చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రజారోగ్య వ్యవస్థను గాడిలో పెట్టాం

మంత్రి సత్యకుమార్‌

by చైతన్యరధం
Jun 8, 2025 at 6:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
ప్రజారోగ్య వ్యవస్థను గాడిలో పెట్టాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఏడాది ముందు ప్రజారోగ్య రంగంలో అన్నీ ప్రతికూల పరిస్థితులే
  • నేడు భారీగా పెరిగిన వైద్య సిబ్బంది హాజరు, ఓపీ, ఐపీ సేవలు
  • ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ దిశగా వడివడిగా అడుగులు
  • డిజిటల్‌ ఆరోగ్య సేవలు, ఎన్ఫోర్స్‌మెంట్‌పై దృష్టి

విజయవాడ (చైతన్యరథం): ఏడాది క్రితం అధికారంలోకొచ్చినప్పుడు గత ప్రభుత్వ నిర్వాకాలతో ప్రజారోగ్య రంగంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్ని అధిగమిస్తూ ఈ రంగంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గణనీయమైన మార్పు తేగలిగిందని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. ఈనెల 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకోనున్న సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజారోగ్య రంగాన్ని గాడిలో పెట్టడానికి ఏడాదిగా వైద్యారోగ్య శాఖ చేసిన ప్రయత్నాల్ని, సాధించిన ఫలితాల్ని అంకెలతో సహా వివరించారు.
ఏడాది కాలంగా వైద్య సిబ్బందిలో క్రమశిక్షణ, జవాబుదారీతనాన్ని పెంచడానికి, కుంటుపడిన ప్రధాన ఆరోగ్య కార్యక్రమాల అమలులో వేగం పెంచి సత్ఫలితాల్ని సాధించడానికి, మౌలిక సదుపాయాల కల్పనకు, రోగ నిర్ధారణ పరీక్షల సామర్థాన్ని పెంచేందుకు, డిజిటల్‌ ఆరోగ్య సేవల్ని ప్రజలకందించడానికి కృషి చేసినట్లు మంత్రి వివరించారు.

మార్పునకు కేంద్రం గుర్తింపు
2024-25 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద 30కి పైగా పథకాల్ని అమలు చేసిన తీరు, సాధించిన ఫలితాల్ని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.100 కోట్లను ప్రోత్సాహక బహుమతిగా విడుదల చేసిందని మంత్రి తెలిపారు. ఈ గుర్తింపు ప్రజారోగ్యం పట్ల కూటమి ప్రభుత్వ నిబద్ధత, పథకాల అమలులో అవలంబించిన భిన్న వైఖరికి అద్దం పట్టిందని, గతేడాదిలో ప్రభుత్వం తెచ్చిన మార్పునకు ఇది సాక్షాత్కారమని మంత్రి స్రత్యకుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి ఇలాంటి గుర్తింపు లభించలేదని, ప్రజారోగ్యం పట్ల ఈ రెండు ప్రభుత్వాల భిన్న వైఖరులకు ఇదే నిదర్శనమని ఆయన అన్నారు.
ఇతర వ్యత్యాసాలు
గ్రామ స్థాయిలో ప్రజలకు ఆరోగ్య సేవలందించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనల మేరకు దేశవ్యాప్తంగా గ్రామాల్లో ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాల నిర్మాణాన్ని చేపట్టారని, ఇందులో భాగంగా గత ప్రభుత్వం 3,000లకు పైగా ఈ మందిరాల్ని నిర్మించిందని, దీనికి భిన్నంగా కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే 3,318 భవనాల నిర్మాణాలకు కేంద్ర అనుమతి పొంది రూ.1,065 కోట్లతో నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. ప్రజారోగ్యానికి మేలు చేసే క్రిటికల్‌ కేర్‌ బ్లాకులు గత ప్రభుత్వ హయాంలో 14 మాత్రమే మంజూరు కాగా, కూటమి ప్రభుత్వం అదనంగా మరో 10 సాధించిందని మంత్రి తెలిపారు. ఈ విషయంలో గత ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధుల్ని విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేసిందని, ఈ బ్లాకులపై ఇప్పటి వరకు అయిన రూ.90 కోట్ల ఖర్చులో కూటమి ప్రభుత్వం గత ఏడాదిలోనే రూ. 62 కోట్లు ఖర్చు చేసి తన విశిష్టతను చాటుకుందని మంత్రి వివరించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-06-2026

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

రోగ నిర్ధారణ పరీక్షల సామర్థ్యం పెంపు
రోగ నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచే దిశగా కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని మీడియాకు మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వివరించారు. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కేవలం 13 ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ లేబరేటరీల్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయగా, కూటమి ప్రభుత్వ ఒక ఏడాదిలోనే అటువంటి మరో 13 కేంద్రాల్ని ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. సర్వజనాసుపత్రుల్లో ఈ సామర్థ్యాన్ని పెంచేందుకు కూటమి ప్రభుత్వం గత ఏడాదిలో 3,200లకు పైగా ఆధునిక పరీక్షా పరికరాల్ని ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు.
రోగ నిర్ధారణ పరీక్షల్ని ప్రజల ఇంటి వద్దే చేసే దిశగా కూటమి ప్రభుత్వం ప్రభావవంతమైన చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగా 104 సంచార వైద్య వాహనాల ద్వారా ఇళ్ల వద్దనే 47 పరీక్షలు చేస్తారని, ఈ దిశగా పైలెట్‌ ప్రాజెక్టు అమలు చేయబోతున్నామని మంత్రి స్రత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు.
రోగాల నివారణ దిశగా కృషి
రోగాల అనంతరం చికిత్స కంటే రోగాల నివారణ ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చన్న ఆలోచనతో రోగుల మరణాలకు ప్రధాన కారణమవుతున్న క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధుల నివారణకు కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని మంత్రి తెలిపారు. అదే రీతిన నవ సమాజ స్థాపనకు ప్రధాన కారకులయ్యే స్కూలు విద్యార్థుల ఆరోగ్య సమస్యల్ని ముందుగానే గుర్తించి తగు నివారణ చర్యల్ని చేపట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా స్క్రీనింగ్‌ చేపట్టామని, ఈ కార్యక్రమాలు మంచి ఫలితాల్నిస్తున్నాయని మంత్రి వివరించారు.
కూటమి ప్రభుత్వం తెచ్చిన మార్పునకు ఇతర నిదర్శనాలు
గతేడాదిగా వైద్య రంగంలో కూటమి ప్రభుత్వం చేసిన కృషి వలన వచ్చిన మార్పునకు సంకేతంగా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఈ కింది వివరాల్ని ఉదహరించారు.
1) ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బంది హాజరు 2023-24లో నమోదైన దానికంటే గతేడాదిలో 7.42 శాతం నుండి 14.20 శాతానికి పెరిగింది.
2) సిబ్బంది హాజరు మెరుగవడంతో ఓపీ సేవలు 8 శాతం మేరకు, ఐపి సేవలు 17.61 శాతం మేరకు పెరిగాయి
3) రోగ నిర్ధారణ పరీక్షల్లో 7.20 శాతం వృద్ధి నమోదైంది.
4) ఈ మార్పుల కారణంగా ప్రభుత్వాసుపత్రుల సేవల పట్ల ప్రజల్లో సానుకూల అభిప్రాయం భారీగా పెరిగినట్లు ఐవిఆర్‌ఎస్‌ సర్వేల్లో వెల్లడైంది
5) ప్రభుత్వ వైద్యులు, ఇతర సిబ్బంది కొరతను తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం 8,619 నియామకాల్ని చేపట్టి 2,362 మంది వైద్యుల్ని, 209 మంది ఇతర సిబ్బందిని ఇప్పటికే నియమించింది
6) ఎన్సీడీ 3.0 సర్వేలో భాగంగా రాష్ఠ్రంలో 18 ఏళ్ల వయసుకు మించి ఉన్న 4.1 కోటి జనాభాలో 2.71 కోట్ల మందికి నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు సంబంధించి స్క్రీనింగ్‌ పరీక్షలు చేశారు.
7) రాష్ట్రంలోని 69 లక్షల మంది స్కూలు విద్యార్థుల్లో 58 లక్షల మందికి వివిధ లోపాల్ని గురించి సర్వే చేశారు.
8) గుండె పోటు వచ్చిన వారికి అత్యంత కీలకమైన మొదటి గంటలో టెనెక్టిప్లేస్‌ అనే ఇంజక్షన్‌ ఇచ్చి స్టెమీ ప్రోగ్రాం కింద 2,650 మంది విలువైన ప్రాణాల్ని కాపాడగలిగాం.

గత ప్రభుత్వ వారసత్వం
గత ప్రభుత్వ నిర్వాకాలు, అక్రమాలతో గాడి తప్పిన ప్రజారోగ్య వ్యవస్థను వారసత్వంగా స్వీకరించిన కూటమి ప్రభుత్వం పైన వివరించిన మార్పులను సాధించడం విశేషమని మంత్రి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ వైఖరి, హామీల డాంబికం..అమలులో డొల్లతనం అన్న రీతిగా సాగిందని, దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధుల దారి మళ్లింపు, రాష్ట్ర వాటా నిధుల్ని విడుదల చేయకపోవడం వంటి చర్యలతో ప్రజారోగ్య రంగం పలు సమస్యలపాలైందని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వివరించారు. రూ.8,400 కోట్ల ఖర్చుతో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ఒకే సారి నిర్మిస్తామంటూ డ్రామాలు ఆడి, అధికారం నుండి వైదొలిగే నాటికి అందులో కేవలం 14 శాతం మాత్రమే ఖర్చు చేసిందని, అదే రీతిన రూ.12,000 కోట్ల ఖర్చుతో నాడు-నేడు కార్యక్రమంపై నానా హంగామా చేసి పదవి నుండి వైదొలిగే నాటికి అందులో కేవలం 17 శాతం మాత్రమే ఖర్చు చేసిందని మంత్రి వివరించారు.

ఈ విధంగా గత ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల అవలంబించిన భిన్న వైఖరులను వివరిస్తూ, ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వం తెచ్చిన మార్పును సోదాహరణంగా వివరించారు.
ఈ విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆలోచనల మేరకు ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ను సాధించే దిశగా పయనిస్తున్నామని, రానున్న కాలంలో డిజిటల్‌ ఆరోగ్య సేవలు, ఆహార పదార్థాలు, నాణ్యమైన మందుల్ని ప్రజలకు సరఫరా చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ యంత్రాంగాన్ని పటిష్టం చేసే విషయంపై దృష్టి సారిస్తామని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడిరచారు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, కమిషనర్‌ డాక్టర్‌ జి.వీరపాండియన్‌ మీడియా సమావేశంలో పాల్గొన్నారు

Previous Post

పెట్టుబడులకు ఏపీ అనుకూలం

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 09-06-2025

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-06-2026

కార్యకర్త
@ June 16, 2026
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం
ఆంధ్రప్రదేశ్

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

చైతన్యరధం
@ June 16, 2026
అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

చైతన్యరధం
@ June 16, 2026
నేడు సింగపూర్‌లో వరల్డ్ సిటీస్ సదస్సు
ఆంధ్రప్రదేశ్

నేడు సింగపూర్‌లో వరల్డ్ సిటీస్ సదస్సు

చైతన్యరధం
@ June 16, 2026
దూసుకెళుతున్న ఆర్థికశక్తి భారత్..కీలక చోదకశక్తిగా ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్

దూసుకెళుతున్న ఆర్థికశక్తి భారత్..కీలక చోదకశక్తిగా ఆంధ్రప్రదేశ్

చైతన్యరధం
@ June 16, 2026
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పున:ప్రతిష్టాపనకు రెండేళ్లు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో ప్రజాస్వామ్య పున:ప్రతిష్టాపనకు రెండేళ్లు

చైతన్యరధం
@ June 16, 2026
జిల్లాను సస్యశ్యామలమే ప్రభుత్వ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

రొయ్యల ఫీడ్ ధరల పర్యవేక్షణకు శాశ్వత రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు

చైతన్యరధం
@ June 16, 2026
Load More

ముఖ్య వార్తలు

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

చైతన్యరధం
@ June 16, 2026
అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

చైతన్యరధం
@ June 16, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

చైతన్యరధం
@ June 16, 2026
అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

చైతన్యరధం
@ June 16, 2026
నేడు సింగపూర్‌లో వరల్డ్ సిటీస్ సదస్సు

నేడు సింగపూర్‌లో వరల్డ్ సిటీస్ సదస్సు

చైతన్యరధం
@ June 16, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist