చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మంగళగిరికి ఇచ్చిన ప్రత్యేక హామీలను..యుద్ధప్రాతిపదికన అమలుచేస్తాం

శాశ్వత ఇంటి పట్టాల పంపిణీలో మంత్రి నారా లోకేష్‌

by చైతన్యరధం
Apr 12, 2025 at 6:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
మంగళగిరికి ఇచ్చిన ప్రత్యేక హామీలను..యుద్ధప్రాతిపదికన అమలుచేస్తాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రేపు వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన
  • రోజురోజుకీ ఇంటి పట్టాల సంఖ్య పెరుగుతోంది
  • మంగళగిరిలోనే మెదటి లీప్‌ పాఠశాల
  • శాశ్వత ఇంటి పట్టాల పంపిణీలో మంత్రి నారా లోకేష్‌
  • నాలుగో రోజు ఉదయం రత్నాలచెరువుకు చెందిన 600 మందికి ఇంటి పట్టాలు అందజేత

మంగళగిరి (చైతన్యరథం): మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన ప్రత్యేక హామీలను యుద్ధప్రాతిపదికన అమలుచేస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ స్పష్టం చేశారు. మన ఇల్లు-మన లోకేష్‌ కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు శుక్రవారం ఉదయం మంగళగిరి డాన్‌బాస్కో స్కూల్‌ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సభలో రత్నాలచెరువుకు చెందిన 600 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. ముందుగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ.. కొన్ని నిర్ణయాలు మన జీవితాలనే మార్చేస్తాయన్నారు. మంగళగిరిలో పోటీ చేయాలని 2019లో నేనొక నిర్ణయం తీసుకున్నా. మీ సమస్యలేంటో నాకు తెలియదు. నేనేంటో మీకు తెలియదు. ఎన్నికలకు 21 రోజుల ముందు టీడీపీ అభ్యర్థిగా పోటీచేశా. 5,300 ఓట్లతో ఓడిపోయా. మొదటి రోజు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. ప్రజలకు మంచి పనులు చేసి వారి మనస్సు గెలుచుకోవాలని ఆనాడే నిర్ణయించుకున్నానని మంత్రి లోకేష్‌ తెలిపారు.

26 సంక్షేమ కార్యక్రమాలు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మంగళగిరి ప్రజల కోసం 26 సంక్షేమ కార్యక్రమాలను సొంత నిధులతో అమలు చేశాను. 2019 నుంచి 2024వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మంగళగిరి ప్రజల ఆరోగ్యం కోసం ఎన్టీఆర్‌ సంజీవని తీసుకువచ్చాను. తాడేపల్లిలో, మంగళగిరిలో, దుగ్గిరాలలో క్లినిక్‌లు ఏర్పాటుచేసి నేటికీ కొనసాగిస్తున్నాం. ఈ రోజుకీ సొంత నిధులతో ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం. కుటుంబంలో పెళ్లి జరిగితే పెళ్లి కానుక ఇస్తున్నాం. మహిళలు సొంత కాళ్లపై నిలబడేలా ఉచితంగా కుట్టు మిషన్‌ ఇవ్వడంతో పాటు శిక్షణ కూడా అందించాం. వారికి ఉపాధి కూడా కల్పిస్తున్నాం. గత ప్రభుత్వం తాగునీరు సక్రమంగా అందించలేకపోతే వాటర్‌ ట్యాంకర్ల ద్వారా నీరు అందించాం. యువత క్రికెట్‌ ఆడేందుకు మంగళగిరి ప్రీమియర్‌ లీగ్‌ ఏర్పాటుచేశాం. కోవిడ్‌ సమయంలో ఆక్సిజన్‌ సిలిండర్లతో పాటు మందులు అందించాం. అమెరికా డాక్టర్ల ద్వారా టెలీమెడిసిన్‌ సేవలు అందజేశాం. ఈ విధంగా దాదాపు 26 సంక్షేమ కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం అమలు చేశామని మంత్రి లోకేష్‌ చెప్పారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-04-2026

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలమొస్తుందని చెప్పా
2024 ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేయాలని చాలా మంది చెప్పారు. ఐదేళ్లు కష్టపడ్డా, మంగళగిరి ప్రజల మనస్సు గెలుచుకున్నానని ఆనాడు చెప్పా. ఒకే స్థానం నుంచి పోటీ చేస్తా.. అదీ మంగళగిరి నుంచే పోటీచేస్తానని చెప్పా. ప్రచారంలో మీ వద్దకు వచ్చాను. ఏ మెజార్టీతో అయితే ఓడిపోయానో దాని పక్కన సున్నాపెట్టి 53వేల ఓట్లతో గెలిపించాలని కోరా. మీరు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలమొస్తుందని చెప్పా. సర్వేల్లో కుప్పం కంటే ఒక్క శాతం వెనుకబడి ఉన్నాం. మీరు చూపించిన అభిమానం, ప్రేమ చూసి ఒక్క ఓటు అన్నా ఎక్కువ వస్తుందని అధినేత చంద్రబాబుతో ఛాలెంజ్‌ చేశా. మంగళగిరి ప్రజలు ఎవరూ ఊహించని విధంగా 91వేల ఓట్ల మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించారని మంత్రి లోకేష్‌ అన్నారు.

రేపు వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన
మీరు ఇచ్చిన మెజార్టీ కొండంత బలం. దశాబ్దాల కల వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి. ఏపీలో మొదటి వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంగళగిరి నియోజకవర్గానికి శాంక్షన్‌ అయింది. ఈ నెల 13న శంకుస్థాపన చేస్తున్నాం. ఏడాదిలోగా పూర్తిచేస్తాం. చిల్లపల్లి బాధ్యత తీసుకుంటారు. పార్క్‌లు, చెరువులను అభివృద్ధి చేస్తున్నాం. భూగర్భ డ్రైనేజీ, భూగర్భ వాటర్‌ పైప్‌లైన్‌, భూగర్భ గ్యాస్‌, కరెంట్‌ ప్రాజెక్టులు చేపడుతున్నాం. జూన్‌, జులైలో ఆ కార్యక్రమాలు కూడా చేపడతాం. కొండ దిగువన లక్ష్మీ నరసింహస్వామి దర్శనం తర్వాత పానకాల స్వామి గుడికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని చాలామంది చెప్పారు. దీంతో ఉచితంగా బస్సు ఏర్పాటుచేశాం. మంగళగిరి, తాడేపల్లి నుంచి ఎయిమ్స్‌కు వెళ్లేందుకు రెండో బస్సు కూడా ఉచితంగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇచ్చిన ప్రతి హామీ పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నామని మంత్రి లోకేష్‌ తెలిపారు.

రోజురోజుకీ ఇంటి పట్టాల సంఖ్య పెరుగుతోంది
దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న ఇళ్లకు శాశ్వత ఇంటి పట్టా ఇవ్వాలని ఆనాడు మంగళగిరి ప్రజలు కోరారు. తొలి విడత పట్టాలు సంవత్సరంలోగానే ఇస్తానని చెప్పా. ఎండోమెంట్‌, రైల్వే భూముల్లో నివాసం ఉంటున్న వారికి శాశ్వత ఇంటి పట్టాలు ఇచ్చేందుకు మరో సంవత్సరం పడుతుందని ఆనాడే చెప్పా. అటవీ, కాలువ, కొండ పోరంబోకు భూములకు కొంత సమయం పడుతుంది. ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకే మీ లోకేష్‌ ఈ రోజు మీ ముందు నిలబడ్డాడు. కూటమి నాయకులందరూ కలిసికట్టుగా అధికారులతో మీ ఇంటికి వచ్చి కప్పు కాఫీ కూడా తాగకుండా ఇంటి కొలతలు తీసుకుని వివరాలు సేకరించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో మాట్లాడి సహకరించాలని కోరా. ఈ జీవో రాష్ట్ర ప్రజలకు కూడా పనికి వస్తుందని చెప్పా. అనగాని ప్రోత్సాహంతో ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలో మొదటి విడతలో సుమారుగా 3200 కుటుంబాలకు ఉచితంగా ఇంటి పట్టాలను ఎన్డీయే ప్రభుత్వం అందజేస్తోంది. ఈ సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని మంత్రి లోకేష్‌ తెలిపారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో మొదటి పాఠశాల మంగళగిరిలోనే
పేదలకు పట్టాల రూపంలో ఇస్తున్న ఈ ఆస్తి విలువ వెయ్యి కోట్ల రూపాయలు. నేనిచ్చే పట్టాతో వెంటనే రిజిస్టర్‌ చేసుకోవచ్చు. రెండేళ్ల తర్వాత అమ్ముకునే హక్కు కూడా వస్తుంది. శాశ్వత హక్కు ఎన్డీయే ప్రభుత్వం మీకు కలుగజేస్తోంది. ఇది మనందరి దశాబ్దాల కల. ఆ హామీని నిలబెట్టుకునేందుకే మీ ముందుకు వచ్చా. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం. విద్యాశాఖ మంత్రిగా లీప్‌ (లెర్నింగ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌) కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇందులో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో మొదటి స్కూల్‌ మంగళగిరి నియోజకవర్గంలోనే అభివృద్ధి చేయబోతున్నాం. 50 రోజుల్లో పాఠశాలల రూపురేఖలు మారిపోవాలని అధికారులతో చెబుతున్నా. పట్టుదలతో పనిచేస్తున్నానని మంత్రి లోకేష్‌ చెప్పారు.

యుద్ధప్రాతిపదికన అమలుచేస్తాం
మంగళగిరి ప్రజలు అన్నివిధాలుగా నాకు అండగా నిలిచారు. అవినీతి రహిత పాలన అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మంగళగిరి ప్రజలను నా గుండెల్లో పెట్టుకుని అహర్నిశలు పనిచేస్తా. సూపర్‌ సిక్స్‌లో కొన్ని హామీలు మే నెలలో అమలుచేయబోతున్నాం. మంగళగిరికి ఇచ్చిన ప్రత్యేక హామీలను యుద్ధప్రాతిపదికన అమలుచేస్తామని మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు.

Previous Post

టీటీడీ గోశాలపై వైసీపీ తప్పుడు ప్రచారం

Next Post

ఇంటిపట్టాలకు రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-04-2026

కార్యకర్త
@ April 30, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా
ఆంధ్రప్రదేశ్

మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

చైతన్యరధం
@ April 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-04-2026

కార్యకర్త
@ April 29, 2026
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026
అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం
ఆంధ్రప్రదేశ్

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్

విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్
ఆంధ్రప్రదేశ్

విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్

చైతన్యరధం
@ April 29, 2026
Load More

ముఖ్య వార్తలు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

చైతన్యరధం
@ April 30, 2026
అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ April 29, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist