అమరావతి: వచ్చే ఏడాది జనవరి కల్లా రోడ్లపై ఒక్క గుంత కనపడకూడదంటూ మూడేళ్లుగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతీఏటా ఇచ్చే స్టేట్మెంట్లో ఒక్క అక్షరమూ మారలేదు.. రోడ్ల దుస్థితీ మారలేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవాచేశారు.ఇలా బురదలో పొర్లు దం డాలు పెడుతూ తమ గ్రామానికి రోడ్డువేయాలని విన్న విస్తున్నది సీఎం జగన్‌రెడ్డి సొంత కడపజిల్లా, బిమఠం మండలం,కొత్తబసవాపురం సోమిరెడ్డిపల్లి పంచాయతీ వార్డు సభ్యుడు. ఇది ప్రభుత్వంపై బురద చల్లే కుట్ర అని సీఐడీ సుమోటోగా కేసునమోదు చేసి బురదని ఫోరెన్సిక్‌కి పంపి, పొర్లుదండాలు మార్ఫింగ్ అని ప్రెస్ మీట్ పెట్టొద్దు ప్లీజ్. అన్నింటికీ బటన్ నొక్కుతున్న సీఎం గారూ దరిద్రపు రోడ్లు బాగుఅయ్యేలా ఒక సారి బటన్ నొక్కితే గ్రామస్తులకి ఈ బురదలో పొర్లు దండా లు పెట్టే బాధఉండదు. నిరసన తెలిపేవారిపై తప్పుడు కసులు బనాయించి అక్రమఅరెస్టులుచేయాల్సిన టాస్క్ సీఐడీకి తప్పుతుందని లోకేష్ చురకలంటించారు.