చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం

అర్నబ్, మురసు తుఫాన్ల సహాయక చర్యలపై ఆర్టీజీఎస్ లో సీఎం మీడియా సమావేశం

by చైతన్యరధం
November 4, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను 4-5 రోజుల్లోనే గాడినపెట్టాం
  • తుఫాన్లు, కరవుపై ఒకేసారి కేంద్ర బృందాలు రాష్ర్టంలో పర్యటిస్తున్నాయి
  • ప్రకృతి విపత్తులను తట్టుకునేలా శాశ్వత పరిష్కారాలపై అధ్యయనం
  • తుఫాన్లలో ప్రజల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేశాం
  • అర్నబ్, మురసు తుఫాన్ల సహాయక చర్యలపై ఆర్టీజీఎస్ లో సీఎం మీడియా సమావేశం

అమరావతి (చైతన్యరథం): వరుసగా విరుచుకుపడిన అర్నబ్, మురసు తుఫాన్లలో ప్రాణనష్టాన్ని నివారిస్తూ ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంతగా తగ్గించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పని చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఆయన సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. వరుస తుఫాన్లపై ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన చర్యలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… తుఫాన్ల సమయంలో ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది రాత్రిపగలు అలుపు లేకుండా పని చేశారని ప్రశంసించారు. ముఖ్యంగా ప్రభావిత జిల్లాల కలెక్టర్లు టీమ్ లీడర్లుగా వ్యవహరించి సహాయక చర్యలను సమర్థంగా సమన్వయం చేశారని కొనియాడారు. ముఖ్యమంత్రి మొదలుకుని స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ టీమ్ స్పిరిట్తో పని చేశారని పేర్కొన్నారు.

అధికార యంత్రాంగం, ప్రజల సహకారంతోనే సహాయక చర్యలను సమర్థంగా నిర్వహించగలిగామని సీఎం చెప్పారు. ప్రజల ప్రాణాలను కాపాడటం, ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను త్వరగా పునరుద్ధరించడమే లక్ష్యంగా అందరం సమష్టిగా కృషి చేశామని తెలిపారు. విపత్తు సమయంలో ప్రజల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. విపత్తు నిర్వహణలో రక్షణ, సహాయక చర్యలు, పునరావాసం అనే మూడు అంశాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. తుఫాన్ల గమనాన్ని, గాలుల వేగాన్ని, వర్షపాత అంచనాలను నిరంతరం విశ్లేషిస్తూ ముందస్తు ప్రణాళికతో వ్యవహరించామని వెల్లడించారు. ఆర్టీజీఎస్ ద్వారా క్షేత్ర స్థాయిలో యంత్రాంగానికి ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారాన్ని చేరవేశామని, అవేర్ వ్యవస్థ ద్వారా అందిన డేటాను విశ్లేషించి నిర్ణయాలు తీసుకున్నామని ముఖ్యమంత్రి వివరించారు. గాలుల వేగం, వర్షపాతం, వరద నిర్వహణ, నీటి మళ్లింపు తదితర అంశాలపై చేసిన అంచనాలు క్షేత్రస్థాయి వాస్తవాలతో పోల్చినప్పుడు 90శాతం వరకు సరైనవిగా తేలాయని పేర్కొన్నారు. ముంపు గ్రామాలు, తుఫాను ప్రభావిత ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన సహాయక సిబ్బంది, పరికరాలను అక్కడ మోహరించడంతో సహాయక చర్యలను వేగంగా చేపట్టగలిగామని సీఎం చంద్రబాబు తెలిపారు.

20 రోజులు పట్టే పనిని నాలుగైదు రోజుల్లోనే పూర్తి చేశాం
తుఫాన్ల కారణంగా వివిధ జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టి కేవలం 4-5 రోజుల్లోనే సరఫరాను చాలా వరకు పునరుద్ధరించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. సుమారు 31 వేల విద్యుత్ స్తంభాలు కూలిపోగా 4,095 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, 548 సబ్ స్టేషన్ల పరిధిలో సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. ఇంత భారీగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పూర్తిస్థాయిలో గాడిలో పెట్టేందుకు సాధారణంగా కనీసం 20 రోజుల సమయం పట్టేదని, అయితే పక్కా ప్రణాళిక, సమన్వయం, సిబ్బంది అంకితభావంతో నాలుగైదు రోజుల్లోనే పునరుద్ధరణ సాధ్యమైందని సీఎం చంద్రబాబు వివరించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు అందరూ నిరంతరం పని చేశారని చెప్పారు. భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా చెట్లను తొలగిస్తూ, కూలిన స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారని, స్తంభాలు పాతేందుకు పెద్ద సంఖ్యలో డ్రిల్లింగ్ యంత్రాలను వినియోగించామని తెలిపారు. ఆక్వా చెరువుల్లోనూ విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని, వేలాది చెట్లు నేలకొరిగినా సిబ్బంది వర్షంలోనే వాటిని తొలగించి పునరుద్ధరణ పనులు కొనసాగించారని పేర్కొన్నారు. విద్యుత్ సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేసి సరఫరాను త్వరగా పునరుద్ధరించారని ముఖ్యమంత్రి అభినందించారు.

5వేల మంది గర్భిణుల తరలింపు… 1,029 కాన్పులు
తుఫాన్ల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటంతో పాటు వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు, వైద్య సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన సుమారు 5 వేల మంది గర్భిణులను ముందుగానే గుర్తించి ఆస్పత్రులకు తరలించామని వెల్లడించారు. ఈ వారం రోజుల్లోనే 1,029 మంది గర్భిణులకు ప్రసవాలు జరిగాయని వివరించారు. గర్భిణులు, నవజాత శిశు వుల ఆరోగ్య భద్రతకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించామని చెప్పారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్సులు, అత్యవసర మందులు, పాము కాటు నివారణకు అవసరమైన యాంటీ స్నేక్ వెనమ్ను అందుబాటులో ఉంచామని తెలిపారు. పారిశుధ్య నిర్వహణ, రక్షిత మంచినీటి సరఫరాకు చర్యలు చేపట్టామని, అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. 17 జిల్లాల్లోని 19,265 రేషన్ దుకాణాల్లో రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు.

పొరుగు రాష్ట్రాలు, కేంద్రం సహకారం తీసుకున్నాం
విద్యుత్ పునరుద్ధరణతో పాటు ఇతర సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు పొరుగు రాష్ట్రాల సహకారం తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో ఒడిశాలో తుఫాను సహాయక చర్యల కోసం మన రాష్ట్రం నుంచి సిబ్బందిని పంపిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో మాట్లాడి అదనపు సిబ్బందిని పంపాలని కోరినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో పరిస్థితిని కేంద్రానికి ఎప్పటికప్పుడు వివరించామని… కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ మాట్లాడగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్ర బృందాలు రాష్ట్రానికి వచ్చి నష్టాన్ని అంచనా వేశాయని… అర్నబ్ తుఫాను నష్టంపై రూ.4,526 కోట్లతో మధ్యంతర నివేదికను కేంద్రానికి పంపినట్టు చెప్పారు. పూర్తిస్థాయి నివేదికను త్వరలో అందజేస్తామని వెల్లడించారు. అర్నబ్ తుఫాను కారణంగా 3.52 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 23,211 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. మురసు తుఫాను నష్టంపై కూడా ప్రాథమిక అంచనాలు సిద్ధం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

11 టీఎంసీల నీరు రిజర్వాయర్లకు, 25 టీఎంసీలు చెరువుల్లోకి…
ఒకవైపు తుఫాన్లు, మరోవైపు ఎల్న్ని ప్రభావం రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. తుఫాన్ల ద్వారా వచ్చిన నీటిని వృథా కాకుండా భద్రపరిచేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. చెరువులకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, వచ్చిన నీటిని అవసరమైన ప్రాంతాలకు మళ్లించామని చెప్పారు. ఈ రెండు తుఫాన్ల ద్వారా వచ్చిన నీటిలో 11 టీఎంసీలను రిజర్వాయర్లకు మళ్లించగలిగామని, మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో మరో 25 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగామని సీఎం వెల్లడించారు. రెండుసార్లు తుఫాన్లు వచ్చినప్పటికీ రాష్ట్రంలో ఇంకా 28శాతం లోటు వర్షపాతం ఉందని… ముఖ్యంగా రాయలసీమలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయని తెలిపారు. తీర ప్రాంతం తుఫాన్లతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, రాయలసీమ కరవుతో సతమతం అవుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ పరిస్థితులకు శాశ్వత పరిష్కారం చూపాలంటే పోలవరం సహా ప్రాధాన్య మున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏవీఎస్ రెడ్డితో మాన్యువల్ రూపొందించామని, హుద్ హుద్ తుఫాను సమయంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టక్కర్ విపత్తు నిర్వహణ మాన్యువల్ తయారు చేయించామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. తుఫాన్లపై ఓ మాన్యువల్ను రూపొందించి అమలు చేస్తామని తెలిపారు. ఇప్పుడు అర్నబ్ తుఫాను నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం పర్యటిస్తుండగా…. ఎల్సినో పరిస్థితులను అంచనా వేసేందుకు మరో బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలనలు జరుపుతోంద న్నారు. ఈ బృందాలు పర్యటిస్తున్న సమయంలోనే మురసు తుఫాను ముప్పు రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందన్నారు. ఒక రాష్ట్రం ఒకేసారి ఇన్ని విపత్తులను ఎదుర్కోవడం ఇదే తొలిసారని, తాను కూడా ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

అధ్యయనం… ప్రత్యామ్నాయం… శాశ్వత పరిష్కారం
తుఫాన్ల సమయంలో ఎదురైన అనుభవాలను సమగ్రంగా విశ్లేషించి భవిష్యత్తులో నష్టాలను తగ్గించే శాశ్వత పరిష్కారాలపై దృష్టిసారిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈదురుగాలులను తట్టుకునేలా విద్యుత్ స్తంభాల నిర్మాణంలో మార్పులు చేయాలా? లేక ప్రత్యామ్నాయ సాంకేతిక పరిష్కారాలను అనుసరించాలా? అన్నది పరిశీలిస్తున్నామని చెప్పారు. తుఫాన్ల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల సాగు సీజనులో మార్పులు చేయాలా? ప్రకృతి విపత్తులను తట్టుకోగలిగే ప్రత్యామ్నాయ వంగడాలను ప్రోత్సహించాలా? అన్న అంశాలను వ్యవసాయ నిపుణులతో చర్చిస్తామని తెలిపారు. ఈసారి రైతులందరికీ పంటల బీమా చేయించామని, బీమాతో పాటు ఇన్పుట్ సబ్సిడీ కూడా అందుబాటులోకి వస్తే రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. తుఫాన్లు సహా ఎలాంటి విపత్తులు వచ్చినా రైతులు నష్టపోకుండా ఉండేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Previous Post

మరింత అంకితభావంతో పనిచేస్తాం

Next Post

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

November 4, 2026
ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ
ఆంధ్రప్రదేశ్

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

November 4, 2026
25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం
ఆంధ్రప్రదేశ్

మరింత అంకితభావంతో పనిచేస్తాం

November 4, 2026
మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం
ఆంధ్రప్రదేశ్

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

November 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

November 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

November 2, 2026
Next Post
ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ముఖ్య వార్తలు

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

by చైతన్యరధం
November 4, 2026

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

‘మన మిత్ర’

‘మన మిత్ర’

by చైతన్యరధం
January 31, 2025

ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

by కార్యకర్త
November 4, 2026

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం

తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం

by చైతన్యరధం
November 4, 2026

దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను 4-5 రోజుల్లోనే గాడినపెట్టాం తుఫాన్లు, కరవుపై ఒకేసారి కేంద్ర బృందాలు రాష్ర్టంలో పర్యటిస్తున్నాయి ప్రకృతి విపత్తులను తట్టుకునేలా శాశ్వత పరిష్కారాలపై అధ్యయనం తుఫాన్లలో...

25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం

మరింత అంకితభావంతో పనిచేస్తాం

by చైతన్యరధం
November 4, 2026

విజేతలకు 'ఎక్స్' వేదికగా అభినందనలు అమరావతి (చైతన్యరథం): 'మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గెలుపు గా మాత్రమే కాకుండా మాపై ఉంచిన మరింత పెద్ద బాధ్యతగా...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.