చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు.. రా.. కదలి రా!

కనిగిరి సభలో చంద్రబాబు శంఖారావం

by చైతన్యరధం
January 6, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు.. రా.. కదలి రా!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • తెలుగుజాతి స్వర్ణయుగం కోసం..ప్రజలంతా ఏకమవ్వాలి
  • జగన్‌ తాను చేసిన తప్పులకు ఎమ్మెల్యేలను బలిపశువుల్ని చేస్తున్నాడు
  • చేతకాని పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి
  • ఇంత పనికిమాలిన ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదు
  • సూపర్‌ సిక్స్‌ ద్వారా పేదరికం లేని సమాజాన్ని తీసుకువస్తా
  • వెలిగొండ పూర్తి కావాలన్నా, మార్కాపురం జిల్లా కావాలన్నా టీడీపీ రావాలి

కనిగిరి: సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని, టీడీపీ పిలుపునిచ్చిన రా..కదలిరా కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తెలుగుజాతి స్వర్ణయుగం కోసం అందరూ కలిసిరావాలన్నారు. జగన్‌ చేతకాని పాలనతో రాష్ట్ర్రం 30 ఏళ్లు వెనక్కివెళ్లిందన్నారు. శుక్రవారం నాడు ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరిలో నిర్వహించిన రా..కదలిరా కార్యక్రమం బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…..ఐదేళ్ల జగన్‌ పాలనలో ప్రజలు నరకం అనుభవించారన్నారు. ఈ నూతన సంవత్సరంలో సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపి మనకు మంచి రోజులు రావాలని సంకల్పం చేద్దాం. నాడు ఎన్టీఆర్‌ తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలిరా అంటే అది ప్రభంజనం అయింది. ప్రజలే సారధ్యం వహించి తెలుగుదేశాన్ని గెలిపించారు. నేడు సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా.. కదలిరా అని పిలుపునిస్తున్నా…ఇది మనందరి సమష్టి బాధ్యత. ప్రపంచంలో తెలుగు జాతి నెం.1 కావాలి, అందుకు తగ్గ సత్తా, తెలివితేటలు మనదగ్గర ఉన్నాయి. కానీ నేడు రాష్ట్రం లో ప్రజాస్వామ్యం లేదు. చైతన్యం ఉన్న తెలుగు జాతి భయపడే పరిస్ధితి వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని సాగనంపి తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకురావాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.

పౌరుషాల పురిటి గడ్డ ప్రకాశం జిల్లా
పౌరుషాల పురిటి గడ్డ ప్రకాశం జిల్లా, ఈ జిల్లా నుంచే నేడు రా.. కదలి రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. బ్రిటిష్‌ వారి తూటాలకు ఎదురొడ్డిన ప్రకాశం పంతులు జన్మించిన గడ్డపై పుట్టిన మీరు ఈ సైకో పెట్టే అక్రమ కేసులకు భయపడతారా? ఒంగోలు గిత్తకు ప్రపంచ ప్రఖ్యాతి ఉంది. 21 సంవత్సరాల క్రితమే ఒంగోలు గిత్తను ప్రమోట్‌ చేసిన పార్టీ తెలుగుదేశం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గెలాక్సీ గ్రానైట్‌ ఇక్కడే ఉంది. నేడు జగన్‌ రెడ్డి మనుషులు పులివెందుల నుంచి వచ్చి గ్రానైట్‌ ను దోచుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్నవారు పేదలుగా ఉన్నారు, రాష్ట్రం వదలి పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన వారు ఆర్థికంగా బలపడ్డారు. దీనికి కారణం ఈ చేతకాని వైసీపీ పాలన. భవిష్యత్‌ లో కనిగిరి దశ, దిశ మార్చే బాధ్యత టీడీపీ తీసుకుటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
వైసీపీ పాలనలో ప్రజలు జీవన ప్రమాణాలు పెరిగాయా?
5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎవరికైనా న్యాయం జరిగిందా? మీ జీవన ప్రమాణాలు పెరిగాయా? జగన్‌ రెడ్డి బటన్‌ నొక్కుడు అంటూ ఒక చేత్తో రూ. 10 ఇచ్చి మరో చేత్తో రూ. 100 దోచుకుంటున్నారు. నేను 25 ఏళ్ల క్రితం ఐటీిని ప్రమోట్‌ చేశా, హైదరాబాద్‌ కేంద్రంగా తెలుగు వారికి ఒక రాజధానిని అభివృద్ది చేశాం. ఐటీి అభివృద్దితో మన తెలుగువారు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో స్ధిరపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తే సంపద పెరుగుతుంది. ఆ సంపదతో ప్రజలకు సంక్షేమం అందించాలి. కానీ ఈ ప్రభుత్వానికి సంపద సృష్టించడం, ఉద్యోగాలివ్వటం తెలీదు. 5 ఏళ్లలో ఒక్క సారైనా జాబ్‌ క్యాలెండర్‌ వచ్చిందా, డీఎస్సీ ఇచ్చారా, పెట్టుబడులు, పరిశ్రమలు తెచ్చారా? ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీనే. జాబు రావాలంటే మళ్లీ బాబు రావాలి. 2029 నాటికి ఏపీ దేశంలో నెం.1 కావాలని ప్రణాళిక రూపొందించాం. అమరావతి, పోలవరం నిర్మాణంతో పాటు రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చా. మనకు సముద్ర తీర ప్రాంతం ఉంది, ఇక్కడ పరిశ్రమలు పెడితే యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయని చంద్రబాబు అన్నారు.

జగన్‌ రెడ్డి పాలనలో అందరూ బాధితులే
ఎన్నికల ముందు ముద్దులు పెట్టిన జగన్‌ రెడ్డి నేడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు. గ్రామ పెద్ద చెడు వ్యక్తి అయితే ఆ గ్రామం నాశనమవుతుంది. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి సైకో అయితే రాష్ట్రం ఏమవుతుందో ఇప్పుడు అదే జరుగుతోంది. జగన్‌ రెడ్డి పాలనలో అందరూ బాధితులే. భర్త కళ్లదుటే మహిళలకు రక్షణ లేదు. మొన్న విశాఖలో ఒక యువతిని 11 మంది అత్యాచారం చేశారు. అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో చూడండి. టీడీపీ హయాంలో యువతకు ఉద్యోగాలిస్తే నేడు జగన్‌ గంజాయి ఇస్తున్నాడు. నా హయాంలో ఐటీి ఉద్యోగాలిస్తే జగన్‌ రెడ్డి రూ. 5 వేల వాలంటీర్‌ ఉద్యోగాలు ఇచ్చారు. వైసీపీ పాలనలో నిత్యాసరాల ధరలన్నీ పెరిగాయి, సామాన్యుడు బతికే పరిస్ధితిలేదు. దేశంలోకెల్లా పెట్రోల్‌ , డీజీల్‌ పై పన్నులు ఏపీలోనే ఎక్కువ. టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా కరెంట్‌ చార్జీలు పెంచలేదు. కానీ నేడు 9 సార్లు పెంచారు. అన్నింటిపై పన్నులు వేస్తున్నారు. నేను చెత్త నుంచి సంపద సృష్టిస్తే నేడు ఈ చెత్త ముఖ్యమంత్రి చెత్తపై పన్ను వేశాడు. రాష్ట్రంలోని ప్రజలందరి ఆదాయం ఎంత ఉందో అంత అప్పు రాష్ట్రంపై ఉంది. ఈ అప్పంతా మనమే కట్టాలి. వైసీపీ పాలనలో రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులన్నీ రివర్స్‌ అయిపోయాయి. నిరుద్యోగం తాండవిస్తోంది, రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టారు. టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే ఎలా చేస్తారని కొంతమంది నన్ను అడుగుతున్నారు. నాకున్న అనుభవంతో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తానని చంద్రబాబు చెప్పారు.

మద్యం, ఇసుక, మైనింగ్‌ లో కోట్లు దోచుకుంటున్నారు
టీడీపీ హయాంలో ఉచిత ఇసుక ఇచ్చాం, కానీ నేడు ఎక్కడైనా ఉచితంగా ఇసుక దొరుకుతుందా? నేడు ట్రాక్టర్‌ ఇసుక రూ. 5 వేలు. ఈ డబ్బంతా సాయంత్రానికి తాడేపల్లి కొంపకు వెళ్తోంది. నాసిరకం మద్యంతో పేదల రక్తం తాగుతున్నారు. మద్యం, మైనింగ్‌ లో లక్షల కోట్లు దోచుకుంటున్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం రేట్లు తగ్గించి, నాణ్యమైన మద్యం విక్రయిస్తాం. జగన్‌ రెడ్డి నియంత పోకడ పోతున్నాడు. ప్రశ్నించినవారిపై దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. 45 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఇంత పనికిమాలిన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు దుయ్యబట్టారు.

జగన్‌ తాను చేసిన తప్పులకు ఎమ్మెల్యేలను బలిపశువుల్ని చేస్తున్నాడు
5 ఏళ్లు చేసిన పాపాలు జగన్‌ ని వెంటాడుతున్నాయి. సర్వేలతో ఓటమి భయం పట్టుకుంది, అందుకే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలను ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారు. మీ ఇంట్లో చెత్త పక్కింట్లో వేస్తారా? కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ అన్నింటిలో దోపిడీకి పాల్పడుతున్నాడు. ఆయన్ని ఎందుకు మార్చలేదు? యర్రగొండపాలెంలో మంత్రి బట్టలిప్పి తిరిగాడు, ఆయన్ని కొండపికి మార్చారు. యర్రగొండపాలెం చెత్త తీసుకెళ్లి కొండపిలో వేస్తే బంగారం అవుతుందా? మార్కాపురం ఎమ్మెల్యే.. నయా నయీం, వాళ్ల తమ్ముడు చోటా నయీం అని అక్కడి ప్రజలే అంటున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే పోటీచేయలేనని పారిపోయాడు. సంతనూతలపాడు ఎమ్మెల్యేకు ప్రతి పనిలో వాటాలే.. ఆయనకు సీటు లేదు. రాష్ట్రం, జిల్లా అంతా నాదే అన్న బాలినేని అడ్రస్‌ గల్లంతైంది. ఇది రాజకీయమా? జగన్‌ తాను చేసిన తప్పులకు తన ఎమ్మెల్యేలను బలిపశుల్ని చేశాడని చంద్రబాబు విమర్శించారు.

గౌరవ సభలోనే అడుగుపెడతా
వైసీపీలో ప్రజా సేవ చూసి కాదు.. నన్ను, పవన్‌ ని, లోకేశ్‌ని తిట్టిన వాళ్లకే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లిస్తారంట. నన్ను, మా ఆవిడను అసెంబ్లీ సాక్షిగా బూతులు తిడితే పెద్ద నాయకులు అవుతారా? 23 క్లైమోర్‌ బాంబులకే నేను భయపడలా? కానీ నా భార్యను అసెంబ్లీలో తిట్టినపుడు జీవితంలో మొదటిసారి బాధపడ్డా. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. మళ్లీ గౌరవ సభగా మార్చాకే సభలో అడుగు పెడతానని శపధం చేశా. నా శపధం నెరవేర్చుతారా? నేను అధికారం కోసం రాలేదు. తెలుగు జాతిని నెం. 1 చేయాలన్నదే నా తపన. నాడు ఐటీిని అభివృద్ది చేయటం వల్లే నేడు తెలంగాణకు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వస్తోంది. త్వరలో తెలుగు జాతి ప్రపంచంలోనే శక్తివంతమైన జాతిగా తయారవుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

పేదల కోసమే సూపర్‌ సిక్స్‌
టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తాం, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం కింద ఒక్కొక్కరికిరూ. 15 వేలిస్తాం. ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. నిత్యావసరాల ధరలు తగ్గిస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. రైతులకు అన్నదాత పథóకం కింద ఏడాదికి రూ. 20 వేలిస్తాం. మైక్రో ఇరిగేషన్‌ తెస్తాం, రైతులను అన్ని విధాల ఆదుకుంటాం. యువత ఈ 100 రోజులు కష్టపడాలి. సైకిలెక్కి టీడీపీ జెండా పెట్టుకోండి, మీకు దారి చూపిస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తాం. డీఎస్సీ ఇస్తాం, ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తాం, ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం. సురక్షిత మంచినీరు అందిస్తాం. జగన్‌ రెడ్డి వెలుగొండ కాంట్రాక్టర్లను మార్చాడు కానీ, ప్రాజెక్టు పూర్తి చేయలేదు. వెలుగొండ పనులను నేనే ప్రారంభించా, మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే వెలుగొండ పూర్తి చేస్తాం. టీడీపీకి బీసీలు వెన్నెముక.. వారి రుణం తీర్చుకుంటా. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రోత్సహిస్తాం. మైనార్టీలకు రంజాన్‌ తోఫా కూడా ఇవ్వలేదు. ఎస్సీలకు 30 సంక్షేమ పధకాలు రద్దు చేశారు. ఎస్సీ యువకుడిని చంపి డోర్‌ డెలివరి చేసిన వైసీపీ ఎమ్మెల్సీని జైలు నుంచే ఊరేగింపుగా తీసుకెళ్తారా? ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఆదుకునే బాధ్యత నాది. వైసీపీ పాలనలో వాలంటీర్‌ కి ఉండే గౌరవం కూడా సర్పంచులకు లేదు. నిధులు, విధులు లేవు. స్థానిక, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమర్థంగా ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. నిధులు లేక సర్పంచులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. సర్పంచ్‌ లకు గౌరవం పెంచే బాధ్యత టీడీపీదేనని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ప్రకాశం జిల్లాను అన్ని విధాల అభివృద్ది చేస్తాం
టీడీపీ హయాంలో కనిగిరికి ట్రిపుల్‌ఐటీ తెస్తే జగన్‌ ఒంగోలుకి తీసుకెళ్లి ప్రయివేట్‌ భవనంలో పెట్టారు. త్రిపుల్‌ ఐటీని మళ్లీ కనిగిరికే తీసుకువస్తాం. నాడు నేషనల్‌ ఇండస్ట్రీస్‌ మ్యానుపాక్చరింగ్‌ జోన్‌ పెట్టాం. అది వచ్చి ఉంటే ఇక్కడి పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వచ్చేవి. దాన్ని తీసుకొచ్చే బాద్యత మాది. ఐదేళ్లలో రామాయపట్నం పోర్టును పూర్తి చేయలేకపోయారు. నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గం పూర్తి చేస్తాం. ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్య లేకుండా చూస్తాం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీరు ఇస్తాం. ఇది మెదటి దశలో పూర్తి చేస్తా. గుండ్లకమ్మ, కొరిశపాడు ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు తీసుకెళ్లి గోదావరి నీరు ఇస్తాం. నాగార్జున సాగర్‌ కుడికాలువకు గోదావరి నీళ్లు తెచ్చి నీటి ఎద్దటి లేకుండా చేస్తాం. మార్కాపురం జిల్లా కావాలనే మీ కోరిక తీరుస్తాం. కందుకూరును ఒంగోలు జిల్లాలో కలుపుతా. ఒంగోలు, మార్కాపురం, కనిగిరిలో టిడ్కో ఇళ్లు పూర్తి చేయలేదు. టిడ్కో ఇళ్లు ప్రజల సంపద.. మీకు అప్పగించే బాధ్యత మాది. ప్రకాశం జిల్లాకు ఆక్వా, గ్రానైట్‌, ఫార్మా పరిశ్రమలు తెస్తాం. ప్రకాశం జిల్లా యువతకు స్థానికంగానే ఉపాధి కల్పిస్తాం. ప్రభుత్వం తెచ్చిన భూరక్ష చట్టం చాలా ప్రమాదకరమైంది. అది వస్తే మీ భూమి మీపేరు మీద ఉండదు. భూరక్ష చట్టం రద్దు చేస్తాం. ప్రకాశం జిల్లాలో జరిగిన భూకుంభకోణాలపై సిట్‌తో దర్యాప్తు చేస్తాం. ఆ భూములన్నీ తిరిగి ప్రజలకు అప్పగిస్తాం. ఒంగోలు టౌన్‌ లో అమృత్‌ పథకం కింద రెండు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులు నిర్మాణం ప్రారంభించి 80 శాతం పనులు పూర్తి చేశాం, మిగిలిన పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. ఆ పనులు తామే పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు.

కొత్త ఏడాది స్వర్ణ యుగం రావాలంటే రాతి యుగం పోవాలి
చిన్న పొరపాటు చేసి ఐదేళ్లు నరకం అనుభవించాం. కొత్త ఏడాదిలో అందరి జీవితాల్లో వెలుగులు రావాలి. కొత్త ఏడాది స్వర్ణ యుగం రావాలంటే రాతి యుగం పోవాలి. సైకో పాలన పోవాలి, సైకిల్‌ పాలన రావాలి. పాతికేళ్ల క్రితం నా ఆలోచన వల్ల తెలుగు యువత బాగుపడ్డారు. తెలుగు యువతకు అండగా నిలబడతాం. మీరు ఒక అడుగు ముందుకేస్తే నేడు వంద అడుగులు ముందుకేస్తానని చంద్రబాబు అన్నారు.
వివేకానందరెడ్డిని హత్య చేసి మొదట గుండెపోటు, రక్తపు వాంతులు అన్నారు. నాపై అభాండాలు వేసి, కోడికత్తి డ్రామా ఆడి అధికారంలోకి వచ్చారు. వివేకా హత్యపై నాడు సీబీఐ విచారణ కావాలన్నారు, అధికారంలోకి వచ్చాక సీబీఐ వద్దన్నారు. కోడికత్తి శ్రీను చేయని పాపానికి 5 ఏళ్ల నుంచి జైల్లో మగ్గుతున్నాడు. బాబాయ్‌ కూతురు సునీతపై కేసులు పెట్టారు. నేడు సొంత చెల్లెలు వేరే పార్టీలో చేరితే మనల్ని తిడుతున్నారు. నేరాలు, ఘోరాలు చేసి వాటిని ఎదుటివారిపైకి నెడుతున్నారు. టీవీ, పేపర్‌ ఉందని అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ముందు అమరావతే రాజధాని అన్నారు. ఎన్నికల తర్వాత మూడు రాజధానులు అన్నారు. సూపర్‌ సిక్స్‌ ద్వారా పేదరికం లేని సమాజాన్ని తీసుకువస్తా. సంపదను ఎలా పెంచుకోవాలో ప్రజలకు నేర్పిస్తా. సమర్థ నాయకత్వం కోసమే ఐవీఆర్‌ఎస్‌ ద్వారా అభిప్రాయాలు సేకరణ. నా నియోజకవర్గంలో కూడా నాపై అభిప్రాయం తీసుకుంటున్నానని చంద్రబాబు చెప్పారు.

రా…కదలిరా
తెలుగుజాతి స్వర్ణయుగం కోసం రా.. కదలి రా. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కోసం, మార్కాపురం జిల్లా కోసం, మీ పిల్లల ఉద్యోగాల కోసం, రైతన్నల బాగు కోసం, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల భవిష్యత్తు కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రా.. కదలి రా.. అంటూ చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరి భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. జగన్‌ రాజకీయాలకు అనర్హుడని చాటుతూ ప్రజలంతా ఒక్కటై తిరుగులేని మెజార్టీతో టీడీపీ, జనసేనను గెలిపించాలని చంద్రబాబు కోరారు.

Tags: ఎమ్మెల్యేలుతెలుగుజాతిపనికిమాలిన ముఖ్యమంత్రిబలిపశువులురా...కదలిరావెలిగొండసూపర్‌ సిక్స్‌స్వర్ణయుగం
Previous Post

పార్టీ అండగా ఉంటుంది

Next Post

అమ్మనే గెంటేసినవాడికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుంది

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026

November 14, 2026
పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం

November 14, 2026
ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

November 14, 2026
ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు

November 14, 2026
సీఐఐ సదస్సుతో ఏపీకి 303 ప్రాజెక్టులు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్

సీఐఐ సదస్సుతో ఏపీకి 303 ప్రాజెక్టులు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు

November 14, 2026
పారిశ్రామిక ఒప్పందాల అమలుపై..ఏటా ఆడిట్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్

పారిశ్రామిక ఒప్పందాల అమలుపై..ఏటా ఆడిట్ రిపోర్ట్

November 14, 2026
Next Post
అమ్మనే గెంటేసినవాడికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుంది

అమ్మనే గెంటేసినవాడికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుంది

ముఖ్య వార్తలు

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

by చైతన్యరధం
November 13, 2026

యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

by చైతన్యరధం
November 13, 2026

52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

by చైతన్యరధం
November 13, 2026

ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

by చైతన్యరధం
November 13, 2026

25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026

by కార్యకర్త
November 14, 2026

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం

by చైతన్యరధం
November 14, 2026

ఏపీలో గ్రీన్ ఎనర్జీ, ఐటీ, క్రీడా రంగాల్లో విస్తృత అవకాశాలు పెట్టుబడులకు ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌కు సీఎం చంద్రబాబు ఆహ్వానం విశాఖపట్నం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికవేత్తలకు ఒక్క...

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

by చైతన్యరధం
November 14, 2026

ఏపీ ప్రగతి నమూనాను ప్రపంచానికి చాటుతాం ‘టైమ్’ ఇంటర్నేషనల్ ఎండీ డామియన్ డగ్లస్ రాష్ట్రంలో శరవేగంగా ప్రాజెక్టుల ప్రారంభం ఆరు నెలల్లోనే ‘గూగుల’ ఏఐ హబ్‌కు శంకుస్థాపన:...

ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు

ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు

by చైతన్యరధం
November 14, 2026

సీఐఐ సదస్సు రెండో రోజు సీఎం సమక్షంలో 12 ఎంఓయూలు జేఎస్‌డబ్ల్యూ, ఇండియన్ ఆయిల్, ఎయిర్ ట్రంక్-జేసీకే ఇన్ ఫ్రా కంపెనీల ఒప్పందాలు ప్రతిష్టాత్మక పీ4 కార్యక్రమానికి...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.