.మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నెల్లూరు: నాడు తెలుగువారి ఆత్మగౌరవన్ని ఢల్లీిలో తెలుగుదేశం పార్టీ నిలిపితే… నేడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని వైసీపీ మంటగలిపిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గోరంట్ల మాధవ్ రాసలీలల వ్యవహారంతో దేశంలో తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి భంగం కలిగిందన్నారు. చట్టసభల్లో ఉండే ఒక పార్లమెంటు సభ్యుడు వ్యవహరించిన తీరుతో భారతదేశం తలదించుకునే పరిస్థితి ఏర్పడిరదన్నారు. వైసీపీ ఎంపీ ఢల్లీి వీధుల్లో తెలుగువారి ఆత్మ గౌరవాన్ని మంట గలిపారని వ్యాఖ్యానించారు. లోక్‌సభ స్పీకర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించి వెంటనే రాసలీల ఎంపీ గోరంట్ల మాధవ్‌ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, శ్రీకాళహస్తి నియోజకవర్గం టిడిపి ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి, వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ, సత్యవేడు ఇన్ఛార్జ్ జేడీ రాజశేఖర్, గూడూరు ఇంఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, సూళ్లూరుపేట ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, రాష్ట్ర కార్యదర్శి, శ్రీకాళహస్తి పరిశీలకులు మల్లిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శులు గురువారెడ్డి, చలపతి నాయుడు, దశరధ ఆచారి, తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు ఉష, చెంచయ్య నాయుడు, విజయ్ కుమార్, మురళీ నాయుడు, పొన్నారావు, మిన్నల్ రవి, జిలాని బాషా, సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.