- అక్షరాలు, విశ్వసనీయత, విలువలే ఆయుధాలు
- ఆయన సృష్టించిన వ్యవస్థలు తెలుగుజాతి ఆస్తి
- ఇక నుంచి అధికారికంగా జయంతి నిర్వహిస్తాం
- అమిత్ షా రావడం గౌరవంగా భావిస్తున్నాం
- ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానంలో సీఎం చంద్రబాబు
విజయవాడ(చైతన్యరథం): విలువల కోసం జీవితాంతం రాజీ లేని పోరాటం చేసిన మహనీయుడు పద్మవిభూషణ్ రామోజీరావు అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఆయన తెలుగు జాతి కీర్తి, తరతరాలకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. రామోజీరావు స్థాపించిన సంస్థలు తెలుగు జాతికి ఆస్తులని అన్నారు. రామోజీ రావు 90వ జయంతిని పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్, గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొమ్మిది రంగాల్లో విశిష్ట సేవలం దించిన తొమ్మిది మందికి అవార్డులు అందజేశారు. ఈ సందర్భం గా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వరుసగా రెండో ఏడాది ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.
రామోజీ రావు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఏటా ఈ వేడుకలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన రామోజీరావు తన సంకల్పం, క్రమ శిక్షణ, విలువలు, నాణ్యత, విశ్వసనీయతతో గొప్ప సంస్థలను స్థాపించి సమర్థంగా నడిపించారని సీఎం వివరించారు. ప్రజల కోసం జర్నలిజాన్ని నమ్ముకుని, అక్షరాన్నే ఆయుధంగా మలచు కుని పోరాటం చేసిన వ్యక్తి అని ప్రశంసించారు. ఈనాడు, మార్గదర్శి, ఈటీవీతో పాటు విలువలతో కూడిన సినిమాలను సమాజానికి అందించారన్నారు. ప్రజా సమస్యలపై స్పందించడం తో పాటు ప్రకృతి విపత్తుల సమయంలోనూ ఈనాడు సంస్థ ప్రజలకు అండగా నిలిచిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి పేరు నిర్ణయించే సమయంలో లోతుగా అధ్యయనం చేసి అమరా వతి అనే పేరును సూచించారని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణానికి రూ.10 కోట్లు, కరోనా సమయంలో రాష్ట్రానికి మరో రూ.10 కోట్లు విరాళంగా అందించారని తెలిపారు. ప్రతి రాత్రి 9 గంటలకు ఈటీవీ వార్తలు చూసి ప్రజలు సమాచారాన్ని తెలుసు కునే స్థాయిలో ఆ సంస్థ విశ్వసనీయత సంపాదించిందని గుర్తు చేశారు.
ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తలవంచలేదు…
ఎన్ని కష్టాలు, ఒత్తిళ్లు ఎదురైనా రామోజీరావు ఎవరికీ తలవం చలేదని పేర్కొన్నారు. కోట్లాది మంది పాఠకుల విశ్వాసమే ఆయన కు బలమైన శక్తిగా నిలిచిందని తెలిపారు. విచారణల పేరుతో ఇబ్బందులకు గురిచేసినా, అనారోగ్యంతో మంచంపై ఉన్న వీడియోలను విడుదల చేసి అవమానించే ప్రయత్నాలు చేసినా ఆయన తన పోరాట పంథాను వీడలేదని పేర్కొన్నారు. విలువల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిలబడిన వ్యక్తి రామోజీ రావు అని కొనియాడారు. ఆయన జయంతి కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకావడం రామోజీరావుకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.
తొమ్మిది రంగాల్లో విశిష్టులకు పురస్కారాలు
జర్నలిజం, కళలు-సంస్కృతి, గ్రామీణాభివృద్ధి- వ్యవసాయం, మహిళా సాధికారత, సైన్స్- టెక్నాలజీ, యూత్ ఐకాన్, సామాజిక సేవ, విద్య, వైద్యరంగాల్లో విశిష్ట సేవలందించిన తొమ్మిది మంది కి కేంద్ర మంత్రి అమిత్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్ లు రామోజీ ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేశారు. ఈ అవార్డులు అందుకున్న వారంద రికీ నేతలు అభినందనలు తెలిపారు. రామోజీరావు పేరుతో పురస్కారం అందుకోవడం అవార్డు గ్రహీతల జీవితాల్లో మరపురాని, విలువైన ఘట్టంగా నిలిచిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు శ్రీనివాసవర్మ, కిషన్రెడ్డి, రామ్మోహన్ నాయుడు, రామోజీ గ్రూప్ సీఎండీ సీహెచ్ కిరణ్, రామోజీరావు కుటుంబసభ్యులు పాల్గొన్నారు.


















