విశాఖపట్నం(చైతన్యరథం): సైయంట్ ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ కార్పోరేట్ ఫంక్షన్స్ ప్రతినిధి పీఎనఎస్వీ నరసింహంతో మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ తిరుపతిలో సెమి కండక్టర్ పార్క్ అభివృద్ధికి జాయింట్ డెవలప్మెంట్ మోడల్‌ను పరిశీలించాలని కోరారు. సుమారు 200 ఎకరాల్లో సెమికాన్ పార్కు అభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపా రు. సైయంట్ ఫౌండేషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) మధ్య గత ఏడాది జూన్‌లో కుదిరిన ఎంవోయూ, తదనంతర పురోగతిపై చర్చించారు. సైయంట్ ప్రెసిడెంట్ నరసింహం మాట్లాడుతూ ప్రస్తుతం విశాఖపట్నం (రుషికొండ), కాకినాడలలో సైయంట్ లిమిటెడ్ ఐటీ, ఇంజ నీరింగ్ ఎసఈజెడ్ క్యాంపస్‌లు పనిచేస్తున్నాయని చెప్పారు. జూన్ 2025లో అమరావతిలో కుదిరిన ఒప్పందం మేరకు విశాఖపట్నంలో సిటీ ఇన్నోవేషన్ క్లస్టర్‌ను నిర్మించాలని లక్ష్యం గా పెట్టుకున్నామని చెప్పారు. పైలట్ క్లస్టర్లో 43 ఉన్నత విద్యా సంస్థలు, 270కు పైగా పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. జాయింట్ డెవలప్మెంట్ మోడల్లో తిరుపతిలో సెమికాన్ పార్క్ అభివృద్ధికి నరసింహం సుముఖత వ్యక్తం చేశారు.


















