందించిన టాన్ ఎంగ్ చేయ్ ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని చెప్పారు.
ఏపీలో అవకాశాలను ప్రమోట్ చేయండి
తొలిరోజు పర్యటనలో సీఐఐ ఏపీ బిజెనెస్ డెలిగేషన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ప్రపంచంలో అనేక చోట్ల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సీఎం వివరించారు. అన్ని రంగా ల్లో తెలుగు పారిశ్రామికవేత్తలు ఉన్నారని, మారుతున్న కాలానికి అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. టెక్నాలజీ యుగంలో కొత్త ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం తరపున, దేశం తరపున విదేశీ పర్యటనల్లో పారిశ్రామికవేత్తలను భాగస్వాములను చేస్తాం. ఏపీలో ఉన్న అవ కాశాలు విదేశాల్లో వివరించే బాధ్యతను కూడా పారిశ్రామికవేత్తలు తీసుకోవాలి. రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడం అంటే సొంత రాష్ట్రంలో అవకాశాలను సృష్టించడమే అవుతుంది. మన బలాలు వివరించి విదేశీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావాలి. అవసరం అయితే విదేశీ కంపెనీ భాగస్వామ్యంతో పరిశ్రమలు స్థాపించాలి.
అదే విధంగా ఇతర దేశాల్లో ఉన్న టెక్నాలజీని, వ్యాపారాన్ని రాష్ట్రానికి పరిచయం చేయాలి. ఏపీలో మంచి పాలసీలు ఉన్నాయి… సహకరించే ప్రభుత్వం ఉంది. మానవ వనరులు, భూములు, నీళ్లు ఉన్నాయి. ఏ రంగంలో అయినా ఏపీలో పెట్టబడులు పెట్టవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి సెమీ కండక్టర్ వరకు మనం బెస్ట్ పాలసీలతో సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని విదేశాల్లో బ్రాండ్ చేసే బాధ్యతను తెలుగు పారిశ్రా మికవేత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో భాగంగా జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సలహాదారు లిమ్ సియాంగ్ గువాన్‌తో ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పరిపాలనలో సంస్కరణల అమలు అంశాలపై చర్చించారు. గుడ్ గవర్నెన్స్ విషయంలో సీనియర్ అధికారులకు, ప్రజా ప్రతినిధుల కు శిక్షణ ఇవ్వాలని సీఎం ఆహ్వానించారు. మరోవైపు సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి లోయెన్ లింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో సింగపూర్-ఏపీ భాగస్వామ్యంపై ఇరువురు చర్చించారు.













